Monday, October 19, 2020
0005
.
అమ్మకు సభక్తిపూర్వక నమస్కారములతో
ప్రసీద మమ సర్వదా-05
******************
స్కందమాత నమోనమః
*******************
"సింహాసన గతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా
శుభమస్తు సదాదేవి స్కందమాతా యశస్వినీ"
ఇంతవరకు జగన్మాత నిర్ద్వంద్వ రూపిణిగా నిరుపమాన ప్రతిభతతో జగములను సృష్టించింది."ఏకైవాహం బ్రహ్మం" అన్న నానుడి మరొక శుభపరిణామమునకు శ్రీకారముగా మహాశక్తి తన ఒడిలో మరొక అద్భుత శక్తితో మనకు దర్శనభాగ్యమును అందిస్తున్నది.
ఎంత తియ్యటిమామిడి పండో అంటూ నేడు మనము ఆస్వాదించగలుగుతున్నామంటే ,ఎంతో కాలానికి ముందు.ఎవ్వరో మహానుభావుడు మామిడిటెంకను భూమిలో నాటడము జరిగిదింది.భూమి దానికి తనశక్తిని అందించి,అగ్ని చైతన్యమును అందించి మొలకగా మార్చినది.వరుణుడు అందించిన జలములతో మొలక మొక్కగా మారినది.మొక్క సూర్యకిరణములనుండి పత్రహరితమునుచంద్రుని వెన్నెలలోని ఔషధశక్తులను తనలో నింపుకుంటూ కొమ్మలతో వాయువందిస్తున్న శక్తిని తనలో నింపుకుంటూ పంచభూతాత్మక పోషణలో మహా వృక్షముగా రూపుదిద్దుకుని మధురఫలములను మనకు అందిస్తున్నది.ఇది లౌకిక ఉదాహరణము.
పంచభూతాత్మికం పరమశివం అన్నది కాదనలేని సత్యము.త్రిపురారహస్య కథనము ప్రకారము స్కందోత్పత్తికి సనత్కుమారునికి వచ్చిన కల,దాని పరిణామములు అలౌకిక ఉత్ప్రేరకము.
సనత్కుమారుడు దైవకార్య నిమిత్తము శివ పుత్రుడుగా జన్మించుట మహద్భాగ్యమే అంతటి జ్ఞాని శివుని ఆజ్ఞాపాలన ఆనందముగా అంగీకరించి,అందులో ఒక చిన్న వెసులుబాటును వరముగా కోరుకున్నాడు.అదియే మాతృగర్భవాసము లేకుండా మహాస్కందోత్పత్తి.అసురీభావ మర్దనమునకు (తారకాసుర) నాంది-పునాది.
.
స్కందము చేయబడిన శక్తి నుండి ఆవిర్భవించిన శక్తి స్కందనామముతో సంకీర్తించబడుతున్నది.ధర్మరక్షణార్థము బ్రహ్మ వరమును గౌరవించుటకు,మన్మథ దహన సమయమున వెలువడిన శివతేజము ఆరు భాగములుగా విభజింపబడినదట.ఆ తేజస్సును భూమి-అగ్ని-గంగ-తటాకరూపమున పార్వతిదేవి నిక్షిప్త పరచిన. రెల్లునుండి తారకుని దుండ
గములను చెల్లు చేయుటకు ఆరుగురు అద్భుత బాలురుగా ఆవిర్భవించినది..కృత్తిక నక్షత్ర శక్తులు వారికి తమ శక్తులను స్తన్యమునిచ్చి యుధ్ధ సన్నధ్ధునిచేసినవి.తారకుని అంతమొందించగల ఆరుగురు బాలురను అమ్మ తన అక్కున చేర్చుకొని అత్యంత సుందర షణ్ముఖునిగ తీర్చిదిద్దినది.షణ్ముఖుని ఆరు ముఖములు పంచభూత తత్త్వమునకు-ఆత్మతత్త్వమునకు అద్దముపట్టుచున్నవి
స్కందమాత మనకు షణ్ముఖుని ప్రసాదించుట అసుర సంహారమునకు అత్యవసరమైనది.అదెప్పుడో జరిగిన కథ దానివలన ఇప్పుడు మనకేమిటి ఉపయోగము? అనుకోవద్దు.ఆ కథాకాలమునాడు జరిగిన మంచి-చెడు గుణార్విభావము ఇప్పుడు జరుగుతూనే ఉన్నది.కాసేపు మనలను మనము ఒక నాణెముగా ఊహించుకుందాము.
.
గుణావిర్భావము జరిగి ఒకే నాణెము మంచి-చెడు,సుర-అసుర రూపములను సంతరించుకొని సమరమునకు దారితీస్తున్నది.అంటే మనము అని చెప్పుకునే నాణెము కూడ ఒకవైపు చీకటి-మరొకవైపు వెలుగు అను రెండు తత్త్వములను ముద్రించుకొని,గిరగిర తిరుగుతుంటుంది.ఎక్కువ శాతము అది చీకటినే చూస్తుందనుకోండి అది విచక్షణను కోల్పోయి విచారగ్రస్థమవుతుంది.వెలుగును చూడలేక దిగులుతో ఉంటుంది.నిలకడలేక తిరుగుతూ చీకటినే చూస్తున్న నాణెమును వెలుగువైపునకు స్థిరముగా నుండునట్లు దాని చీకటి ముద్రించిన వైపును కిందివైపునకు మూసివేసి ఉంచుటయే దానికి తగిన జ్ఞానమును అందించుట. ఆ జ్ఞాన-క్రియా శక్తుల సంగమమే గుహ్యానుగ్రహము.
మూర్తీభవించిన జ్ఞానశక్తిని మనకు అందించుట అమ్మ సంకల్పము.
ముడులరూపమున నున్న అజ్ఞానమును విప్పుకొను ప్రయత్నము మన సంకల్పము.
.
అమ్మ చెంతనున్న మనకు అన్యచింతనలేల?
అమ్మ దయతో ప్రయాణము కొనసాగుతుంది.
అమ్మ చరణములే శరణము.
Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-18
తనోతు నః శివః శివం-17 ******************* " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment