SAUNDARYA LAHARI-34

సౌందర్య లహరి-9
పరమ పావనమైన నీ పాదరజ కణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

ధ్యానము,ధ్యాత,ధ్యేయము మూడు నీవేనని
బాల్య,కౌమార,యవ్వన,వార్థక్యములు నాలుగు నీవేనని
నీరు,నిప్పు,నింగి,నేల,గాలి ఐదు నీవేనని
కామ క్రోధాది గుణదోషములు ఆరు నీవేనని
సంగీత స్వరములు ఏడు నీవేనని
సప్త ధాతువులు మనసు ఎనిమిది నీవేనని
నవావరణములోని నవనవోన్మేషము నీవేనని
నన్ను ఆవరించుకొనిన మాయ తాను మాయమగుచుండగా
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ఓ సౌందర్య లహరి.
భావము
నా మనసనే తోటలో విహరించుచున్న తల్లీ.ఏది ధ్యానమో,ఎవరు ధ్యానించుచున్నారో,ఎవరిని ధ్యానించుచున్నారో మూడును పరమాత్మ స్వరూపములే.జీవితపు నాలుగు దశలు,పంచ భూతములు,అరిషడ్వర్గములు,సప్త ధాతువులు(రస,రక్త,మాంస,మేథ,అస్తి,నుజ్జు అను ఏడు ధాతువులు,మనసు భగవంతుని స్వరూపములే.నవావరణము లోపల ప్రకాశించు పవిత్ర మూర్తివి నీవని నన్ను కమ్ముకొనిన మాయ తొలగిపోవు చుండుటచే గ్రహించి,నీ దయచే ,నీ చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)