Sunday, September 29, 2019

YAA DEVI SARVABHOOTESHU-02

   యాదేవి సర్వ భూతేషు-02
   ********************
  రెండవ దశమహావిద్య-తారాదేవి.

  కాలికాదేవిని ఆదిమతమస్సుగా భావిస్తారని మనము చెప్పుకున్నాము.ఆ తమస్సునుండి తేజోపుంజముగా మేరుశిఖర మధ్యనుండి కాలిక సృష్టించిన జగమును సంస్కరించుటకు తేజోరేఖగా వెలువడిన తల్లి తారాదేవి.తన భక్తుడైన గణపతి ముని ఉమాసహస్ర పద్యములకు తన అంగీకారము-ఆనందమును తల్లి ఆకాశములో మెరుపు రూపముగా తెలియచేసినదని ఆర్యోక్తి.
 " యాదేవి సర్వభూతేషు తేజోరూపేణ సంస్థితా." అమ్మా అనేక నమస్కారములు.

  దేవతలు ధర్మసంస్థాపనకై కాళిమాతను ప్రార్థించగా తన రౌద్రరూపమును కొంతమేరకు తగ్గించుకొని(ఉపసంహరించుకొని) తారాదేవి రంగములోనికి దిగినదని భావిస్తారు.ఉదాహరణకు కత్తిని కత్తెరచేసినది.సంహరణను సవరణ గా మార్చినది. " యాదేవి సర్వభూతేషు సహన రూపేణ సంస్థితా."

  కాళిక పునర్నిర్మించిన విశ్వమునకు తారాదేవి వాక్కును ప్రసాదించి సంస్కరించినది.వాక్కు పరా-పశ్యంతీ-మధ్యమా-వైఖరీ అని నాలుగు విధములుగా వర్గీకరించబడినది.మేఘగర్జన-గాలికి చెట్ల ఆకులు ఊగుతూ చేయు ధ్వనులు-పక్షుల-పశువుల అరుపులు మొదటి మూడు వర్గములకు చెందినవి.గుత్పప్రణవము శబ్దమును చేరి దానిని అర్థవంత పదముగా మార్చుచున్నది.అదియే తారాశక్తి.కాళిమాత అగ్నితత్త్వయై జ్ఞానమును ప్రసాదిస్తుంటే.తారాదేవి చంద్రతత్త్వముతో మనసును సక్రమమైన ఆలోచనలో,మాటలతో సక్రమ మార్గమున నడిపిస్తుంటుంది." యాదేవి సర్వభూతేషు వాగ్రూపేణ సంస్థితా."

  లోకాద్భుతమైనపున అవ్యయకాంతితో తల్లి గౌరిగాను,లోకసృష్టి రచనను చేయుచున్నప్పుడు నీలిరంగుగాను,లోకమాత యైడు చిత్ర వర్ణముగాను దర్శనమిస్తుందట.ధన్యోస్మి మాత.మునిగియున్న పనుల వైఖరిని బట్టి తెలుపు,నీలము,పసుపుఎరుపు ఆకుపచ్చ రంగులు సంకేతాలవుతాయి.

 " యాదేవి సర్వభూతేషు సర్వవర్ణోప సంస్థితా."

 బౌధ్ధవాజ్మయ కథనము ప్రకారము క్షీరసాగర మథన సమయమున ప్రభవిమ్హ్న శివుడు అచేతనుడు కాగా,తారాదేవి శివుని శిశువుని చేసి తనస్తన్యమునిచ్చి విషదోషరహితుని చేసెనట.శివుడు తల్లిని గురువుగా భావిస్తాడని చెబుతారు." యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా."




 

 

  తారాదేవి వాగధిదేవత.తల్లిది సమిష్టి వాక్య స్వరూపము.జ్ఞానుల ఆరాధనలో నున్నప్పుడు తారాదేవి వేదత్రయి.శుక్ల నామ సత్వగుణ భూషిణి.

   యోగులు తల్లిని తమహృదయములోని అవ్యక్త స్వయంసిధ్ధప్రణవముగా గుర్తించి,అంతర్యాగోన్ముఖులై ధ్యానించుచున్నప్పుడు తల్లి నామము నీల.

సామాన్య మానవుని నోట సత్యాసత్య రూపముగా వాకు వెలువడునపుడు ఆమె చిత్ర.

  " యాదేవి సర్వభూతేషు నానా నామేణ సంస్థితా.

 



















 కాళికాదేవి జలమయిన జగతిని పునర్నిర్మిస్తే,ఆమెకు తోడుగా తారాదేవి తాను వంతెనగా మారి ఆ జలప్రవాహమునుండి (సంసారము) శాశ్వతానంద స్థితికి జీవుని చేరుస్తుంది.యాదేవి సర్వభూతేషు తరణరూపేణ సంస్థితా."

  నాభీస్థానమున నివసిస్తూ,జీవుని (శిశువు) బొడ్డుతాటిని సం రక్షిస్తుంటుంది.యాదేవి సర్వరూపేషు రక్షారూపేణ సంస్థితా."

  చైత్ర శుక్లనవమి ప్రీతిపాత్రమైన తారాదేవిని నారాయణుని శ్రీరామావతారముగా భావిస్తారు.అద్భుత రామాయణము ఆ విషయమును మరింత స్పష్టము చేస్తున్నది.మూర్చిల్లిన శ్రీరాముని తారాదేవి రక్షించినదని.
" యాదేవి సర్వభూతేషు రమ్యరూపేణ సంస్థితా."

 నవగ్రహములలో చంద్రునికి అధిదేవతయైన తారాదేవి జీవుల మనో సంకల్పవికల్పములను పరిశీలిస్తు వాటిని సామరస్య మార్గమువైపుకు నడిపిస్తుంటుంది." యాదేవి సర్వభూతేషు జ్యోత్స్నారూపేణ సంస్థితా."

  మూలబిందువు నుండి కాళి వలె ఉత్తర దిసగా వ్యాప్తిచెందు క్రోధరాత్రిగా పిలువబడు తార,అక్ష్యోభ్యుడు అను పేరుగల శివశక్తిని తనలో లీనముచేసుకొని జగద్రక్షణ చేస్తుంది." యాదేవి సర్వభూతేషు ప్రకాశరూపేణ సంస్థితా."

  అమ్మతత్త్వమును అనుభవైవేద్యము చేసే ఆదిశక్తి రూపాలు దశమహావిద్యలు.అయినప్పటికిని వేటికి అవే ప్రత్యేక సామర్థ్యమును కలిగి ఉన్నవి.మన శరీరములోని కన్ను-ముక్కు-నోరు వలె.వాగధిదేవత యైన తారాదేవి వాక్కును పరిచయము చేసినది.శబ్దాధిదేవత కనుక అవ్యక్త ప్రణవమై సబ్డమును అర్థవంతము చేసినది."యా దేవి సర్వభూతేషు శబ్ద రూపర్ణ సంస్థితా."





No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...