Monday, October 1, 2018

SIVA PRADOSHASHTAKAMU.

 శివ ప్రదోషాష్టకము.
***********************



1. ఓ మూఢ!

   శివపాదము చూడవు-భక్తితో మోకరిల్లవు
   శివనామము పలుకవు -తరియింపగలేవు
   శివకథ చిత్తగించవు -వేగిర శరణను
   శివపద నర్తనామయ ప్రదోషవేళనన్.

2.రత్నఖచిత సింహాసీనురాలు శ్రీగౌరి
  ప్రసీద నృత్యమునకు సంసిద్ధమౌ శూలపాణి
  కైలాసగిరి మీద కొలువైనారు వేడుకొన
  సుర ప్రస్తుత పశస్తము ప్రదోష సమయము.

3. గంధర్వ యక్ష విద్యాధర సిద్ధ సాధ్య సకల
   పశుపక్షి సర్ప అప్సరసాంగన సమూహము
   కొలువ శివుడే ! ఇతరము లేదేది యనుచు
   ప్రక్కననిలబడినారీ ప్రదోష వేళనన్.

4.శ్రీవాణి వీణ దివిజేంద్రిత బ్రహ్మాది సతతం
  శ్రీలక్ష్మి గాత్ర-హరి మద్దెల నాద స్తోత్ర సేవ
  ముకుళిత హస్త వలయస్థిత సురవందిత
  పశుపతి పరమాద్భుత ప్రదోష వేళనన్.

5.సంసార జలధిని మునిగిన దరికానని
  ఆర్తత్రాణ రక్షణము డమరుక రవం
  శివ కరపద కదలిక క్షిప్ర కటాక్షము
  పరమానంద ప్రదము ప్రదోషశివనృత్యము.

6.పరమేశ్వర పదాంబురుహ పూజనము పుణ్యం
  ఇది సత్య వచనం పరలోకహితం పావనం
  ఇది ఉపనిషదధ్యయనం సర్వార్థ సుఖదం
  ఇది అజ్ఞాన తిమిర సంహరం అంత్య సాయుజ్యం.

7.శివతాండవ ప్రీతి ప్రదోష సమయమిదియె
  సకుటుంబ బంధుమిత్ర శుభదం ఇహంపరం
  పరమేశ్వర సంతత పద్మపుష్పార్చన ఫలం
  సౌభాగ్యదం సంప్రీత సదాశివాంఘ్రి సేవనం

8.ఇది ప్రదోషం  జగమంత శివము
  హరి బ్రహ్మ ఇతరం శివస్వరూపం
  వేరెవరు లేరు సర్వం శివోహం
  సాక్షాత్కరించు సురాధినాథ.

 ఇతి శ్రీ స్కాంధపురాణాంతర్గత  శివ ప్రదోష స్తోత్రాష్టకం సంపూర్ణం. 

   ( ఏక బిల్వం శివార్పణం)

     ఓం తత్ సత్.

  శివస్వరూపులు నా ప్రయత్నలోపములను సవరించి,నన్ను ఆశీర్వదించెదరు గాక.

7

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...