Friday, April 26, 2019

NAH PRAYACHCHANTI SAUKHYAM-16

   నః ప్రయచ్చంతి సౌఖ్యం-16
   ************************

   భగవంతుడు జలస్వరూపుడు-భక్తులు జలస్వరూపులు.

    " ఓం నమో శీభాయచ శుభకరాయచ"

    ప్రసాదగుణముతో ప్రవహించు పరమేశ్వరునకు నమస్కారములు.


  పంచభూతలలోనిదైన జలము భూతలము నాలుగింట మూడు వంతులు చలమలు,మడుగులు,తటాకములునదులు,సముద్రములవంటి ఉపరితలజలములతో కూడి ఉంటుంది.ఇది మనకంటికి కనపడు స్థూలతత్త్వము.

 జలము జీవుల శరీరములలో 70 నుండి 90 శాతము వరకు ఉండి మానవశరీరమును అతి సమర్థవంతముగా పనిచేయిస్తుంది.ఇది జల సూక్ష్మ తత్త్వము.స్థూల తత్త్వముగోచరమయితే సూక్షము అగోచరము చర్మచక్షువులకు.నిశితముగా పరిశీలిస్తే స్థూలములోను-సూక్ష్మములోను ఈశ్వరచైతన్యముగా ప్రకాశించు జగదీశ్వరుడే జలము.

  "ఓం నమో వైశంతాయచ"

   "విశ్వేశ్వరుడే విశ్వవ్యాప్త ద్రావణి"


  పంచభూతలలోనిదైన జలము భూతలము నాలుగింట మూడు వంతులు చలమలు,మడుగులు,తటాకములునదులు,సముద్రములవంటి ఉపరితలజలములతో కూడి ఉంటుంది.ఇది మనకంటికి కనపడు స్థూలతత్త్వము.

 జలము జీవుల శరీరములలో 70 నుండి 90 శాతము వరకు ఉండి మానవశరీరమును అతి సమర్థవంతముగా పనిచేయిస్తుంది.ఇది జల సూక్ష్మ తత్త్వము.స్థూల తత్త్వముగోచరమయితే సూక్షము అగోచరము చర్మచక్షువులకు.నిశితముగా పరిశీలిస్తే స్థూలములోను-సూక్ష్మములోను ఈశ్వరచైతన్యముగా ప్రకాశించు జగదీశ్వరుడే జలము.

  "ఓం నమో వైశంతాయచ"

   "విశ్వేశ్వరుడే విశ్వవ్యాప్త ద్రావణి"

  జలపాతములలా కొండలపైనుండి జారుతూ,మేఘ గర్జనలతో వర్షముగా మారుతూ,భూగర్భమునదాగి అదనుచూసి పైకి ఉబుకు జలమును,నీరు-తోయము-ఉదకము-పయస్సు-గంగ-తీర్థము మొదలగు పవిత్రనామములతో సంభావిస్తారు.

 " ఓం నమో నివేష్యాయచ." మంచు బిందువుల రూపమునప్రకాశించు రుద్రునకు నమస్కారము.మంచుకొండను నివాసము చేసికొనిన శివా!నీ పాదపీఠమును మానస సరోవరము మజ్జనమునుచేసి మహదానందపడుతోంది.

   " ఓం నమో నాద్యాయచ."

 అంతేకాదు అతి పొడవైన నదులు సింధు-బ్రహ్మపుత్ర-సట్లజ్ గంగానదికి ఉపనదులైన కర్నాలి మొదలగు నదులు కైలాస పర్వతము దగ్గర కైవల్య ప్రాప్తికై పరుగులు తీస్తున్నాయి.

  ఇంకా పెద్దలు ఏమిచెబుతారు అంటే ప్రళయకాలమున పరమేశ్వరుడు ప్రత్యేక మేఘములను ఆవిష్కరింప చేసి ప్రపంచమును జలమయము చేస్తాడట.అప్పుడు గోచరమయ్యేది కేవలము జలము-జలధారి.

   జలరూప లింగా-జంబుకేశా నమో నమః.

   తెల్ల నేరేడు వృక్షములు ఎక్కువగా గల ప్రదేశము జంబుకేశ్వరము." తిరువనై కానల్" గా ప్రసిద్ధిచెందినది.స్వామి ఈ క్షేత్రమున విశేష పూజలను ఏనుగులచే అందుకుంటాడట.భక్తులు అమ్మవారైన అఖిలాండేశ్వరి దేవిని-స్వామిని గురుశిష్యులుగా భావించుటచే ఇక్కడ స్వామి వారి కళ్యాణము నిషేధము.

   స్వామి వారి పాన వట్టము నుండి నిరంతరము జలము ఊరుతుంది కనుక స్వామిని " నీర్ తిరళ్ నాథర్" అని ప్రేమతో పిలుస్తారట." ఓం" నమో నీప్యాయచ"-కొండపై జారు నీటియందుండు స్వామి కోటి కోటి దండాలు.


  జలస్వరూపుడైన జలధారిని స్పర్శించి సంస్కరింపబడిన వారి సచ్చరితములు కార్తిక-మాఘ పురాణములందు కోకొల్లలు.మృకండ మహాముని-మనస్విని దంపతుల మాఘస్నాన ఫలితమే మార్కేండేయునికి కలిగిన ఈశ్వరానుగ్రహముగా భావిస్తారు.

  ఇంకొక విశేషమేమిటంటే కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరంలో స్వామి సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే జలమునుండి బయటకు వచ్చి దర్శనమిస్తాడట.స్వామి జలతత్త్వమును చెప్పుటకు వేయితలల ఆదిశేషునకైన సాధ్యముకాదు.అతి సామాన్యురాలను నేనెంత? అశేషకరుణామయుని అనుగ్రహమును పొందిన భక్తుల అద్భుత కథలను తెలిసికొందాము. విశ్వేభ్యో-విశ్వరూపేభ్యో నమో నమః.


  బసవేశ్వరుడూ బిజ్జలమహారాజునకు ఇలా వివరిస్తున్నాడు.తిరుచిత్తంబులుడనే శివభక్తుడు స్వామికి పత్ర పుష్పాలను బుట్టలో పెట్టుకుని పోవుచుండగా  వాన నీటిబురదలో జారిపడబోవగా శివయ్యను తలుచుకున్నాడు." ఓం నమో సూద్యాయచ." బురద యందుండు రుద్రా నన్ను రక్షించు అని వేడుకున్నాడు.అంతే క్షణాల మీద శివుడాతనిని కాపాడాడు.రాజుగారు భక్తుని కాలికంటిన బురదను చూసి,సత్యము తెలిసికొని సదాశివ భక్తుడైనాడు.

 ఓం భవస్య హేత్యై జగతాం పతయే నమః" భవసారమును ఛేదించు చంద్రశేఖర నమస్సులు.

   కొలిచినను-కొలువకున్నను తన బిడ్డలు బాధపడుతుంటే వారిని కాపాడకుండా ఉండగలడా పశుపతి." ఓం పశూనాం పతయే నమః".స్వకార్యము చేయుటయే కాని స్వామికార్యము విషయమును గ్రహించలేని దూడమల్లయ్య కుష్ఠువ్యాధితో బాధపడుతున్నాడు.పూర్వజన్మల పాపములు వ్యాధిరూపేణ పీడితా చేసినవి.అనుగ్రహించ దలచిన ఆదిదేవుడు ఆవుదూదను కారణముచేసి ఆదివ్యాధులను తొలగింప దలిచాడు.మల్లయ్య దూడ భవబంధములను తెంచుకొని భవుని దర్శించగా మల్లయ్య ఇంటిలో కట్టిన దుంగనున్న తాడును తెంచుకొని పచ్చికమేయుటకు పరుగులు తీయసాగినది.
" ఓం నమః ఉర్వర్యాయచహ-ఖల్యాయచ.' పంటభూమి-భూమిలో పాతిన గుంజ రెండు తానైన స్వామి దూడను గుంజనుండి విడిపించి పచ్చిక తినుటకు పంపించాడు ప్రణాలిక ప్రకారము.తెల్లవారి లేచి దూడ కానరానందున వెతుకుటకు బయలుదేరాడు వివరము తెలియని వాడు.దూడ పచ్చికను తిని త్రాగునీటికై,గట్ల వెంట,ఇరుకు చలమల వెంట నడవసాగినది నందీశుని ఆన నడిపిస్తున్నది.దానిని అనుసరిస్తు మల్లయ్య తానును నీటిలో బురదలో దిగి వంటినిండ కపర్ది కరుణ అను బురదను అలుముకొని వెంబడిస్తున్నాడు తన దూడలో దాగిన పశుపతిని.పని అయిపోయినదేమో ప్రశాంతముగా వెనుదిరిగి మల్లయ్య వెంట మరలివచ్చినది దూడ.

 " ఓం నమో అనిర్హతేభ్యః." పూర్తిగా పాపములను నాశనముచేయు రుద్రునకు నమస్కారము.జంగమదేవర జలస్పర్శచే పునీతుడైన మల్లయ్య బురదను కడుగుకొనగా మహాదేవుని మహిమ యన బురదతో పాటు తన కుష్ఠువ్యాధి దూరమై శరీరము ప్రకాశించసాగెను.మనసును మాలిన్యమును తొలగించుకొని స్వామిపాద నిర్మాల్యమైనది. ఎందరో భక్తులు పవిత్ర తీర్థములలో స్నానమాచరించి,కర్మ విముక్తులై,కైవల్యమును పొందిరి.

 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.

   ( ఏక బిల్వం శివార్పణం)

  ( ఏక బిల్వం శివార్పణం.)



.


























 







 

   

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...