Monday, May 21, 2018

AMGEERASUDU NAANNA.


 శ్లాఘించే సంతానమును చూడాలి అని,నమ్మి
 శ్వాసించే బొమ్మను నాన్నకు అందించింది అమ్మ.

 నాన్న ఇచ్చిన జ్ఞానముతో గాజుకన్ను చూస్తోంది
 ఆఘ్రాణిత శక్తి నాసికను సుసంపన్నము చేస్తోంది

 ఒదిగిన  వాక్శక్తి పెదవులతో పలుకరిస్తోంది
 తథాస్తుగ మేథాశక్తి మధువులు చిలుకరిస్తోంది

 చేవలేని విషయాలను చేయి చూపగలుగు తోంది
 కాని పనులపై నేడు కాలుదువ్వ గలుగుతోంది

 నా దశేంద్రియముల దిశానిర్దేశమే,నిరంతర
 తన విద్యుక్త ధర్మముగా ఉద్యమించిన నాన్నను

 గుండెగుడిలోని దేవునిగా గుర్తించలేని నేను
 విజయోత్సవ సభలో విద్యుత్తు లేక,

 మూగబోయిన  మైకును.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...