Saturday, September 26, 2020
PRAPASYAMTEE MAATAA-10
ప్రపశ్యంతీ మాత-10
****************
" కమలాంబ నా చింత తీర్చవమ్మా "అంటు ఆర్తితో ఆలపించాడు ముత్తుస్వామిదీక్షితారు ముక్తిని పొందగలిగారు.ఆ కీర్తనను నవావర
ణ కీర్తన అంటారు.కాళి సక్తితో ప్రారంభమైన మన శక్తి దర్సన ప్రయానము తార-షోడసి-భువనేశ్వరి-భైరవి-ఛిన్నమస్తక-ధూమవతి-బగళముఖి-మాతంగి అను తొమ్మిది విధములైన శక్తుల స్థూల తత్త్వము-సూక్ష్మ తత్త్వమును పరిచయము చేసుకొని,బహిర్దర్శనముతో బాహ్య ప్రవృత్తులను సాధనములు చేసుకొని వాటికి మూలమైన అంతర్డర్శనమునకు తల్లి కమలాంబిక అనుగ్రహముతో ఉద్యుక్తులమగుచున్నాము.చీకతి తొలగి కాంతి-శబ్దము మనకు పరిచయమైనవి.సుందరము-సుభిక్షము అను బాహ్య-అంతర విషయములు బయటపడినవి.వాటిని వరుచేసుకొనుట-పనికి రాని వాటిని పరిత్యజించుట అవసరమని తెలుసుకున్నాము.క్రమక్రమముగా నలుపు-తెలుపు రంగులలో నున్న శక్తి తత్త్వము తన నలుపును చీకటిని తొలగించుకొని,శుధ్ధ సత్వ ప్రకాశముగా శుభపరిణామముగా ద్యోతకమగుచున్నది.అంటే సూర్యోదయమగుచున్నది స్థూలములో.శక్తి తత్త్వము అవగతమగుచున్నది
సూక్ష్మములో.ఆ విధముగా లోపల -బయట వెలుగులు విరజిమ్ముతు సూర్యోదయమున ప్రకాశించుచున్న జ్ఞానమే కమలాంబిక.తొలగి పోయిన తమస్సు,ఉషస్సు అనే జ్ఞానధారలను నాలుగు దిక్కుల నుండి వర్షించుచున్నది.అదియే నాలుగు ఏనుగులు అమ్మపై కురిపిస్తున్న అమృత వర్షము.
జగత్సముద్రమునుండి ఆవిర్భవించిన కమలమే కమలాంబిక.ఏ విధముగా కమలము బురదనుండి పుట్టినను,ఆ బురదను ఇసుమంతయు తాకనీయక స్వచ్ఛముగా నిర్మలముగా ఉంటుందో ,అదే విధముగా ఇంద్రియవాసనలనే సముద్రము నుండి జనించిన సాధకుడు శుధ్ధ సత్వమూర్తియై,ఎటువంటి ప్రాపంచిక మలినములు అంటనీయక,ఆత్మదర్శనముకై అన్వేషణను ప్రారంభిస్తాడు.నశ్వరమైన శరీరమును ఆధారముచేసుకొని సచ్చిదానందస్థితిని చేరుకుంటాడు.అంటే మూలాధరములో నిద్రాణమై యున్న కుండలినీశక్తి, తల్లి దయతో చిఛ్చక్తిగా చైతన్యవంతమై దారిలోనున్న ముడులను విప్పుకుంటూ,ఉర్ధ్వ ప్రయాణమును చేస్తూ సహస్రార చక్రస్థిత శివశక్తైముర్తిని చేరుకుంటుంది.ద్వంద్వము తల్లి దయతో నిర్గుణ- నిరంజన -నిరాకార నిశ్చలస్థితిలో లీనమయి సూక్ష్మ-స్థూల భేదములను రూపుమాపి "ఏకం న ద్వితీయము"ను నొక్కివక్కాణిస్తుంది.
అంతెందుకు పదిశక్తులు ఒకేఒక మహాశక్తిగా మళ్ళీ మారిపోతాయి.మహా శక్తి ఒక్కొక్కసారి తనశక్తిని వివిధ నామ-రూప-స్వభావములుగా విస్తరింపచేస్తూ,తిరిగి తనలో విలీనము చేసుకొని ఏకమాతృకై, సాకార-నిరాకారములను క్రీడలతో క్షేమంకరిగా కీర్తింపబడుతుంది.దీనికి ఒక చిన్న ఉదాహరణమును మనము పరిశీలిద్దాము.మనము మనస్కరిస్తున్నప్పుడు మన పదివేళ్ళు కలిసి పనిచేస్తున్నాయి.అట్లా అని అవి అన్ని పనుల సమయములలో కలిసి ఉండవు.దారి చూసిస్తున్నప్పుడు చూపుడు వేలు చైతన్యవంతమైతే,మిగిలిన తొమ్మిది తటస్థస్థిలో ఉంటాయి.వస్తువును పట్టుకునేటప్పుడు రెండు వేళ్ళు-వ్రాస్తున్నప్పుడు మూడు వేళ్ళు,పూలమాలను అల్లుతున్నప్పుడు నాలుగు వేళ్ళు,ఇక ఐదు వేళ్ళు కలిస్తే అద్భుతాలే.వేటికవి
శక్తివంతమైనప్పటికి,అవసరమైనపుడు మాత్రమే తన శక్తిని చైతన్యవంతము చేస్తూ,మిగిలిన సందర్భములలో తటస్థస్థిలో ఉంటాయి ఇదే అమ్మ లీలా లాలిత్యము.
ప్రియ మిత్రులారా,విశేష శరన్నవరాత్రుల శుభసమయమున అమ్మ అనుగ్రహముతో పలికించిన విషయములను మీతో పంచుకున్నాను.నిజమునకు ఆదిశేషునకు అసాధ్యమైన (వేయి నాలుకలుండియు) తల్లిని, తామసి యైన నేనేమని చెప్పగలను.మీ ఉన్నత సంస్కారము దానిని దరిచేరనిచ్చినది సర్వదా అనుమతించిన నిర్వాహకులను-ప్రోత్సహించిన మీకు ధన్యవాదములు.
ధన్యోస్మి మాతా ధన్యోస్మి.
Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-18
తనోతు నః శివః శివం-17 ******************* " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment