SIVA SANKALPAMU-25

అగ్ని కార్య ఫలితములు అన్నీ ఇంద్రునికైతే
బృహస్పతి చేరాడు బుద్ధితో ఇంద్రుని
సరస్వతి చేరింది బృహస్పతిని చూసి ఆ ఇంద్రుని
వరుణుడు చేరాడు ఆదరణకై ఆ ఇంద్రుని
భూమికూడ చేరింది ఈవి కోరి ఆ ఇంద్రుని
గాలి వీచసాగింది నేరుగా ఆ ఇంద్రుని
విష్ణువు చేరాడు స్పష్టముగా ఆ ఇంద్రుని
అశ్వనీ దేవతలు ఆశ్రయించారు ఆ ఇంద్రుని
అవకాశమిది అని ఆకాశముం చేరింది ఆ ఇంద్రుని
పంచభూతములు నిన్ను వంచించేస్తుంటే
స్వార్థమంత గుమికూడి అర్థేంద్రముగా మారింది
నిన్ను ఒక్కడినే వేరుచేసి ఓ తిక్క శంకరా.
......................................................................................................................................................................................................వేద శాస్త్ర ప్రకారము దేవతలు యజ్ఞకృత హవిస్సును ఆహారముగా స్వీకరిస్తారు.ఆ హవిస్సులో సగభాగము తాము కూదా పొందాలనిబృహస్పతి,సరస్వతి,వరుణుడు(వాన దేవుడు)భూమి,వాయువు,ఆకాశము,విష్ణువు అది గమనించని శివుని పిలువకుండా తెలివిగా ఇంద్రుని ఆశ్రయించారు.శివుడు వెళ్ళలేకపోయాడు అని నింద.
ఇంద్రుడు అనునది వ్యక్తి కాదు.ఒక పదవి.(మనకు ప్రధాన మంత్రి,ముఖ్య మంత్రి వలె)యజ్ఞ ఫలితముతో ఇంద్రుడు (శివుడు) విరాజిల్లుచుండగ అతనిని ఆశ్రయించిన వారికి (అర్థి-యాచకుడు)
దాతయై అర్థేంద్రముగా శివుడు ప్రకాశించు చున్నాడు.అర్థ అను పదమునకు నిందలో సగ భాగము.స్తుతి లో అడిగి తీసుకోదలచిన వారి మనోభావము.(పెద్దలు లోపములను సవరించగలరు) అర్థ శబ్దము ఇక్కడ శివునికి ఈయగల శక్తిగలవాడు,పొందుచున్న యాచకుడు (అర్థి) ఇద్దరికి వర్తిస్తుంది.
( ఏక బిల్వం శివార్పణం)

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI