Thursday, May 9, 2019

NAH PRAYACHCHAMTI SAUKHYAM-24

   నః ప్రయచ్చంతి సౌఖ్యం-24
  *************************

   భగవంతుడు భగవతికి మరియు భక్తునకు దూత.

 " నమో దూతాయచ-ప్రహితాయచ."

   శత్రువుల విషయములను తెలిసికొని తన యజమానికి నివేదించగల నేర్పరి దూత.హితమును ఒకచోటు నుండి మరొక చోటునకు తీసుకొని వెళ్ళగల సమర్థుడు దూత.

 దూతను రాయబారి-వార్తాహరుడు-పురోసూచకుడు అనికూడా పిలుస్తారు.ఇతను చక్కని సమయస్పూర్తి-సంభాషణాచతురతను కలిగినవాదై యుండవలెను.జరుగబోవు పరిణామములను తెలియచేయగల సామర్థ్యమును కలిగియుండవలెను.మహా భారతములో శ్రీకృష్ణుడు,రామాయణములో హనుమంతుడు సమర్థవంతమైన దౌత్యమును చేసియున్నారు.సంధికి అంగీకరించని ఎడల కలుగు పరిణామములను తమను పంపినవారి శౌర్య పరాక్రమములను వివరించి పురోసూచకులుగా కూడ ప్రసిధ్ధిపొందారు.

  " సృష్టి స్థితి లయాయస్య లీలా ఇవ మహేశితుః
    తం వందే సచ్చిదానందం సర్వాశుభ నివృత్తయే"

    సకల అశుభములను నివృత్తిచేయు సర్వమంగళాకార సదాశివ నమస్సులు.

  శుంభ-నిశుంభులు యుక్తాయుక్తములను మరచి తల్లితో యుధ్ధమును కోరిరి.అంబిక అందులకు వారికడకు దూతగా పరమేశ్వరుని పంపెను.సప్తమాతృకలు తల్లికి సాయపడ సిధ్ధమైనారు.తల్లి తన సక్తిని నక్క కూతలో దద్దరిల్లచేసి,తనతో పోరాడవలెనన్న దానికి ముందు తన దగ్గరనున్న నక్కలను గెలిచి,తన దగ్గరకు రావలెనని చెప్పి అమ్మ "శివదూతి"గా ప్రసిద్ధికెక్కినది.
" యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేన సంస్థితా
  నమస్తస్త్యై నంస్తస్త్యై నమస్తస్తై నమో నమః:.

 నలదమయంతుల కథలోను స్వామి కలహంసరాయబారి యైనాదట.

  "రుద్రం సురనియంతారం శూలఖట్వాంగ ధారిణం
   భీషణ భుజంగ భూషం ధ్యాయేత్ వివిధాయుధం రుద్రం.

  దేవతలను నియమించువాడైన రుద్రుడు త్రిశూలము-ఖట్వాంగము అను ఆయుధములను ధరించి,అభయంకరమైన అగ్నిజ్వాలలో కూడియుండి అఘములను హరించుగాక.

   భగవంతుని దూతగా తన భార్య వద్దకు పంపిన భాగ్యశాలి సుందరార్ నాయనార్.ఆయనకు ఆ సమయమున సంకరుడు అఘోరుడై ఆలికడకు సందేశమును తీసుకుని వెళ్ళు దూతయై సేవలనందించినాడు.

  " శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రంత్రినేత్రం
    శూలంవజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం
    నాగం పాశంచ ఘంటం ప్రలయహుతవహం సాంకుసం వామభాగే
    నానాలంకార యుక్తం స్పటికమణినిభం పార్వతీశం నమామి."

   అర్థనారీశ్వరుడు తన అర్థాంగిని తనదగ్గరకు చేరుస్తాడన్న నమ్మకముతో తన స్వామిని దూతగా మార్చాడు సుందరారు.సంతోషముగా కదిలాడు శంకరుడు.

   " విశ్వతః పాణిపాదాబ్జం విశ్వతోక్షి శిరోముఖం
     జ్వలంతం విశ్వమావృత్య తేజోరాశిం శివం స్మరేత్."

   స్వామి సర్వాంగములుసర్వతోముఖములు.సకల మంగళదాయకములు.విశ్వమంతటను వ్యాపించి విశ్వమును ప్రకాశింపచేయుచు,అందులో దాగి తాను ప్రకాశిస్తూ,భక్తసులభుడిగా ప్రకాశించు స్వామిని తన భార్య దగ్గరకు దూతగా సుందరారు పంపించుట,కలికామనాయనారుని కలతపరచినది.

  " నమో అగ్రియాయచ-ప్రథమాయచ" స్వామి ఎంతటి అపచారము జరిగినది.ఏ మాత్రము సహింపరానిది.పెరుమంగళమునకు స్వామి దూతగ వెళ్ళుతయా? సుందరారు స్వామిని దాసుని చేసుకొనినాడని నిందించుచు,తానెన్నడు సుందరారు ముఖమును చూడనని ప్రతినను బూని,నిరతర శివారాథనలో మునిగిపోయెను.

  " నమః ప్రతరణాయచ-ఉత్తరణాయచ"

సుందరారుని దూషించినదానికి కర్మానుభవమా అన్నట్లుగా కలికామనాయనారు వ్యాధిగ్రస్తుడాయెను.ఎంతగొప్ప వైద్యమును చేయించినను ఫలితము కనపడలేదు.పరమేశ్వరుడు కలలో కనిపించి సుందరారు వైద్యము చేయుటకు వచ్చును.మీరిద్దరు నాకు అత్యంత ఆప్తులు.నా లీలావిసేషమే నన్ను దూతను చేసినది.మీరిద్దరు పూర్వము వలె నిష్కళంకులై నన్ను సేవించండి అని సెలవిచ్చెను.సుందరారు వైద్యము కలికాముని సంపూర్ణ ఆరోగ్ఫ్యవంతుని చేసినది.
 "అద్యవోచదధి వక్తా ప్రథమోదైవ్యో భిషక్."
 ధ్యానించుటచేతనే రోగములను భవరోగములను పొర్గొట్టు రుద్రప్రభూ నమస్కారములు.

   సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః.

 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.

   ( ఏక బిల్వం శివార్పణం)

   ఏక బిల్వం శివార్పణం.

 

1 comment:

  1. అమ్మ నాయందు శివుడు పలికించిన మాటలివి శంకరా భయంకర జయ శంకర హర హర శంకర
    సర్వజీవులకు ప్రాణం పోసేది నీవే తీసేది నీవే జయ శంకర భయంకర హర హర శంకర.

    శంకర కింకర జీవుల మయం కర మరో జన్మ అ కోట్ల జీవులు చైతన్యం ఇచ్చే సృష్టి కరా శంకర అభయంకర...

    మోహ తాపాలు సృష్టించే శంకర దక్ష యజ్ఞం వలే దహించే కాలభైరవ మాయాకరా శంకర అ హర హర శంకర..!!
    అర్ధనారీశ్వరు డై నారి త్వము విలువ చాటిన శంకరా భయంకర లోక సమ పాలక రా హర హర శివ శంకర
    వేదాలు ,ఉపనిషత్తులు, దేవతలు ,దేవుళ్ళు గురువులు నీయందు ఉద్భవించిన స్వయంభూ కర శంకర శివ శంకర సృష్టికర....🙏🙏🙏

    ReplyDelete

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...