Saturday, November 16, 2019

bhookailas

 

  నః ప్రయచ్చంతి సౌఖ్యం-21

  ******************************



  భగవంతుడు-భక్తుడు ఆలిని అర్థికిచ్చిన వారే.

 " నమ: శష్ట్ప్యాయచ ఫేన్యాయచ
   నమస్సికత్యాయచ ప్రవాహ్యాయచ"

 లేతగడ్డియందున్న వాడు శష్ప్యుడు నీటి నురుగునందున్న వాడు ఫేన్యుడు.ఇసుకగల ప్రదేశములు తనస్వరూపములుగా గలవాడు ప్రవాహములలో గలవాడు.అసలింతెందుకు?
  పవిత్రగంగాస్నానమాచరించి  ప్రవాహముతో,దానిలోదాగిన నురుగుతో పునీతులై,తీరప్రదేశ ఇసుకతో శివలింగమును తయారుచేసుకొని,పక్కనే మొలిచియున్న దర్భలతో,అకుంఠిత దీక్షతో అర్చించు సాధకులలో,ఉదాహరణకు రావణబ్రహ్మ తల్లి కైకసి మాతగా ప్రజ్వరిల్లుచున్న పరమేశ్వరునకు ప్రణామములు.
" దేవ మహదేవ మము కావుము శివా".

 జరుగవలసిన పరీక్షకు శ్రీకాళహస్తీశ్వరుడు జంబుకేశ్వరునికి తోడై జలధరుని లింగమును జరిపివేసినాడు.దైవ నిర్ణయములు దయాపాత్రములే అయినప్పటికిని కైకసి మాత దైనందిన పూజకు దారిని మార్చినది.తల్లడిల్లుచున్న తల్లిని చూసి తాళలేని కుమారుని,అందులోను పరమ శివభక్తుని ఆత్మలింగ అనుగ్రహమునకై కైలాసము వైపునకు అడుగులను కదిలించినది.కామితార్థమునిస్తాడో లేక కాగల కార్యమునకు చరితార్థుడగు చమత్కారమే చేస్తాడో ఆ చమత్కారుడు చంద్రశేఖరుడు.

  ఓం నమశివాయ.
 దేవదేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో

  " నమో గుహాయచ-గహ్వరేష్ఠాయచ"

   రహస్యముగా తన హృదయ గుహలో నివసించువాని "విరూపేభ్యో-విశ్వరూపేభ్య్శ్చ:" వానిని తన చర్మ చక్షువులతో దర్శించి,చక్కగా స్తుతించి,ప్రసన్నుని చేసుకొని.తల్లి నిత్యపూజకై ఆత్మలింగమును అనుగ్రహముగా పొంది అతిశయమైన సంతోషముతో తిరిగి లంకకు రావాలనుకున్నాడు.

 నమోకృత్సాయచ-కృత్సపతయేచ"

 విషయలంపటములో విశేషముగా బందీయైన రావణుడు పర్వతీపరమేశ్వరులు ప్రసన్నులై,ప్రత్యక్షమై,వరమును కోరుకోమనగానే,మాయాపాశబధ్ధుదై ఆత్మలింగమునకు బదులు అమ్మలగన్న అమ్మను ఆలిగా చేసుకొనుటకు తనకు ఇమ్మని అర్థించాడు.అమంగళము ప్రతిహతమగుగాక.

 నమో యామ్యాచ-క్షేమ్యాయచ.
  భక్తుల క్షేమమును తన బాధ్యతగా భావించి,నచ్చచెప్పచూసినను.... గోకర్ణమునకు చేరవలసిన ఆత్మలింగమును కైలాసమునుండి తరలించుట అను  కరుణామయుని కానుకను పొందిన పదితలల రావణుని పూర్వపుణ్యమును నేనేమని వర్ణించగలను?


 "ఎందుకయా సాంబశివ ఎవరు నీకు చెప్పేరయ
  ఈ అల్లరిచేతలు-ఈ బూడిద పూతలు ఎందుకయా?

 భక్తులను అనుగ్రహించుతకు సోపానములే తన ఆటలు అంటూ,సోమనాథుడు తాను అర్థిగానే కాదు-యాచకునిగా కూడా తన లీలను మనకు పరిచయము చేస్తున్నాడు.
చిదానందరూపా-ఇయర్వగై నాయనారు
*************************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
శివుడు బ్రాహ్మణ వేషములో ఇంటిముందు నిలిచాడు
ఇంగితమును విస్మరించి నాయనారు ఇల్లాలిని అడిగాడు
లేదనుమాట పలుకలేనివాడైన ఇయర్వగై నాయనారు
నివేదనమనుకున్నాడు, నిజపత్నిని పంపించాడు

 " నమః స్రూత్యాయచ పథ్యాయచ."

బ్రాహ్మణునకు-భార్యకు బాటలో బాసట తానైనాడు
అడ్డువచ్చిన వారిని ఎదురొడ్డిన వాడయ్యాడు
శర్వునకు నమస్కరించి నిశ్చయ భక్తితో వెనుదిరిగెనుగా

  మహాద్భుతము.భార్య ఒక్కతె నిలబడి యున్నది.మాయల వాడు మాయమైపోయాడు.

  " నమశివాయచ మయస్కరాయచ."
నిర్వాణమునందీయగ భార్యయే కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.


కావేరి పట్టణ వాసుడైన ఇయర్వగై నాయనారు నరనరాల్లో దాతృత్వమును జీర్ణించుకొన్న గొప్పశివ భక్తుడు.శివ భక్తులను శివ స్వరూపముగాభావించి,అడిగిన దానిని దానమిచ్చి,వారి సంతోషమే పరమేశ్వర అనుగ్రహ విశేషముగా భావించి,సంతసించెడివాడు.
జీవుడు దేవుడు కావాలంటే శివుడు ఎన్ని పావులు కదపాలో-ఎన్ని కథలను నడపాలో.ఆ రావణ బ్రహ్మకు ఆలినిచ్చిన దాత కదా.వేరొకరి ఆలినికోరగా యాచకుడిగా మారదలచాడు." ఓం నమః శివాయ" త్రిపుండ్ర ధారియైనాయనారు ఇంటిముందు నిలిచాడు.శివ స్వరూపము అత్యంత భక్తిశ్రద్ధలతో సేవించారు నాయనారు దంపతులు.చల్లకు వచ్చి ముంతను దాచటమెందుకని చల్లగా సంభాషణలో నాయనారు అడిగినది లేదనక ఇస్తావట.నిజమేనా అని సందేహముగా అడిగాడు.స్వామి నా దగ్గర ఉన్నది అయితే తప్పకుండా ఇస్తాను అన్నాడు అమాయకంగా ఇయర్వగై.నీ భార్యను కోరుతున్నానన్నడు.వెంటనే సంశయించక అందుకు అంగీకరించినాడు.పతివ్రతా శిరోమణి పరమప్రీతితో యతి సేవకు సిద్ధమయింది.
పినాకపాణి పిరికితనమును నటిస్తూ నాయనారు భార్యను తనతో తీసుకువెళతానని,దారిలో ఎవరైనతనను అడ్డగించవచ్చని,కనుక వారిద్దరు ఊరు దాటువరకు రక్షణగా నాయనారును తోడు రమ్మన్నాడు. ఆయుధధారియై వారిని అనుసరించాడు.అడ్డువచ్చిన వారినిచూసి బెదిరిన బ్రాహ్మణునితో నాయనారు భార్య, మీరు భయపడవలదు.నా భర్తవారిని మట్టికరిపించి,మనలను క్షేమముగా పొలిమేర దాటిస్తారని సెలవిచ్చింది.బలిచక్రవర్తి వలె స్వామిచేయి క్రింద-నాచేయి దాతగ పైన అని ఆనుకోని నాయనారు మాటకు కట్టుబడి, అడ్డువచ్చిన వారిని ఓడించి,వీరిద్దరిని అనుసరించుచుండెను.
తిరుచ్చైకాడు దేవాలయము దగ్గర శివుడు నాయనారును తిరిగి వెళ్లిపొమ్మనెను.కొంత దూరము వెళ్ళినాడో లేదో నాయనారు అని గట్టిగా పిలిచి అదృశ్యమయ్యాడు శివుడు.వెనుతిరిగిననాయనారుకుభార్యఒక్కతే కనిపించింది.పార్వతీ పరమేశ్వరులు దీవించారు.త్రికరణ శుద్ధిగా ధర్మపత్నిని శివునకు సమర్పించిన ఇయర్వగై నాయనారును కటాక్షించిన పార్వతి పరమేశ్వరులు మనందరిని కటాక్షించెదరు గాక

    రేపు బిల్వార్చనకు కలుసుకుందాము.

( ఏక బిల్వం శివార్పణం.)



 

 



 





 



 'నమః స్రుత్యాయచ-పథ్యాయచ" స్రుతి అనగా కాలిబాట.అందులోను ఇరుకైనది.అ బాట





  ద



 శివుడు బ్రాహ్మణ వేషములో ఇంటిముందు నిలిచాడు

ఇంగితమును విస్మరించి నాయనారు ఇల్లాలిని అడిగాడు

లేదనుమాట పలుకలేనివాడైన ఇయర్వగై నాయనారు

నివేదనమనుకున్నాడు, నిజపత్నిని పంపించాడు

బ్రాహ్మణునకు-భార్యకు బాటలో బాసట తానైనాడు

అడ్డువచ్చిన వారిని ఎదురొడ్డిన వాడయ్యాడు

శర్వునకు నమస్కరించి నిశ్చయ భక్తితో వెనుదిరిగెనుగా

నిర్వాణమునందీయగ భార్యయే కారణమాయెగ



  ఇంతకీ ఎవరు ఈ ఇయర్వగై? అర్థించిన బ్రాహ్మణునికి భార్యను నిస్సంకోచముగాసమర్పించి నివేదనమనుకున్న నిష్ఠాతత్పరుడు?





కావేరి పట్టణ వాసుడైన ఇయర్వగై నాయనారు నరనరాల్లో దాతృత్వమును జీర్ణించుకొన్న గొప్పశివ భక్తుడు.శివ భక్తులను శివ స్వరూపముగాభావించి,అడిగిన దానిని దానమిచ్చి,వారి సంతోషమే పరమేశ్వర అనుగ్రహ విశేషముగా భావించి,సంతసించెడివాడు.

జీవుడు దేవుడు కావాలంటే శివుడు ఎన్ని పావులు కదపాలో-ఎన్ని కథలను నడపాలో.ఆ రావణ బ్రహ్మకు ఆలినిచ్చిన దాత కదా.వేరొకరి ఆలినికోరగా యాచకుడిగా మారదలచాడు." ఓం నమః శివాయ" త్రిపుండ్ర ధారియైనాయనారు ఇంటిముందు నిలిచాడు.శివ స్వరూపము అత్యంత భక్తిశ్రద్ధలతో సేవించారు నాయనారు దంపతులు.చల్లకు వచ్చి ముంతను దాచటమెందుకని చల్లగా సంభాషణలో నాయనారు అడిగినది లేదనక ఇస్తావట.నిజమేనా అని సందేహముగా అడిగాడు.స్వామి నా దగ్గర ఉన్నది అయితే తప్పకుండా ఇస్తాను అన్నాడు అమాయకంగా ఇయర్వగై.నీ భార్యను కోరుతున్నానన్నడు.వెంటనే సంశయించక అందుకు అంగీకరించినాడు.పతివ్రతా శిరోమణి పరమప్రీతితో యతి సేవకు సిద్ధమయింది.



పినాకపాణి పిరికితనమును నటిస్తూ నాయనారు భార్యను తనతో తీసుకువెళతానని,దారిలో ఎవరైనతనను అడ్డగించవచ్చని,కనుక వారిద్దరు ఊరు దాటువరకు రక్షణగా నాయనారును తోడు రమ్మన్నాడు. ఆతతావియైన అనగాఆయుధమునుధరించి రక్షించు రుద్రుని వలె నాయనారుఆయుధధారియై వారిని అనుసరించాడు.అడ్డువచ్చిన వారినిచూసి బెదిరిన బ్రాహ్మణునితో నాయనారు భార్య మీరు భయపడవలదు.నా భర్తవారిని మట్టికరిపించి,మనలను క్షేమముగా పొలిమేర దాటిస్తారని సెలవిచ్చింది.బలిచక్రవర్తి వలె స్వామిచేయి క్రింద-నాచేయి దాతగ పైన అని ఆనుకోని నాయనారు మాటకు కట్టుబడి, అడ్డువచ్చిన వారిని ఓడించి,వీరిద్దరిని అనుసరించుచుండెను.

తిరుచ్చైకాడు దేవాలయము దగ్గర శివుడు నాయనారును తిరిగి వెళ్లిపొమ్మనెను.కొంత దూరము వెళ్ళినాడో లేదో నాయనారు అని గట్టిగా పిలిచి అదృశ్యమయ్యాడు  శివుడు  " నమః శంకరాయచ-మయస్కరాయచ." ఇహపరములను అనుగ్రహించు రుద్రా నీకు నమో వాకములు.

 ఇహపరములను అనుగ్రహించు రుద్రా నీకు నమో వాకములు.

.వెనుతిరిగిననాయనారుకుభార్యఒక్కతే కనిపించింది.పార్వతీ పరమేశ్వరులు దీవించారు.త్రికరణ శుద్ధిగా ధర్మపత్నిని శివునకు సమర్పించిన ఇయర్వగై నాయనారును కటాక్షించిన పార్వతి పరమేశ్వరులు మనందరిని కటాక్షించెదరు గాక



 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.


   ( ఏక బిల్వం శివార్పణం)

( ఏక బిల్వం శివార్పణం.)


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...