SAUNDARYA LAHARI-93

 సౌందర్య లహరి-సరస్వతీదేవి

 పరమపాబనమైన  నీ పాదరజకణము
 పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

 అమృత- ఆకర్షిణి-ఇంద్రాణి-ఈశాని-ఉషకేశాది
 పదహారు  అక్షరములు విశుద్ధ పద్మ రేకులు

 తక్కిన అక్షరములు వివిధ చక్రములలో రేకులు
 హ్రస్వ-దీర్ఘ-ప్లుతములు,ఉదాత్త-అనుదాత్త స్వరములు

 నాసిక-నిరనునాసిక విధానముతో పద్దెనిమిది భాగములు
 సంగీత  స్వర ప్రస్థానములు,సారస్వత రూపములు

 మాయాసతి కుడిచేయి మారినది  శైవీముఖముగా
 సర్వజ్ఞ పీఠ సరస్వతి సాహిత్యరూపమైన  వేళ

 నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
 మానస విహారి ! ఓ సౌందర్య లహరి.

  " జ్ఞానప్రదా సతీమాతా కాశ్మీరేతు సరస్వతీ
    మహావిద్యా మహామాయా భక్తిముక్తిప్రదాయినీ"

   " కశ్మీరేతు సరస్వతి". క శబ్దము శిరస్సును సూచిస్తుంది.కశ్మీరము జ్ఞానప్రధాన కేంద్రము.ఇక్కడిది సర్వజ్ఞపీఠము. ఏ ప్రదేశమునుండి పండితులు ఇక్కడకు వచ్చి విజయము సాధిస్తారో ఆ వైపు ద్వారము తెరువబడేదట. ఆదిశంకరులు తమ ప్రతిభచే అప్పటివరకు తెరువని దక్షిణ ద్వారమును తెరిచారట.కశ్మీరమును శైవీ ముఖము అనికూడా అందురు.శివ జ్ఞానమును శైవీముఖము అందురు.ఇక్కడ జ్ఞాన విచారణకు ప్రాధాన్యతగలదు.

      " అక్షరాభ్యాసములోనే" యోగశక్తి  నిక్షిప్తము అయివున్నది..వర్ణము అనగా అక్షరము-రంగు అని రెండు అర్థములు కలవు." అమృత,ఆకర్షిణి,ఇంద్రాణి,ఈశాని,ఉషకేశి,ఊర్థ్వ,ఋద్ధిద,ౠకార,ఌకార,ఌఊకార ,ఏకపద,ఐశ్వర్య,అంబిక,అక్షర అను అమ్మ శక్తులు పదహారు రేకుల "విశుద్ధి చక్రము" యై కంఠమునందు,తక్కిన అక్షరములు వివిధచక్రములుగా ,అక్షర లక్షణములుగా భాసించుచున్న సమయమున చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు
..


Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI