Sunday, May 17, 2020

CHAMAKAMUTO MAMAEKAMU-05


క్లప్తంచమే-క్లప్తిశ్చమే
************

   క్లప్తంచమే- ఇక్కడ సాధకుడు రుద్రుని తన యజ్ఞనిర్వహణకు గాను కావలిసిన ద్రవ్యములను కోరుకొనుచున్నాడు.

  యజ్ఞము సమర్థవంతము కావాలంటే వనరులు-వాటిని సద్వినియోగము చేసుకొనే సామర్థ్యము రెండు కావాలి. ఆ సామర్థ్యమును "క్లప్తిశ్చమే" అని అనుగ్రహించమని వేడుకుంటూన్నాడు.

  ఉదాహరణకు వాహనముకావాలి-దానిలోనికి నడిపించగలిగే ఇంధనము-చోదకుడు కావాలి.వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా నిరుపయోగమే.అదే విధముగా రుద్రానుగ్రహము అనే చోదకశక్తి,యజ్ఞమునకు కావలిసిన ద్రవ్యములను-వానిని సద్వినియోగపరచుకోగల సామర్థ్యమును కలిగియుంటే సత్ఫలితములను పొండగలడు.

   సాధకుడు రుద్రమహిమను తెలిసిన వాడు కనుక వాహనము వంటి శరీరమును,"వర్మాచమే" అని కోరుచున్నాడు.అది ఉండుటకు," ప్రథిమాచమే" ఇల్లు-వాకిలి కావాలంటూన్నాడు.అందులో ఉంటాను సరే,తినటానికి-చదువుకోటానికి"వృధ్ధంచమ-వృధ్ధిశ్చమే" అంటూ వాటిని అడుగుతున్నాడు.రుద్రుడు ఇచ్చిన శరీరముతో ఇంటిలో ఉంటూ ఆహారమును తింటూ,చదువుకుంటూ తాను ఏవిధముగా గుర్తింపును పొందాలో తెలియచేస్తున్నాడు "జైష్ఠంచమ-ఆధిపత్యంచమే" అంటూ స్వామి నువ్వు జ్యేష్ఠాయచ-కనిష్ఠాయచ అని నేను తెలుసుకున్నాను.నువ్వు అందరిలోని చైతన్యము కనుక నన్ను కూడ తీర్చిదిద్దు,తద్వారా నేను మంచిమార్గమున గమనమును సాగిస్తు,సత్యమును తెలుసుకోగలుగుతాను  అని విన్నవించుకుంటున్నాడు వినయముతో.

   రుద్రుడు అనుగ్రహించిన శరీరమను సాధనముతో ఆధ్యాత్మిక గమనములో తనను మాత్రమేగాక,తన ముందుతరములవారిని కూడ తరింపచేయాలను" "జాతశ్చమే-జనిష్యమాణశ్చమే" అని సాధకుడు అర్థించు,రుద్రానుగ్రహమైన చమకముతో నేను మమేకమగుచున్న వేళ,"సర్వం శివమయం జగం"


   ఏక బిల్వం శివార్పణం.


 
  

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...