Monday, July 27, 2020

OM NAMA SIVAYA-76

ఓం నమః శివాయ-83
  ********************

 విర్రవీగు వారిపై వెర్రిప్రేమచూపుతావు
 స్వార్థపు అభ్యర్థనలను ప్రార్థనలని అంటావు

 అహంకార తపములకు సహకారమవుతావు
 ప్రీతిపాత్రములుగ అపాత్రవరములిస్తావు

 ఆలోచనన్నదిలేక అసురత్వమునాదరిస్తుంటావు
 నిర్లక్ష్యము కూడదంటు ప్రత్యక్షము అవుతావు

 అడిగినాడు అంటావు-అడుసు తొక్కుతుంటావు
 అదునుచూసి వారు అదుపుతప్పుతారు అనుకోవు

 గతితప్పిన ఫలితములతో గాబరపడుతుంటావు
 మేకను జయించావు-పులిని జయించావు

 మేకవన్నెపులులతో  తికమకపడుతుంటావు
 నక్కవినయములేరా అవి ఓ తిక్కశంకరా.


శివుడు తనను గురించి తపము చేశారని,ప్రత్యక్షమై,వారికి వరములను అనుగ్రహించవలెననుకుంటాదు.కాని వారు రావణుని వలె అహంకారముతో తపమాచరించుచున్నారో,స్వార్థముతో అనుగ్రహమును కోరుతున్నారో,లేక తానిచ్చిన వర ప్రభావమును తన పైననే పరీక్స్గితారో,వారి నిజ స్వభావమెటువంటిదో ఆలోచించలేడు-నింద.

 అసురులు నమః శివాయ-అమరులు నమః శివాయ
 వరములు నమః శివాయ-వగచుట నమః శీవాయ

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ


  రాక్షసులు-అసురులు వ్యవహారికములో సమాన పదములుగా నున్నప్పటికిని,కించిత్ వ్యత్యాసము ఉన్నదేమో అనిపిస్తుంది.పూర్తిగా తమోభావముతో నిండిన మనసుతో-కౄరమైన చేష్టలతో జీవితమును గడుపువారు రాక్షసులు.వీరి ప్రవృత్తిలో సత్వ-రజోభావములకు తావుండదు.అసురుల విషమునకు వస్తే వీరు త్రిగుణములను కలిగిన వారైనప్పటికిని,వాటి సమతౌల్యతను పాటించలేనివారు.చాలా సమయములలో వీరు సంపూర్ణ సంస్కారవంతులుగా ప్రవర్తించునప్పటికిని,వారిలోని తమోగుణము సత్వ-రజో గుణములను తోసివేసి,ఇంద్రియములను ఆయుధములగా తీసుకొని,వాటితో కలిసిదుష్కృత్యములకు జీవి పూనుకునేటట్లు చేస్తుంది.తత్ఫలితముగా వారు కర్మ ఫలములను అనుభవిస్తారు.ఉదాహరణకు రావణాసురుడు కామము చేత-హిరణ్యకశిపుడు వైరము చేత ప్రభావింపబడినవారే కాని,తక్కిన విషయములలో వారు సంస్కార వంతులే.

  ఇంకొక ముఖ్యమైన విషయము మనము గమనించవలసినది వీరు జీవాత్మలు.వీరు కోరుకున్నది పరమాత్మను.జీవాత్మ-పరమాత్మ సమన్వయమే సదాశివ తత్త్వము.వారు స్వామిని కోరుకొనుచున్నారు.స్వామి వారిని అనుగ్రహించుచున్నారు.ధూర్జటి మహాకవి అన్నట్లు "పాలున్ బువ్వయు" స్తుతి.

   ఏక బిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...