CHIDAANAMDAROOPAA-NAMDEESVARA


 చిదానందరూపా--నందీశ్వర
 **********************
 కలయనుకొందునా  నిటలాక్షుడు  కలడనుకొందునా
 కలవరమనుకొందునా  కటాక్షించిన  వరమనుకొందునా

 వరపుత్రునికై  కఠోరముగ  ప్రార్థించెను  శిలాదుడు  పరమేశుని
 ఫలితముగ అయోనిజుడై  ఆనందుడు ఆవిర్భవించెగ  యజ్ఞవాటికను

 సకలవిద్యలు కరతలామలకములైనవి శివానుగ్రహమున బాలునికి
 మిత్రావరుణుల వారికి చేసిన సేవలైనది  భావిసూచకము

 "దీర్ఘాయుష్మాన్ భవ" అను దీవెన చేరగ  తడబడినది
  కారణజన్ముడు  కైలాసమును  చేరవలసిన  తడవాయినది

  సత్యము-ధర్మము-శాంతము-శౌచము అను నాలుగు పాదములతో
  ఆశీర్వదించబడి హరునికి నందివాహనమగుటకు కారణమాయెగ

  చిత్రముగాక  ఏమిటిది  చిదానందుని లీలలు గాక
  చిత్తముచేయు  శివోహం  జపంబు  చింతలు తీర్చును గాక.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI