Saturday, March 3, 2018

SAUMDARYA LAHARI-25

 సౌందర్య లహరి-25

 పరమ పావనమైన నీ పాదరజ కణము
 పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

 తామస గుణములను వదిలి తామరస దళ నేత్రికి
 తాదాత్మ్యతతో చేయుచున్న తామరపూల పూజలు

 రాజస గుణములను వదిలి రాజీవదళనేత్రికి
 పరవశముతో చేయుచున్న పరిమళ ద్రవ్య పూజలు

 చంచల గుణములను వదిలి మంచుకొండ తల్లికి
 మించిన భక్తితో చేయుచున్న  ధూపదీప పూజలు

 వాదములను గుణములను వదిలి  వేదమైన తల్లికి
 చర్చలు వీడిన మనసు దేవతార్చన యైన వేళ

 నీ మ్రోలనే నున్న  నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి! ఓ సౌందర్య లహరి.  

" పూజ చేయుదము రారె-పొద్దుపోయె శ్రీదేవికి"

  ఏలా లవంగి పూలతో జాజి చంపకములతో
  మాలతి మందారలతో మాహేశ్వరి పాదములకు"

  పూజా ద్రవ్యములతో, శాస్త్రోక్త-మంత్రోక్త ప్రకారముగా చేయు విధానము అర్చనము.సాకార మూర్తికి ద్రవ్యభక్తితో కొలుచు ప్రక్రియ.పంచామృతములు,పంచేంద్రియములు,పంచభూతములు పూజలో పాలు పంచుకుంటాయి.అగ్ని కార్యము,యజ్ఞ యాగాది క్రతువులు అర్చనకు సంబంధించినవే.సమయ సందర్భమును బట్టి సంకల్పించిన కోరిక తీరుటకు అర్చన విధానములు అనుగుణముగా ఉంటాయి.నోములు-వ్రతములు-జాతరలు-ఉత్సవములు అర్చనకు సంబంధించినవే.పూర్వము గోదా దేవి గోపికలతో కూడి కాత్యాయిని వ్రతమను అమ్మ అర్చనమును సలిపితినని స్వయముగ చెప్పినది.దేవిశరన్నవరాత్రములు సుప్రసిద్ధమే.మంగళగౌరి వ్రతము-వరలక్ష్మి వ్రతము శ్రావణమున శుభప్రదమని తల్లిని అర్చించుచు,అనుగ్రహమును పొందుచున్న సమయమున చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు. 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...