OM NAMA SIVAYA-13

శివాయ
అమ్మ గర్భశిశువు వలె,అలలలోని జలము వలె
పాప నోటి పంటి వలె,పాలలోని వెన్న వలె
చేనులోని పంట వలె,మేనులోని మేధ వలె
భూమిలోని నీటి వలె,భూరుహుముల పండు వలె
ఆయువగు గాలివలె సాయమగు జాలివలె
వ్యక్తమవని శక్తివలె,వ్యక్తి లోని యుక్తి వలె
కొయ్యలోని బొగ్గు వలె,కొమ్మలోని పువ్వు వలె
సూక్ష్మమైన స్థూలము వలె,స్థూలములోని సూక్ష్మము వలె
స్థాణువున చలనము వలె,సాధించిన సంకల్పము వలె
గుడ్డులోని పిట్ట వలె,విడ్దూరపు భూభ్రమణము వలె
విత్తులోని చెట్టు వలె,చిత్తులోని పట్టు వలె
నిక్కి నిక్కి చూస్తావురా ఓ తిక్క శంకరా
................................................................

శివుడు పిరికితనముతో తల్లిగర్భములో,అలలఓ,పాలలో,పాపనోటిలో,భూమిలో,విత్తులో,చెట్టులో,కొమ్మలో,గుడ్డులో,చిత్తులో దాని ఎప్పుడెప్పుడు బయటకు వద్దామా అని తొంగితొంగి చూస్తుంటాడు--నింద. " వ్యక్తావ్యక్త స్వరూపాయ వామదేవాయ తేనమః". వామదేవ నామియైన శివుడు సకలచరాచరసృష్టి విధానమునకునియామకుడై,ఒక నిర్ణీతక్రమములో నడిపిస్తు మనలను అనుగ్రహించుగాక.-స్తుతి. ఏక బిల్వం శివార్పణం.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.