Thursday, April 19, 2018

SAUNDARYA LAHARI-99


  సౌందర్య లహరి-ఇత్తడి ప్రాకారము

 పరమపావనమైన  నీపాదరజకణము
 పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము


 అతిమనోహరము ఐదవ హారకూట ప్రాకారము
 అగుపించును హరిచందన వాటికల హర్షాతిరేకము

 మేఘదంతి- మదవిహ్వల-వాయుధారాది ద్వాదశ శక్తులకు
 నభశ్రీ-నభస్యశ్రీ ల నాయకుడు మేఘవాహనుడు

 పింగళ నయనములతో, వజ్ర సదృశ గర్జనలతో
 కుండపోత వర్షములను మెండుగ కురిపిస్తున్నాడు


 సిద్ధులు తమ సతులతో హర్షముతో నున్నారు
 ఇత్తడి ప్రాకారములో నేను  చిత్తడి అగుగుచున్న  వేళ

 నీమ్రోలనే నున్న నాకేలు విడనాడకమ్మా,నా
 మానసవిహారి! ఓ సౌందర్య లహరి.


 దయార్ద్ర-నిష్కళంక- నిర్విరామ అమృతాధారా ప్రవాహ మయము, ఏడు యోజనముల విస్తీర్ణముగల ఇత్తడి ప్రాకారము.స్థలము-సమయము-సందర్భములను గమనిస్తూ,మేఘవాహనుడు (శ్రావణ-భాద్రపదములైన) నభశ్రీ-నభస్య శ్రీ అను తన రాణులతో పాటు ,సర్వస్య-రస్య మాలిని-నితంతి-భ్రమయంతి-వర్షయంతి-వారిధార-మేఘయంతిక -వారిధార-చిపుణిక-మదవిహ్వల అను శక్తులను కూడి,తల్లి సంకేతానుసారముగా( నిమిత్తమాత్రుడై) వర్షిస్తూ.బాధాతప్త హృదయాలకు చలివేంద్రమై వర్షిస్తుంటాడు.జయహో  జగదీశ్వరి.అక్కడచిత్ప్రకాశ ధారలలో చిత్తుగా నేను తడుస్తున్నను.నాతో బాటుగా   అనేకానేక సిద్ధులు-దేవతలు ఉల్లాస భరితులై సతీ సమేతులై ఆ పవిత్రధారలలో పునీతులగుచున్న సమయమున చెంతనే నున్న నాచేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.




No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...