MEEDUSHTAMA SIVATAMA-19

 మీఢుష్టమ శివతమ-18

      *********************

  న రుద్రో రుద్రమర్చయేత్-రుద్రుడు కానివాడు రుద్రుని అర్చించలేడు.

   సాధకుని మదిలో రుద్రుని మాటలు స్థిరముగా ముద్రితమగుచున్నాయి భద్రతను కలిగించుతకా యన్నట్లు.

      భాసము/అభాసము అను రెందే మన ప్రపంచము.భాసించేది పరమాత్మ.భాసించేదిగా భ్రమింపచేదేది ఆభాస.ప్రకాశము లేని దానిని-ప్రకాశ సహాయముతో నున్నదానిని ప్రకాశముగా అనుకొనుటయే మాయ.

  నేను ఈ సరీరములోనికి వచ్చాను.దీనిలోనున్నాను.ఏదో ఒకరోజు దీనిని విడిచివేస్తాను అన్న విషయము మరువకూడదు.నేను నా సరీరమును చూస్తున్నాను కాని ఈ నాశరీరము నేనుకాదు.

   అలా అనుకుంటు అడుగులు కదుపుతున్నాడు సాధకుడు.వడ్రంగి దుకానము అది.వాడికి గొప్ప పనితనముందట కాని పనిచేయలేక పోతున్నాడట.పనిని ప్రారంభించలేదని-పూర్తిచేయలేదని నిందిస్తున్నారతనిని కొందరు అతనిని.మచములు చేయమని టేకు చెక్కనిచ్చాడొకడు.కుర్చీలు చేయమని మేడిచెక్క నిచ్చారు ఇంకొకరు.కొందరు దేవదారు చెక్కనిచ్చారు బల్ల చేయమని.కాని వడ్రంగి రంపమును పట్టలేదు.వస్తువులను చేయలేదు.

    ఎందుకంట పాపం? అందుకున్నాడు రుద్రుడు వానిని అనుసరిస్తూ నడుస్తూ.వచ్చావా! వదలవు కద.



   వాడికి కలప నాణ్యత బాగా తెలుసట.అదియే వాడికి అడ్డంకిగా మారిందట.

 అదేమిటయ్యా సాధకా.వాడి జ్ఞానము వాడికి హాని ఎలాచేస్తుంది? అమాయకంగా అడిగాడు రుద్రుడు.

  అడిగినదే తడవుగా చెప్పుకొస్తున్నాడు సాధకుడు.!ఱంపము తీసుకొనిదుంగను కొయ్యటానికి వెళతాడట.అంతలో ఏమవుతుందో ఏమో.ఇది టేకు.చాలా ఖరీదు.ఇది మేడి చెక్క.ఇది వేపదుంగ.ఇది దేవదారు.అంటూ వాటి నాణ్యతను-ఖరీదును తలచుకుంటు పనిమానేస్తాడట పాపం.కలపను ఇది నాణ్యమైనది-ఇది సామాన్యమైనది-ఇది చవక బారుది అని వర్గీకరిస్తూ,తన పనితనమును వదిలివేస్తున్నాడు.అంతా కలపే నన్న ఇషయాన్ని విస్మరించినదుకే ఈ పరిస్థితి అంటూ తీర్మానించాడు సాధకుడు.

   అంతా విన్నాడు రుద్రుడు.వింతగా నవ్వాడు సాధకుని చూస్తూ.అంత వింత ఏముంది దీనిలో అంతగా నవ్వటానికి అంటూ,

   ఈ మానవులు వడ్రంగి వంటివారే కదా.వారి దగ్గర శరీరము అనే కలప ఉన్నది.సాధన అనే చాతుర్య సక్తి ఉన్నది.కాని వారు ఇది నా భార్య-వీడు నా సుతుడు-ఇది నా కుటుంబము అనుకుంటు,తనదగ్గరనున్న పనితనమును ఉపయోగించలేకపోతున్నాడు.

  మొన్న అన్నవుగా వారు "త్విషిశ్చమే" అని అన్నారని.శక్తిని తన గమ్యమునకు చేర్చగలసూచనలిచ్చి సూక్ష్మమును చూపించకల్ది ఆ త్విషి.

  ఉషోదయమవుతున్నది సాధకుని మనసుకు.సూషాచమే-సూషాచమే" అంటూ అంతర్ముఖుడైనాడు.అంతర్ధానమయ్యాడు రుద్రుడు.

 అణువు అనువు శివమే-అడుగు అడుగు శివమే

 కదిలేవి కథలు-కదిలించేది కరుణ

 ఏక బిల్వం శివార్పణం


Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI