Sunday, April 21, 2019

NAH PRAYACHCHANTISAUKHYAM-14

 నః ప్రయచ్చంతి సౌఖ్యం-14
 ***************************

 భగవంతుడు-భగవదంశ  ఇద్దరు క్షేత్రపాలకులే.

 " నమో రుద్రాయ ఆతతాయినే క్షేత్రాణాం పతయే నమః."

స్థలము దైవత్వముతో మేళవించిన క్షేత్రముగా భాసిల్లుతుంది.కాశము అనగా వెలుగు-ప్రకాశము అనగా ప్రకృష్టముగా తేజరిల్లునది.

 " కాశంతు పునరాగత్య సంహృష్టం తాండవోన్ముఖం
   విశ్వేశం దేవం ఆలోక్య ప్రీతివిస్తారితే క్షణా
   సానురాగాచసా గౌరీ దద్యాత్ శుభపరంపరాం
   వారణాస్యాం విశాలాక్షీ అన్నపూర్ణ పరాకృతీ
   అన్నం జ్ఞానదదతీ సర్వాన్ రక్షతి నిత్యశః
   త్వత్ ప్రసాదాన్ మహాదేవి అన్నలోపస్తు మాస్తుమే."

   
   
    గంగానదితో రెండు చిన్న నదులు "వరుణ", "ఆస్సి" అనే రెండు నదుల సంగమాల మధ్య ఉన్నందున "వారణాసి" అనే పేరు వచ్చిందని ఒక అభిప్రాయం. వారాణసి నగరానికి ఉత్తరాన వరుణ సంగమ స్థానం, దక్షిణాన అస్సి (ఇది చిన్న నది) నది సంగమ స్థానం ఉన్నాయి. మరొక అభిప్రాయం ప్రకారం "వరుణ" నదికే పూర్వకాలం "వారాణసి" అనే పేరు ఉండేది. కనుక నగరానికి కూడా అదే పేరు వచ్చింది. కాని ఈ రెండవ అభిప్రాయం అధికులు విశ్వసించడంలేదు.
"వారాణసి" అనే పేరును పాళీ భాషలో "బారనాసి" అని వ్రాసేవారు.. అది తరువాత బవారస్‌గా మారింది.'వారాణసి నగరాన్ని ఇతిహాస పురాణాలలో "అవిముక్తక", "ఆనందకానన", "మహాస్మశాన", "సురధాన", "బ్రహ్మవర్ధ", "సుదర్శన", "రమ్య", "కాశి" అనే వివిధ నామాలతో ప్రస్తావించారు.

 శ్రీమద్భగవద్గీత క్షేత్ర-క్షేత్రజ్ఞ విభాగయోగము మానవ క్షేత్రము ( శరీరము) గురించి,క్షేత్రపాలకుడైన పరమాత్మను వివరిస్తుంది.క్షేత్ర సూక్ష్మరూపియై.కాశీక్షేత్ర పాలకుడైన  కాలభైరవస్వామిని స్మరించి,నమస్కరిద్దాము.

 "భైరవః పూర్ణరూపోహి శంకరస్య పరాత్మనః
  మూఢాస్తందై నజావంతి మోహితః శివమాయయా."

 పరమేశ్వరునిపరిపూర్ణ అవతారమే భైరవుడు.శునకము ఈయన వాహనము.అహంకారపూరితమై,అసత్యమాడినబ్రహ్మ ఐదవతలను శివుని భృకుటి నుండి సృష్టింపబడిన భైరవుడు తనగోటితో చిదిమి స్వామికార్యమును నెరవేర్చెను.

 " నమః శ్శ్వభ్య శ్శ్వపతిభ్యశ్చ వో నమః."

   కుక్కలరూపమున నున్నవానికి,కుక్కలను పాలించుచున్న,క్షేత్రపాలక రూపులైన భైరవులకు నమస్కారములు.
 భై అనగా-భయము,రవము అనగా ప్రతిధ్వనింపబడునట్లు చేయబడు ధ్వని.ప్రతికూల పరిస్థితులను నివారించు భైరవస్వామిని నమస్కారములు.భై అనగా తేజస్సు అను అర్థము కూద కలదు.రవము శత్రునాశనమునుతెలియచేయును.శత్రునాశనము చేయు తేజోమయ ఘోరరూపము భైరవుడు.కాలమునకు లొంగని వాడు కనుక కాలభైరవునిగా కొలువబడుచున్నాడు.

 " ఓం నమో శ్రవాయచ-ప్రతిశ్రవాయచ."


 పన్నెండు సంవత్సరములు తాను గిల్లిన బ్రహ్మకపాలమును భిక్షాపాత్రగా స్వీకరించి,పుణ్యనదులలో స్నానమాచరించి,పునీతుడైనాడు భైరవుడు.ఆనందమూర్తి అలయములో ఈశాన్యదిక్కున నుండి ఈశ్వరుని సేవిస్తుంటాడు.తనకర్తవ్య నిర్వహణకై అష్టభైరవ తత్త్వముతో క్షేత్ర పాలనను కొనసాగిస్తుంటాడు.అగ్నిగోళముల వంటి నేత్రములతో పాపములనుదగ్ధము చేస్తుంటాడు.గరళ కంఠముతో గళమున పాములతో చేతిలో త్రిశూలము,డమరు.కపాలముతో కాలభైరవుడు కాశీక్షేత్రమును,అక్కడికి వచ్చిన యాత్రికులను కాపాడుతుంటాడు.పాపాత్ములకు ప్రాణోత్క్రమణ  సమయములో ఘోర రూపముతో సాక్షాత్కరిస్తు,వారి పాపములను భక్షిస్తుంటాడు.కనుక పాపభక్షకుడిగా ప్రసిద్ధిగాంచాడు.పాపులను సైతము పవిత్రులను చేయు పరమేశ్వర అంశ కాలభైరవుడు.

 కాలభైరవస్వామికి వారణాసి-దంతేవాడ ,ఉజ్జయిని,,తేజ్పూర్,రామగిరి ఇంకా ఇంకా ఎన్నోచోట్ల కొండలలో ,జలపాతాలదగ్గర,గుహలలో,కొలువైనాడు.కొన్నిచోట్ల మూర్తి ఎదుగుతు ఉనికికి ఉత్తమనిదర్శనంగా ఉంటున్నదట.స్వామికి మద్యమును సమర్పించి, దానినితీర్థముగా భక్తులు సేవిస్తారట.ఇందుగలడందులేడనిసందేహములేల? మహిమలస్వామి మనలను కనిపెట్టుకునే ఉంటాడు కనికరము కలవాడు
.కాలభీతవిప్రబాలపాల తే నమః శివాయ
 శూలభిన్నదుష్టదక్షఫాల తే నమః శివాయ

భక్తుడు కరువూరు క్షేత్ర పాలకునిగా శివభక్తులను రక్షించుట ఈశ్వరారాధనగా భావించి,తరించిన పుణ్యశీలి.ఘోరరూపి గా అఘోర రక్షణను గావించెడి వాడు. ప్రదేశమునందలి శివభక్తులకు ఎటువంటి ఆపదలు కలుగకుండ,శివార్చనలు జరుపువార్కి హాని కలుగకుండ ఆయుధధారియై సంచరించుచు,సంరక్షించుచుండెడి వాడు.క్షేత్ర పాలకునిగా శివభక్తులను రక్షించుట ఈశ్వరారాధనగా భావించి,తరించిన పుణ్యశీలి.
చిదానందరూపా- ఎరిపాత నాయనారు
*********************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
అని ప్రార్థిస్తూ,
అంబరావతి నదీతీరమున కల కరువూరులోని పశుపతినాథుని కొలిచేవాడు ఎరిపాత నాయనారు. భక్తుని కథ అంటే భగవంతుని లీలను తెలియచేయునది కదా.నీవే తప్ప  పరంబెరుగ మన్నింపన్ దగున్ దీనునిన్ అనగానే సర్వస్య శరణాగతికి వశుడై సిరికిం చెప్పకనే వచ్చినాడు గజప్రాణ రక్షణ ఉత్సాహముతో.ఇక్కడ అహంకారములేదు.అంతరించినది.కాని ఆ జాతికిచెందిన ఏనుగు అహంకరించి శివభక్తులను అహంకారముతో ఘీంకరించి,శివ భక్తులను తుదముట్టించినది.బుద్ధిః కర్మానుసారిణి అని కద సూక్తి.

ఒక కరి రక్షింపబడినది.మరొకకరి శిక్షింపబడినది.ఇదియే పరమేశ్వర లీల.ఎగుడు దిగుడు కన్నులవాని భక్తులకు ఎటువంటి హాని ఎదురైనను అడ్డుకొనుటకు గొడ్డలి భుజమున ధరించి తిరుగుటను దొడ్డ సేవగా భావించువాడు.
" నమ సృకావిభ్యో జిఘాగుం సద్భ్యో ముష్ణతాం పతయే నమ:."

   వజ్రాయుధము వంటి దృఢమైన ఆయుధముచే తనను తాను రక్షించుకొనుచు,హాని కలిగించు ప్రాణులను చంపు రుద్రులకు నమస్కారములు. 

 శివకామి ఆండార్ పూలసజ్జనిండా పూలమాలలతో స్వామి సేవకు వెళుచుండగా ఒక మదించిన ఏనుగు పూలను ధ్వంసముచేసి భక్తుని క్రింద పడవేసి గాయ పరచినది.ఆగ్రహించిన ఎరపాత 

" నమ అవ్యాధినీభ్యో వివిధ్యన్నీభ్యశ్చవో నమః."గా మారి,



  అంతట వ్యాపించి,శత్రువుల గొట్టువాని రూపమున నున్న రుద్రులకు నమస్కారములు.





ఏనుగును,మావటివానిని గొడ్డలితో నరికి,భక్త రక్షణము గావించెను.విషయమును తెలుసుకొనిన రాజు శివాపరాధమునకు చింతించి శిరోఖండనము చేసుకోబోగ,ఎరిపాత ఆ కత్తికి తన తలను అడ్దముగాపెట్టెను.ఎరుకలవానిగా మారిన ఆ ఎగుడుదిగుడు కన్నులవాడు ఎరిపాతను రాజును రక్షించినట్లు మనందరిని రక్షించును గాక.
( ఏక బిల్వం శివార్పణం.

 " దేవరాజసేవమాన్య పావనాంఘ్రి పంకజం
   వ్యాళయజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం
   నారదాది యోగి బృంద వందితం దిగంబరం
   కాశికా పురాధినాధ కాలభైరవం భజే."
 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.


   ( ఏక బిల్వం శివార్పణం)

  ( ఏక బిల్వం శివార్పణం.)







  



No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...