Sunday, October 4, 2020

PRASEEDA MAMA SARVADA04

ప్రసీద మమ సర్వదా-04 మాతా కూష్మాండా నమోనమః "సురాసుర సంపూర్నకలశం రుధిరా పుత్రమేవచ దధనా హస్త పద్మాభ్యాం కుష్మాండా శుభదాస్తుం " శైలపుత్రీ మాత మనకుబ్రహ్మచారిణి మాతను పరిచయము చేస్తే,బ్రహ్మచారిణి మాత మనకు చంద్రఘంట తల్లి పరిణయమను ప్రసాదగుణమును అందించింది.ఇల్లాలైన చంద్రఘంట తల్లి సూక్ష్మ-స్థూల రూపములతో అండరూపముగా ధరించు కూష్మాండ మాత కరుణరసామృత వర్షిలో మునిగితేలే మురెపమును అందించింది. కు అనగా చిన్న/సూక్ష్మ అను భావమును మనము గ్రహించగలిగితే,ఊష్మాండా అనగా సుందరతత్త్వము.అనగా తల్లి మనలో సూక్ష్మరూపములో నిండి స్థూలతత్త్వమును దర్శింపచేస్తుంది తల్లి.అందుకే ఆమ్మ అష్టసిధ్ధిస్వరూపిణి అయిన అష్టభుజి. పదునాలుగు భువనంబులు కుదురుగ తన కుక్షిలో నింపుకొని,దేవకీదేవి గర్భములో ఒదిగిన శ్రీకృష్ణుని వలె సూక్ష్మాతిసూక్ష్మము కాగలదు.అదే విధముగా ఇందుగలదందులేదని...ఎందెందు వెతికి చూసిన అందందేగలడు చక్రి అని ప్రహ్లాదుడు అన్న చందంబున విశ్వరూపియై విచ్చేయగలది కూష్మాందమాత. ప్రళయానంతరము సర్వము అంధకారబంధురమైన సమయమున "మందస్మిత ప్రభాపూర" తన చిరునప్పు కాంతులతో చీకట్లను చిదిమివేసినది.సూర్యమండలమధ్యయై వేడిని-వెలుతురును ఆదాన-ప్రదానముల ద్వారా అందించుచు మనలను ఆశీర్వదించుచున్నది. తల్లీ నీవందించుచున్న ఉషోదయ కాంతితో,నా బుధ్ధి యనెడి పద్మము వికసించి,విశ్వమంతయు నిండియున్న నీ స్వరూపంబును-నా స్వస్వరూపముతో అనుసంధానముచేయుచున్నది. అమ్మ చేతిని పట్టుకుని ఆనందాబ్ధిలో ఓలలాడనీ. అమ్మ చెంతనున్న మనకు అన్య చింతనలే. అమ్మ దయతో మన ప్రయాణము కొనసాగుతుంది అమ్మ చరణములే శరణము.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...