Sunday, May 3, 2020

CHAMAKAMU-ANUVAAKAMU-11

  శివునికరుణ అర్థము కానిది.శివుని కరుణ అద్భుతమైనది.మానవత్వముతో ప్రారంభమైన రుద్రచమక పారాయణ యజ్ఞము దైవత్వము పొందుటతో సఫలీకృతమగుచున్నది.సరి సంఖ్యలు-బేసి సంఖ్యలు సంకేతములై పరమాత్మ తత్త్వమునకు దర్పణములై దర్శనీయతను ప్రసాదించుచున్నవి.

 శివశక్త్యాత్మక భగవతత్త్వమును దర్శింపచేయుటయే మానవత్వముతో ప్రారంభించిన దీక్ష ను అవబృథస్నానముతో ముగించిన సాధకుని లక్ష్యము.ద్వ0ద్వములు నిర్ద్వంద్వమైన అపురూప స్థితి.

   ఈ అనువాకము "ఏకాచమే అంటూ త్రయస్త్రిగంశస్చమే ' 1 నుండి 33 వరకు గల బేసి అంకెలను-సంఖ్యలనుపురుష స్వభావముగల దేవతా ఛందముగా విజ్ఞులు పేర్కొనినారు.వీటినే అయుగ్మములు-విషమములు అని కూడా అంటారు.

  " చతస్రశ్చమే మొదలు అష్టాచత్వారిగంశశ్చమే" అనగా 4 నుండి 48 వరకు గల సంఖ్యలు అయుగ్మములు.సమములు.వీనిని సరిసంఖ్యలు అని కూడా అంటారు.ఇవి స్త్రీ స్వభావము కలవి.

  ఆదిశంకరులవారు స్తుతించినట్లు "శివశక్త్యా యుక్తా " సరి సంఖ్య బేసి సంఖ్య కలయిక మిథునత్వము.ఆదిదంపతుల అద్భుత దాంపత్యము.ఉత్తరోత్తర వంశాభివృధ్ధ్కి సూచితము.ఈ రెండు విధములైన మంత్రములతో చేయు జపతపములు-హోమములు అంతకంతకు అధికమైన అభివృధ్ధిని కలిగించునని,వాటికి మూలమైన పరమాత్మ తత్త్వమును కొంచము కొంచముగా అవగతపరచుచున్న చమకముతో మమేకమగుచున్న వేళ సర్వం శివమయం జగం.

   పరమేశ్వరానుగ్రహముతో మరింత సాధన శోధన చేసి చమకము లోని మరిన్ని విశేషములను" చమకముతో మమేకము" అను శీర్షిక పేరిట తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాను.

     ఏక బిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...