Friday, December 8, 2017

CHIDAANAMDAROOPAA-SARANU SARANU BASAVESVARA


 చిదానందరూపా-శరణు-శరణు బసవేశ్వర
 *********************************
 కలయనుకొందునా   నిటలాక్షుడు  కలడనుకొందునా
 కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా

 ఆదిదేవుని  ఆనందుడు మాతరస-నాగమాంబికలకు
 ఆదియోగియై  అవతరించెను పుట్టు అగ్రహారమున

 కదలని-మెదలని యోగనిద్రకు కలవరమందిరి  దంపతులు
 ఊడల జంగమదేవుడు అలదిన  ఊదియె వారికి ఉత్సాహమునిచ్చెను

 ధర్మ సూక్ష్మముల అధిష్ఠానమైనది అక్కడి అనుభవ మంటపము
 ధర్మాత్ముని పాదములే స్తంభములు, శిరసైనది  పసిడి కలశము

 ధర్మస్థాపనకై చేసిన వచనములు సర్వత్ర శివునే చూపగ
 సర్వేశ్వరుచేరగ భక్తితో చేసిన శరణు ఘోషలే కారణమాయెగ

 చిత్రముగాక  ఏమిటిది  చిదానందుని లీలలు  గాక
 చిత్తముచేయు  శివోహం జపంబు చింతలు తీర్చును గాక.   

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...