Friday, May 22, 2020

CHAMAKAMUTOE MAMAEKAMU-06

     యంతాచమే-ధర్తాచమే
     **********************

  " గురుమధ్యేస్థితౌ విశ్వం
    విశ్వమధ్యే స్థితౌ గురు."

   విశ్వమే గురువు.గురువే  గురువే విశ్వము.రెండును అవిభాజ్యములు-అభేదములు.

   సాధకుడు తనకు కావలిసిన (దేహమునకు) నిద్రాహారములునివాసయోగ్యమైన ఇల్లు,మంచి నిద్ర-ఆరోగ్యము కోరుకున్నాడు "సీరంచమే-వసతిశ్చమే-శయనంచమే " అంటు.రుద్రుని మందహాసము సాధకుని మనసులో ఒక వింత ప్రశ్నకు కారణమైనది.నేను కోరుకున్నవేనా మానవజీవిత లక్ష్యాలు-లక్షణములు.కాదు.కానేకాదు.ఇంకా ఎన్నో అద్భుతాలు-అమృతాలు ఉన్నాయి.కాని అవి ఏమిట్పో వానిని స్వామిని ఎట్లా అడగాలో అర్థము కావటములేదు.దరహాసము దయాభాసమై,"యంతాచమే" అంటూ,తన మేథను వాటివైపుకు మళ్ళించగలిగిన ఆచార్యుని అర్థించేటట్లు చేసినది.రుద్రా నాకు ఆచార్యుడు కావాలి.అతడు సమస్త గోళములను గ్రహములను శక్తులను జీవులను వారివారి నిర్ణీత స్థానములందుంచి,గతి తప్పక-మితి తప్పక నియంత్రించబడిన కార్యములను చేయించగలిగిన నియామకుడై యుండాలి.ఆచార్యుని అనుగ్రహిస్తే ఏమి చేస్తావు అన్నాడు స్వామి;

    రుద్రా నీవు అనుగ్రహించిన ఆచార్యుని పర్యవేక్షణలో నేను వేదశాస్త్ర ప్రమాణములను తెలిసికొనుటలు-నాకు తెలిసిన దానిని నలుగురికి తెలియచేయటానికి శక్తిని""సంవిదశ్చమే-జ్ఞాతంచమే" అని నిన్ను అడగాలని తెలుసుకుంటాను.నా మనసులోని ఐహికభావములను శత్రువులను తొలగించుకొనుటకు "అనమిత్రంచమే" అని నిన్ను అర్థిస్తాను.అవి తిరిగి నన్ను చేరకుండా స్థిరముగా నుండుటకు ధైర్యము "ధృతిశ్చమే" అని నిన్ను వేడుకుంటాను.నీవు అనుగ్రహించిన ధైర్యముతో ఆత్మవికాసములో-సస్వరూప జ్ఞానములో నేను పోషింపబడాలి అంటే నీవు నా పోషకుడిగా మారాలి.మరీమరీ నిన్ను "ధర్తాచమే" ధర్తాచమే" అంటు వేదుకుంటాను.

    కాని రుద్రా నా బుధ్ధి మాటను వినకుండ,నా మనసు అప్పుడప్పుడు కుదిరితే ఎప్పుడు నన్ను విషయవాసనల లోయలోనికి తోసివేయాలని చూస్తూనే ఉంటుంది.సస్యశ్యామలమైన (నీ భావనతో) నా హృదయమును బీడుభూమిగా మార్చేస్తుంటుంది.తిరిగి బాగుచేసుకోవటానికి నాకు నాగలి-ఎడ్లు కావాలి.ఇంకా కొన్ని వ్యవసాయమునకు అవసరమైన పరికరములు కావాలి."సీరంచమే" అదేనయ్యా నీ అనుగ్రహమనే నాగలిని,ధ్యాస-ధ్యానము అను రెండు ఎడ్లను ఇచ్చావంటే,నీ నామస్మరణమను తాటికి కట్టి,నేను దున్నుతుకుని,కలుపుమొక్కలను తీసివేసి అలిసిపోయిన శరీరమునకు మనసుకు విశ్రాంతిగా కాసేపు ఆధ్యాత్మిక ఆహ్లాదమను శయ్యపై నిదురించి,తిరిగి మంచి దినమునకు ప్రారంభమైన సుప్రభాత కాలములో "సూషాచమే-సుదినంచమే" అంటు సాధకుడు చమకముతో మమేకమగుచున్న వేళ "సర్వం శివమయం జగం."


    ఏకబిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...