Thursday, October 10, 2019

DASA MAHAVIDYA PADYAMALA.

  నమామి పరదేవతా
  ****************

శార్దూలం వృత్తం

వ్యక్తావ్యక్త చిదంబరీమ్ త్రినయనీం వ్యాఘ్రామ్ మహోద్వేగినీం
ముక్తా విద్రుమ హేమ నీల ధవళా మూర్తిం మనోల్లాసినీమ్
శక్తిమ్ స్త్రీ దశవర్గ శోభి కరుణా సంధాయినీమ్  శాంభవీమ్
భక్తిమ్ దేహి మదీయ హృత్కమల శోభాలంకృతాడంబరీమ్!

 ఏవం రక్తి ముఖారవింద హిమజాం ఈశాని ఏకేశ్వరీం
 దేవీ శక్తి విదారణా విదుషి తాం దేవేంద్ర సంపూజనీం
 భావం భక్తి పరాపరోక్తి వరదాం భక్తాం భవేదంబికాం
 జీవన్ముక్తి యదార్థ కీర్తి భవతీం స్థిత్యాత్మికా నర్తకీం.

శార్దూలము-కాళి


పాళీమ్ హార కపాలధారి రుధిరామ్ ప్రాముఖ్య మాలాన్వితాం
కేళీమ్ జిహ్వ మహారుణారుచి భయక్రీడావచూడాస్ధి కం-
గాళీ రాక్షస భంజనేన రణరంగాలింగనోత్సాహికామ్
కాళీమ్ కాలకలాప దంత ధవళా  కార్యానువర్తీమ్ శివమ్!

శార్దూలము-తారాదేవి

శ్రీరాముండట మూర్ఛ బోయె; రణమున్ సీతా మహాసాధ్వియే  
స్వారీజేసెను కాళి రావణునికన్ సాహస్ర ఖండంబులున్
వీరావేశము శాంతినొందె  విధిగా  విశ్వాత్మ ధ్యానింపగన్
తారారూపము తానె దాల్చె సకలాధారాత్మికా  తత్వమై

శార్దూలము... త్రిపుర సుందరి వర్ణన.

పంచక్లేశ నివారిణీమ్ భగవతీమ్ పంచస్థితీమ్  ధారిణీమ్
పంచబ్రహ్మ మహాత్మ్య తత్వమఖిలమ్  భావార్ధమూలాత్మికామ్
పంచర్జ్యోతి శుభాంగరూప సహితమ్ పంకేరుహాలోచనీమ్
పంచప్రాణ నియంత్రిణీమ్ త్రిభువనీమ్ భృంగార తేజస్వినీమ్!

శార్దూలము.. భువనేశ్వరీ దేవి వివరణ.

ఆవిర్భావము జేసె శక్తి తన ఛాయారూప సంకల్పమున్  
దేవీ రాజస భైరవాంక నిలయా  దేదీప్య ప్రేతాసనుల్
దేవీజ్ఞాన శిరోవిభూషణి సదా దేవేశ్వరీ  ప్రేరణల్
దేవీపట్టణ రత్నకాంతులు మణిద్వీపస్థితంబుల్  దివిన్!


  శార్దూలము-త్రిపురభైరవి వర్ణన

లీలారూపము కొమ్ము కోరలును కేళీలోల ఘీంకారమున్
జ్వాలాకాంతి శరీరవర్ణ గరిమన్ జాగ్రత్త నిద్రాస్థితిన్
ప్రాలేయాచల భైరవీం దశమహా ప్రాకృత్ సుసంపన్నమున్

మూలాధార విశేషచాలన కరీం మూర్తీం మహామోహినీం.

 శార్దూలము-ఛిన్నమస్తక

యోగశ్రేష్టి శిరోస్వఖండనము సంయోగద్వయంబాసనం
రాగద్వేష సమాన దృక్పథమె ఘోరాఘోర సామ్యంబులున్
త్యాగంబా రుధిరత్రిధార సరళీ త్రాగేటి శీర్షంబులున్

భోగాపేక్ష నియంత్ర సంస్కరణమే పూర్ణత్వమై శోభిలన్


 శార్దూలము-ధూమావతి

 వైధవ్యంబు నిరాశ నిస్పృహ సహా వార్థక్య ధూమం రుచిం
 వ్యాధిగ్రస్థ కురూపి కాకి రథమున్ వాసం శ్మశానంబునన్
 బాధారూపము తానెదాల్చు బహుధా బ్రహ్మాండమంతంబునన్

 బోధంచేసెడి బుధ్ధి సిధ్ధి శుభదం భోక్తవ్య భూరిన్నిలన్.

 శార్దూలము-బగలముఖి

 గంభీరాసన కర్కరాటుక మహా కర్పూర పీతాంబరీం
 కుంభీపాక విదారకాగ్ని విరళీం కృరాకృత్తిం భంజనీం
 స్తంభీకార విజృంభ లంఘనకరీం సమ్రంభ విస్త్రాణినీం

 అంభోజస్థిత పాదపద్మ యుగళీం ఆధ్యాత్మికాం సాగరీం.


శార్దూలము... మాతంగి వర్ణన.

ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్
భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ వాణీం చతుర్బాహునీమ్
గీతం వాచక నాద నృత్య నిధి సంఘీభావ సంపూజనీమ్
మాతంగీమ్ హరితాం సుశోభి సుమతీమ్ మంత్రిత్వ సంచాలకీమ్!

 శార్దూలము-కమలాత్మిక

 చాతుర్ధారా సుధాగజేంద్ర విలసత్ చాంపేయ చాముండినీం
 హేతుర్భాగ్య విశారదా శుభద మాహేశ్వర్య దాక్షాయిణీం
 పాతివ్రత్య పరాయిణీం భగవతీం పద్మాసనా సంస్థితాం
 జ్యోతిర్లోక పురాధిదేవి కమలజ్యోతిం పరంజ్యోతినీం.


   మాలను సభక్తితో సమర్పించినవారు చిరంజీవి ప్రసాదు నిమ్మగడ్డ -అమ్మ ఆశీస్సులతో.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...