Wednesday, November 6, 2019

nah prayachchanti saukhyam-jaalari.

  నః ప్రయచ్చంతిసౌఖ్యం.-07
  ************************

  " ప్రళయ పయోధి జలే కేశవ ద్రుతవానసి వేదం
   విహిత వహిత్ర కరిత్రమఖేదం
   కేశవాద్రుత మీనశరీర జయజగదీశ హరే"

 చేపరూపమును దాల్చి చేవతో సొమకుని నుంది వేదోధ్ధరణను గావించిన కేశవ నమస్కారములు.

 భవసారమున పడి బయటకు రాలేని మాపై నీ కరుణాజాలమును విసిరి కడతేర్చు గొప్ప జాలరి వైన శివా ప్రణామములు.

 నమో ప్రతరణేభ్యో ఉత్తరణేభ్యశ్చవ నమో నమః.

 స్వామిని దర్శించిన సత్యవ్రతుడెంత ధన్యుడో స్వామికి మత్స్య నైవేద్యమును సమర్పించిన ఆదిపత్త నయనారు అంతే మహనీయుడు.


చిన చేపను-పెద్ద చేప,చిన మాయను-పెనుమాయ
 ఇది స్వాహా-అది స్వాహా అని అంటున్నాడు పెద్దజాలరి మనకు ఒక జాలరి కథ చెబుతూ,
 విషయవాసనలనే ప్రవాహములో పడి,వల పట్టుకొని యున్నమాయ అనే ఆపదను గుర్తించలేని మనలను రక్షించుస్వామికి నమస్కారములు..శివోహం.






 భ గవంతుడు-భక్తుడు ఇద్దరు జాలరులే
 జలము-జలచరము-జాలరి ఈశ్వరచైతన్యమే.

 " ఓం నిషాదేభ్యశ్చవ నమోనమః".
 చేపలను సమూహముగ పట్టి చంపునట్టి నిషాదుల రూపమున నున్న రుద్రునకు నమస్కారము.

  మన మనుగడను తెలియచేయునవి వేదములు.ప్రళయాంతరమున సోమకాసుర హస్తగతమైన వేదములను ఎవ్వరుని తిరిగి పొందలేకపోయిరి.వేదములు లేని సమయమున బ్రహ్మకు సృష్టికార్యమును చేయుట దుర్లభమాయెను.సృష్టిని కొనసాగించుటకు దేవతలు శ్రీమన్నారాయణుని వేదములను తెరిగితీసుకురాగల సమర్థతగలవానిని గుర్తించి,ప్రార్థించిరి.ఓం నమో నారాయణాయ.నార-అనగా జలము.జలమునందుండువాడు నారాయణుడు.జలమునుశిరముపై ధరించిన వాడు సదాశివుడు.వారిద్దరు ఏకం అనేక రూపానం అని తెలియచేయుటకు రూపభేదమేకాని తత్త్వ భేదము లేని వారు
.స్వామి మత్సావతరముతో సముద్రములో వేదములతో సహా దాగిన సోమకునితో అనేకానేక సంవత్సరములు భీకర యుద్ధమును చేసి,వానిని సంహరించి వేదోద్ధరణను గావించెను.నీటిలో అన్ని సంవత్సరములున్న స్వామికి వెచ్చదనమును అందించుటకు మన రుద్రుడు సూర్యకిరణములుగా తన చెలిమిని చాటుతు వెచ్చదనమును అందించుచున్నాడు అనుటకు నాగలా పురములోని వేదనారాయణ స్వామియే నిదర్శనము.ఇక్కడ పవిత్ర ఉత్సవ సమయులో మూడురోజుల) సూర్య కిరములు మొదటిరోజున స్వామి పాదములను,రెండవరోజున స్వామి హృదయమును,మూడవరోజున స్వామి ఫాలమును ఇప్పటికిని అభిషేకించుచు తమ అవ్యాజ వాత్సల్యమునుచాటుచున్నవి.


 " స్వధర్మేనిధనం శ్రేయః పరధర్మో భయావహః"

ఎవరు తన వృత్తి ధర్మమును బాహ్యముగా ఆచరిస్తూ,తనలోని ఆత్మ స్వభావ పరిశీలనము అను స్వధర్మమును చేయగలడో వారు ధన్యులు.అట్టివాడు మన భక్తుడైన జాలరి.


  నాగపట్టణ సమీపమున నున్న మాలైపాడు గ్రామములో " ఆదిపత్త" అను జాలరి ఉండెను.వృత్తి చేపలను పట్టుట-ప్రవృత్తి శివపాదములను పట్టుట.తమ కులవృత్తిని శివారాధనగా భావించెడి భాగ్యవంతుడు.జాలముతో మత్స్యములను పట్టుట మహాదేవుని పూజగ భావించెడివాడు.

 " ఉతైనం విశ్వా భూతాని సదృష్టో మృగయా తినః"

  ఉషోదయ కిరణములతో స్వామినివిశ్వమునంతయు తడుముతున్న వేళ,నిత్యకృత్యములను ముగించుకొని చేపలను పట్టుటకు కావలిసిన వస్తువులను తీసుకొని,శివనామ స్మరణ చేయుచు,

 " నమః సస్స్పింజరాయ త్విషీమతే 'పథీనాం" పతయే నమః"

స్వామి,


 లేత పచ్చిగడ్డివలె ఎరుపు-పసుపు కాంతితో ప్రకాశిస్తూ, చూపిస్తున్న దారిలో నడుస్తుండేవాడు.

 "నమః స్స్రోతస్యాయచ -ద్వీపాయచ"

ప్రవాహమున నున్న రుద్రులకు-ద్వీపములందున్న రుద్రులకు అనేకానేక నమస్కారములు.చేయుచు చేపలను పట్టు పనిని ప్రారంభించెడి వాడు.






ఏలిన వాని కరుణ అన్నట్లుగ, ఏరు జలముతో నిండి,ఎనలేని మీనములతో ఆదిపత్తను ఆనందముతో అహ్వానిస్తున్న సమయమున,అత్యంత భక్తితో దానిని సమీపించి నమస్కరించెడువాడు.ఎందుకంటే,

 " నమో హ్రదయాయచ-నివేషాయచ".

  మిక్కిలి లోతుగల మడుగులో దాగి,ప్రకాశించుచున్న రుద్రా! నీవు దయార్ద్రహృదయుడవు కనుక మంచుబిందువులలో కూడ దాగి వానిని చైతన్యవంతము చేయుచున్నావు ."నివేషాయచ నమో నమః.స్వామి కులవృత్తిని గౌరవిస్తు నేను చేపలు పట్టడానికి వచ్చాను.దీనిని నీ పూజగా తలుస్తు,నిన్ను కొలుస్తున్నాను.పూజానంతరము నీకు నైవేద్యముగా
" జలజాక్షునకు జలపుష్ప నైవేద్యమును " సమర్పించి సంతృప్తుడనై మరలుతాను.నన్ను నిరాటంకముగా చేపలను పట్టుకోనీయి తండ్రి అని ప్రార్థించెడివాడు.


మీనాక్షితల్లి స్వామి  జాలరికి మీనములను అందించెడివాడు.వాటికి కర్మ క్షయమును చేయదలిచినవాడు

కనుక కఠినముగానే ఉండేవాడు.

" జలేభ్యో-జంబుకేభ్యో నమో నమః".

 ఆదిపత్త సామాన్యుడు.మహిమలు లేనివాడు.ఆదిదేవుడు మహిమాన్వితుడు.వీరిద్దరి మధ్య మొదలైనది వింత పరీక్ష,జాలరి నమ్మిన వాడు మాయాజాలరి.సహస్రకన్నులతో చూస్తు-హిరణ్య బాహువులతో సర్వవేళల సంతసములను వర్షించువాడు.

 ' మహేభ్యో క్షుల్లకేభ్యశ్చ నమోనమః.'

 పరీక్షించాలనుకునాడు . జాలరివాడు మడుగునచేపలను మననీయటంలేదు.సురక్షిత ప్రాంతాలకు చేపలుచేరసాగినవి మడుగులోని చేపలు.జాలరికి రెండో-మూడో వలలో పడేవి." ఈశ్వరుడివ్వాలి-ఈ వల చేపలతో నిండాలి," అనుకుంటు పడిన చేపలలో నుండి ఒక చేపను పరమేశ్వరార్పణముగా మడుగు లోనికి వదిలి,మహదానందముతో వెనుదిరిగేవాడు అదిపత్త.


" నమో శంభవేచ-మయోభవేచ."

 భుక్తి-ముక్తి ప్రదాత నీవు నా చెంతనే ఉండగా నాకెందుకు విచారము.శిక్షకుడవైన-రక్షకుడవైన నువ్వే నాకు సర్వస్వము.నీ స్మరణమే నా సంతోషము సర్వేశ్వరా అని స్తుతిస్తున్నాడు.

" నమః శీభ్యాయచ" జలప్రవాహమునమున్న స్వామి జలచరముల దారి మళ్ళించి,ఆదిపత్త జలపుష్ఫ నైవేద్యానురక్తిని పరీక్షింప దలచాడు.అందులోను,పతాక సన్నివేశమును ప్రారంభించినాడు పశుపతి.


" నమో నాద్యాయచ వైశంత్యాయచ

నదులలో,చిన్న చిన్న సరస్సుల రూపములలో నున్న సదాశివుని చమత్కారమా అనునట్లు,"

యథావిధిగా మడుగును చేరి,యమునిభంజించిన వానిని యెదనిండా స్మరిస్తు విసిరిన వలలో
 పడినదిసంభ్రమాశ్చర్యములను తోడుతీసుకొనివచ్చిన విచిత్రమైన పసిడిచేప ఒకటే వలలో పడినది.చుట్టు ఉన్న జాలరులు ఇకముందు ఏమిజరుగబోతున్నదో కద అని ఇంతింత కనులతో చూస్తున్నారు.విషయలంపటులైన మిగిలిన బెస్తవారు.

" గృత్సేభ్యో-గృత్సపతిభ్యశ్చవో నమో నమః"









 వలలో పడిన పసిడిచేప జాలరి భక్తిని పరీక్షిస్తున్నది.

 పరమేశ్వర సంకల్పము కదా! ఈశ్వర చైతన్యపు ఇంద్రజాలమిది.

భవతరణమునకు సోపానములు భగవంతుని పరీక్షలేగ.

కాదనలేని విధముగ కరుణను కురిపించువాని పరీక్షలు .కైవల్యమునకు అంగరక్షణలేగ.

.విషమపరీక్షలకు భయపడని ఆదిపత్త విషయవాంఛలకు బందీగాక ,ఏ మాత్రము తాత్సారముచేయక తన్మయత్వముతో తనకు దొరికిన పసిడిచేపను పరమానందముతో పరమేశ్వరార్పణముచేసి,పార్వతీనాథుని పాదపద్మములను చేరినాడు.పరమావధిని పొందినాడు.

  " ఓం నమో స్తారాయచ"
 " నమః శంభవేచ









మయోభవేచ." స్వస్తి

 స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.

   ( ఏక బిల్వం శివార్పణం)

   ( ఏక బిల్వం శివార్పణం.)










No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...