Monday, April 23, 2018

SAUNDARYA LAHARI-104


 సౌందర్య లహరి-పద్మరాగమణిప్రాకారము

 పరమ పావనమైన నీ పాదరజకణము
 పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

 దశయోజన విస్తీర్ణపు ధర్మ సంస్థాపనము
 ఆయుధముల రణసామాగ్రుల  భాండాగారము

 పింగళాక్షి-విశాలాక్షి-వాగీశీ-బహురూపాది
 కయ్యానికి కాలుదువ్వు  అరువది నాలుగు శక్తులు

 అసంఖ్యాకములు అచట రథాశ్వ గజములు
 అసమాన పరాక్రమ వీరులు-అరివీర భయంకరులు

 యోగి హృత్ పద్మనివాసిత  సంకల్పిత  తేజో
 పద్మ మణి ప్రాకారమున నేను పరిణితి పొందుచున్నవేళ

 నీ  మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి! ఓ సౌందర్య లహరి.

 "అరుణాం కరుణాంతరంగతాక్షి" సంకల్పిత పద్మరాగ మణి ప్రాకారము రక్షక స్థానము.చతుషష్టి కళలనెడు అరవై నాలుగు శక్తిస్వరూపములు-అరివీర భయంకరులైన వీరులు ధనుర్బాణ ధరులై,ధర్మపాలన చేస్తుంటారు.అసంఖ్యాక రథములు-గజములు-అశ్వములు-యుద్ధభూమి పయనమునకు సిద్ధముగా ఉంటాయి.ఆదిశక్తి అరివీరభయంకర సంకేతముగా,కుంకుమ సమ అరుణకాంతి భూభాగములో మండపములు-పక్షులు-వృక్షములు-ద్వారములు-సరోవరములలో పద్మరాగమణుల కాంతులు ప్రకాశించుచున్నవి.అమ్మదయతో నాలోని అరిషడ్వర్గములు అంతరించుచున్న సమయమున,చెంతనే నున్న నాచేతినివిడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.



No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...