Saturday, March 10, 2018

SAUNDARYA LAHARI-36

సౌందర్య లహరి-35
పరమ పావనమైన నీ పాదరజ కణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
శాంతము మూర్తీభవించు శాంభవి నేత్రములు
శివుని చూచుచున్న వేళ శృంగారభరితములు
శివేతరుల పట్ల భీభత్స వేత్రములు
శివ కథలను వినునపుడు విస్మయ పూరితములు
గంగమ్మను రోషముతో,పద్మములను వీరముతో
పాములను భయముతో,చెలికత్తెలను హాస్యముతో
నాయందు కురిసేటి కరుణ జలపాతములు
నీ అభినయ నవరసములు నేత్రోత్సవమగుచున్న వేళ
నీ చెంతనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ఓ సౌందర్య లహరి.
" కంజ దళాయతాక్షి-శ్రీ కామాక్షి","అన్నపూర్ణే విశాలాక్షి-అఖిల జగతి సాక్షి","దేవి మీనాక్షి ముదం దేహి" అని ముత్తుస్వామి దీక్షితారు,"సరోజ దళనేత్రి" అని శ్రీ శ్యామ శాస్త్రి,ఇంకా ఎందరో తల్లి నేత్ర మహిమను వర్ణించుతు తన్మయులై తరించినారు.అమ్మ వారి నేత్రములు అఖిల చరాచర జగతికి సాక్ష్యములు.అసుర సంహరణకు అగ్నిగోళములు.ఆశ్రితుల పాలిటి అమృతవృష్టులు.దుర్మార్గమునకు పారద్రోలు భయంకరమైనబెత్తములు.శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము "అరుణాం కరుణాంతరంగతాక్షిం".అని
కీర్తించుచున్నది."వికచాంభోరుహాదళ లోచని"గా అష్టోత్తరము స్పష్టము చేయుచున్నది.పద్మము జ్ఞానమునకు సంకేతములు.అమ్మవి మాంస నేత్రములు కావు.విశాలనయములతో వీక్షించి,కామితార్థములను అనుగ్రహించి
కామాక్షిగా,మధురభక్తిని అనుగ్రహించే మీనాక్షిగా అమ్మ శక్తిని గుర్తించుట అనుగ్రహ విదితము.తల్లి కరుణ రసమును అందిస్తుంది తప్ప అభినయించదు.తక్కినరసములను లీలగ ప్రసాదిస్తుంది అని తెలుసుకొనుచున్న సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు
.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...