Wednesday, January 24, 2018

DESABHAKTI-GANATANTRA DINOTSAVAMU.

సాహో స్వాతంత్రమా ! జయహో గణతంత్రమా!
******************************************
శ్రీ అంబేడ్కర్ అందించిన అద్భుత అభంగమా
భారత రాజ్యాంగమను భవితవ్యపు మంత్రాంగమా
అణువణువున గణగణమని జనగణమన పాడుతుంటే
సాహో స్వాతంత్రమా ! జయహో గణతంత్రమా!
అల్లూరి వీరత్వము _ ఆనందుని వివేకము
కలనేతగ నేసినది ఆ కాషాయపు రంగు
ఆ గాంధీ ఆశయాలు _ ఆ థెరెసా ఆచరణలను
మగ్గముపై నేసినది మధ్యనున్న తెలుపు రంగు
పంచ భూతములు శుచిగ- పంచ భక్ష్య రుచులుగ
పల్లెరైతు నేసినది ఆ ఆకుపచ్చ రంగు
ఇరవై నాలుగు ఆకులు -ఇరవై నాలుగు గంటలు
నీలివృత్త నృత్యము నిరంతర ప్రయత్నము
ఆకులన్ని సమానము వ్యాకులతా నిర్మూలనము
ధర్మపు నడిబొడ్డు చూడు అశోక ధర్మచక్రము
నేతల చాతుర్యమనే నేతగల మన పతాక
ఉయ్యాల-జంపాల నేల-నింగి ఊగుతుంటే
ప్రగతికి ప్రతీకగా పైపైకి ఎగురుతుంటే
గణనీయము కాదా మన గణతంత్ర దినోత్సవము.
జైహింద్.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...