Monday, December 21, 2020

ALO REMBAAVAAY-11



  పదకొండవ పాశురము.

 ***********************


   కట్రుక్కరవై కణంగళ్ పలకరందు

   శెట్రార్తిరళలియం శెన్రు శెరుచ్చెయ్యుం

   

   కుట్రం ఒన్రిల్లాద కోవలరం పొర్కిడియె

   పుట్రు రవల్గున్ పునమయిలే పోదారాయ్


   శుట్రుత్తు తోళీమార్ ఎల్లారుం వందు నిన్

   మూట్రం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్పాడ


  శిట్రాదే-పేశాదే సెల్వ పెండాట్టి, నీ

  ఎట్రుక్కు ఉరంగుం పొరుళేలో రెంబావాయ్.


   నమో భగవతే శిఖి పింఛాయ నమః.

   *************************

 

 కోవలరం పొర్కడియె-గోకులపు బంగరుతీగె/ ఓ గోపిక,


  మీ గోకులములోని గోపాలురు అతిబలపరాక్రమవంతులు.తమకు తాము శత్రుస్థావరములను/బలమును గుర్తించి,వారిపై దండెత్తి మట్టుపెట్టువారు.అంతః శత్రువులకు సైతము అదేగతి.


 వారి పరాక్రమ ప్రదర్శన కేవలము శత్రువులమీదనే.


 శెట్రాల్-శత్రువుల

 తిరళ్-బలపరాక్రమములను తెలిసికొని

 శెరుచ్చెయ్యం-తామే వారిపై దండెత్తి,

 అరళియం-మట్టుపెట్టి వచ్చువారు.


  మిగతా సమయములలో వారు గోపోషణమను స్వధర్మవృత్తిని/సత్వగుణను కలిగియున్నవారు.



  మన గోకులములోని గోవులు కూడ గోవిందుని వీక్షిస్తూ,వేణుగానమును వింటూ,స్పర్శను అనుభవ్స్తూ,గుంపులుగుంపులుగా పెరుగుతూ,అందమైన లేగదూడలను కలిగి,తమకు తామె పుష్కలముగా క్షీరమును అనుగ్రహిస్తున్నవి.పితుకకున్నను అధికముగా (అనుగ్రహమును) వర్షించుచున్నవి.


 కణంగళ్-సమూహములు/గో సమూహములు

 కట్రుక్కరవై-లేగదూడలను కలిగియున్నవై,

 పలకరందు-తమకు తామె పుష్కలముగా పాలను ఇచ్చుచున్నవి.


 ఇది ఆచార్యులు చేతనులపై తమకు తాముగా అందించు అనుగ్రహము.


  మన గోపికను గోదమ్మ,


  పుట్రు-పుట్టలో

  అల్గుల్-చుట్లతో చుట్టుకొనియున్న

  అరవ్-పాముగా కీర్తించినది.(కుండలినీశక్తి)


   శ్రీకృష్ణ తాదాత్మ్యములో,బాహ్యమునుండి మనసనే పుట్టలోనికి ప్రవేశించి,తన శక్తుల పరిమాణమును,పరాక్రమమును నిక్షితము చేసుకొని,నిద్రానముగా నున్న ఓ తల్లి,మేలుకొని మాతో వ్రతమును చేయుటకు రమ్ము.


 ఎందుకంటే నీవు నీలిమేఘమనే నీలమేఘశ్యాముని చూచిసంతోషముతో,పురివిప్పి నాట్యమాడు వనమయూరివి.

 నీవు నాట్యమును చేయునప్పుడు వనములో చుట్టునున్న విషక్రిములు దూరముగా విసిరివేయబడుచున్నవికదా/విషయవాసనలు పటాపంచలమగుచున్నవి కదా.


 నీకై మేము ఎల్లారం వందు-అందరము వచ్చినాము.కనుక

పోదరాయ్-బహిర్ముఖురాలివి కావమ్మ.


 అందరము అంటే,


 శూట్రత్తు-బంధువులము

 తోళిమార్-మిత్రులము


  ఏమిచేస్తువచ్చామంటే-

 ముగిల్-వణ్నన్-నీలమేఘశ్యాముని

 పేర్-పాడి-కీర్స్తు 


 ఎల్లారం వందు-అందరము వచ్చాము.


 ఎవరా బంధువులు?


  పరమాత్మ సేవాబంధమున్నవారు.


 ఏమిటా మిత్రత్వము?

 స్వామిపాదసేవా  మిత్రత్వము.


  కీర్తిస్తు వచ్చి ప్రవేశించాము.ఎక్కడికి?


 నిన్-ముట్రం-పుగుందు-నీ ఇంటి ముంగిటి లోనికి ప్రవేశించాము.


 బహిర్ముఖమును వీడి అంతర్ముఖులను చేయవమ్మా.అందులకు నీవు బహిర్ముఖురాలివి కావాలి, కాని తల్లి నీవు,


 శిత్తాదే-పేశాదే-ఉలుకకున్నావు-పలుకకున్నావు.


 నీ-నీయొక్క,

 ఉరంగు-నిద్రకు/ధ్యానమునకు,

 పొరుల్-ధ్యేయము,

 ఎట్రుక్కు-కారణము 

మాకు తెలియకున్నది.



 సెల్వన్ పెండాట్టి-ఓ భాగ్యశాలిని,


 లేచి,మాతో వ్రతమును జరిపించుటకు కదిలిరామ్మా, అంటూ,


 ఆ గోపికను తమతో కలుపుకొని వెళ్ళుచున్న గోదమ్మ చేతిని పట్టుకుని,మనము మన అడుగులను కదుపుదాము.


 ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.



 



 


 


 




 





No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...