Tuesday, April 24, 2018

SAUNDARYA LAHARI-105

 సౌందర్య లహరి-గోమేథికప్రాకారము

 పరమ పావనమైన నీ పాదరజకణము
 పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

 త్రిభువనేశ్వరి సంకల్పిత జపాకుసుమ సన్నిభము
 దశయోజన ఔన్నత్యము-దండనా సన్నద్ధము

 ఇంద్రాణి-రుద్రాణి-నారయణాది ముప్పది రెండు శక్తులు
 ఒక్కొక్క మహాశక్తికి పది అక్షౌహిణీ సైన్యములు

 (అక్షౌహిణీ-21,870 రథములు,21,870 ఏనుగులు,65,610 అశ్వములు,1,09,360 కాలిబంట్లు.)

 విద్య-పుష్టి-సినీవాలి-ప్రభ-నందాది సకలసద్గుణములు
 మెప్పు కలిగియున్నవి ముప్పదిరెండు లోకములు

 అందరు అసమాన పరాక్రమ సంపన్నులు-అజేయులు
 గోమేథిక ప్రాకారములో నా మేథోమథనమగుచున్న వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానసవిహారి ! ఓ  సౌందర్య లహరి.

మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా సంకల్పిత గోమేథిక ప్రాకారము మందారకుసుమ ఎర్రని రంగుతో తాపస మందారి కరుణ ప్రకాశిస్తుంటుంది.ఈ ప్రాకారములో తరువులు.ఆకులు,పండ్లు,భూమి.దేవతశక్తుల ఆభరణములు అన్ని గోమేథిక మణిమయమే.ఎర్రని వీరతిలకమా అన్నట్లు శక్తులు-వీరులు తేజోవంతులై ఉంటారు.ఇక్కడ బుద్ధి,జ్ఞానము,పుష్టి,విద్య సర్వజీవులను ఆదరిస్తూ-అనుగ్రహిస్తుంటారు..తల్లి తేజము నాలో ప్రచోదనమైనదేమో !పరాశక్తి ప్రణామములు. నా మనసు -బుద్ధి ఒకటికొకటై తల్లి తత్త్వముతో తన్మయమగు సమయమున,చెంతనేనున్న నాచేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.(సినీ వాలి-ఒక్కొ అమావాస్య యందు సన్నని రేఖలా కనిపించు చంద్ర రేఖ.)





No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...