Thursday, October 15, 2020
oo2
ప్రసీద మమ సర్వదా-02
***********************
అమ్మకు సభక్తిపూర్వక నమస్కారములతో,
నవదుర్గ ప్రస్తావన వరాహపురాణములో వచ్చినదని,పురాణాలు ప్రణవము నుండి పుట్టినవని పెద్దలు చెబుతారు.
సూర్యుడు కన్యారాశిలో నుండు సమయము కనుక పరమాత్మ తత్త్వమును స్త్రీమూర్తిగా భావించి-పూజించు సంప్రదాయమును అనుసరించేవారు ఉన్నారు.
శరత్కాలముులోని నవరాత్రులను దేవిశరన్నవరాత్రులంటారని దీనినే బతుకమ్మాగా ప్రకృతిని కొలిచే సంప్రదాయమును మనము చూస్తూనే ఉన్నాము.
నవ శబ్దమునకు నూతనత్వమును సంతరించుకొనిన అనగా కొత్త కొత్త నామరూపములతో ఏ ఆకారములేని తత్ అనేక ఆకారములై,నామరూపములతో అలరారుతూూ.అసుర సంహారమునుచేసి,ఆనందోత్సాహములనులను నింపిన సమయము ఇది.పురాణము అను పదమునకు పూర్వకాల కథా విశేషముగా అన్వయించుకుంటే ఇది సరిపోతుంది.తల్లి అనుగ్రహము మనలను అంతటితో ఆపేస్తుందా? అన్వేషణను కొనసాగిస్తుందా? అంటే రెండవది తథ్యము.సంఖ్యా పరముగా నవ అను శబ్దము తొమ్మిది"9" అను సంఖ్యను సూచిస్తుందికదా.తొమ్మిది అను సంఖ్యను హెచ్చవేస్తూ వచ్చినదానిని కూడుతుంటే మళ్ళీ తొమ్మిదే వస్తుంది.అంతే అమ్మ అనేక రూపాలను దర్శిస్తూ,దయను అన్వయము చేసుకుంటే అన్నిరూపాలలోను అమ్మ ఏకత్వమే బోధపడుతుంది.ఇది కాదనలేని సత్యము.
కథలో పిట్టకథలు దాగి నీతిబోధను చేయునటుల అమ్మ నవదుర్గ కథనము కూడా నాలోని నేను ని చూపుతుంది కొంచము విజ్ఞతతో చూడగలిగితే
కథాప్రకారముగా ప్రస్తావించుకుంటే,సతీదేవి తిరిగి శైలపుత్రి గా ఆవిర్భవించి,పరమేశునికై తపముచేసి,పెండ్లాడి,అర్థభాగమై,తదుపరి దైవకార్య నిమిత్తమై స్కందమాతగా సన్నుతించబడుతోంది.ఇక్కడి నుండి అసలు కథ ప్రారంభం.మంచిచెడుల మధ్యన జరిగే ఘర్షణ-ఘటన-శిష్తరక్షణ-దుష్ట శిక్షణ.మనకు పరోక్ష జ్ఞానదాతలనదగిన తారకాసురుడు-మహిషాసురుడు-రక్తబీజుడు-శుంభనిశుంభులు-చండ-ముండులు ఇలా ఎన్నో రూపములు తమ త్రిగుణ సమతౌల్యతను కోల్పోయి, అరిషడ్వర్గ అధీనులై అమ్మతో అహంకరించి ఆడిన ఆటలు.అమ్మ అనుగ్రహముతో ప్రత్యర్థియై రక్తికట్టించిన రక్షణలీలలు.మంచిచెడుల పంచన ఉన్న మనము తల్లి ఇచ్చిన రెండు రెక్కలతో ప్రదర్శనను చూడటమేకాదు.పాఠాలను నేర్చుకొని పరిణితిని పొందుదాము.
మొదటి దుర్గ శైలపుత్రి మన ఆత్మ పరిశీలనమునకు నాందిపలుకుతుంది.రెండవ దుర్గ బ్రహ్మచారిణి పరిశీలనను ప్రయాణముగా మారుస్తున్నది.మూడవ దుర్గ ప్రయాణ ఫలితమునకు ఘోరములను అఘోరములుగా మారుస్తూ,ఆత్మ దర్శనమునకు అనువైన సహాయమును చేస్తున్నది.నాల్గవ దుర్గ కూష్మాండాదేవి స్థూల-సూక్ష్మములను అండ రూపములో పరిచయము చేస్తూ,వానిని అలవోకగా-అలసటలేకుండా నిక్షిప్తము చేస్తూ,నిఖిల నూతనత్వమును సూచిస్తున్నది.ఐదవ దుర్గ స్కందమాత తానొక అద్భుతసృష్టికి అమ్మయై జన్మసార్థకత జయనికేతనమును ఎగురవేస్తున్నది.
ఆరవ శక్తి అమ్మతనమును .అది అందించిన అద్భుతశక్తుని ఆవశ్యకతను,అరిషడ్వర్గముల ఉనికిని,వానికి ఆలంబన అయిన ఇంద్రియ చర్యల ఫలితములను దర్పణమై దర్శింపచేయుచున్నది.ఏడవ శక్తి కాళరాత్రి రూప అశాశ్వతత్త్వమును-ఆత్మ శాశ్వతత్త్వమును
ఆవిర్భవింపచేస్తు,విశ్వకళ్యానమునకు తన్ను తాను మలచుకొను మహత్ విన్యాసమును మనముందుంచుచున్నది.ఎనిమిదవ దుర్గ యైన మహాగౌరి " క్షమయా ధరిత్రి"తన తేటతెలుపు మేని కాంతితో అజ్ఞానమను నల్లని చీకట్లను తరిమివేసి,గౌరవమను ప్రసాదించునది.పదవ దుర్గ తరణోపాయయై ఉన్నస్థితి నుండి ఉత్తమస్థితిని చేర్చగల సిధ్ధిధాత్రి.
ఈ పదిరోజులు అమ్మ పరిపూర్ణ అనుగ్రహమును పొందుటకు ప్రయత్నిద్దాము.
అమ్మ చెంతన ఉన్న మనకు అన్య చింతనలేల?
అమ్మ దయతో ప్రయానము కొనసాగుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-18
తనోతు నః శివః శివం-17 ******************* " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment