Thursday, December 31, 2020

ALO REMBAVAY-18



  




   పద్దెమినిదవ పాశురము
   *******************
  
   ఉందు మదగళిట్రన్ ఓడాద తోళ్వలియన్
   నందగోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్

   కందం కమళుం కుళలీ కడై తిరవాయ్
   వందు ఎంగుం కోళి అళైత్తనగాణ్; మాదవి

   పందల్ మేల్ పల్కాల్ కుయిల్ ఇనంగళ్ కూవిణగాన్
   పందార్ విరలి; ఉన్ మైత్తునన్ పేర్పాడ

   శెందామరైక్కైయ్యాల్ శీరార్ వళై యెళుప్ప
   వందు తిరవాయ్ మగిందేలో రెంబావాయ్.


   గోదమ్మ ఈ పాశురములో నీలాదేవిని,నందగోపాలుని మేనకోడల!అని నర్మగర్భముగా తాము కోరినది కాదనకుండా అనుగ్రహహించమని ప్రార్థిస్తూ మేలుకొలుపుతున్నది.

  నీ మేనమామ అయిన నందప్రభువు అర్థికి లేదనకుండా అనుగ్రహించు యశోభూషితుడు.అదే పరపరను నీవును పాటిస్తున్నావన్న నమ్మకముతో నిన్ను నోమునకు తీసుకుని వెళ్ళుటకు వచ్చాము తల్లి అని తెల్లవారినదని సూచించే కొన్ని సంకేతములను వివరిస్తూనీళాదేవిని మేల్కొలుపుతున్నారు.ఇక్కడ మేల్కొలుపబడేది తల్లికి వారిపై గల అనుగ్రహము.

 తల్లీ చూడు అంటున్నది. దేనిని?

  ఎంగుం-అన్నిచోట్ల,
  కోళి-కోళ్ళు లేచి
  వందు-రమ్మని,
  అలైత్తన్-పిలుస్తున్నాయి

 దేనికి-తమ కాళ్లను సాగించి,చకచక అటు-ఇటు నడుస్తు తమకు కావలిసిన గింజలను ఏరుకుని-ముక్కున పట్తుకుని స్వీకరించమని .

 తల్లీ కణ్-అమ్మా చూడు.

  ఈ కోళ్ళు గింజలను ఎక్కడ తిరుగుతు ఏరుచున్నవి.అమ్మ నీలాదేవి భవనము దగ్గర.ఆ భవనము మణిమయము.నవరత్న తాపితము.అక్కడ వాటికి కావలిసిన ఆహారములోతో పాటుగా ఎన్నో మణులు-ముత్యములు-రత్నములు అన్ని కలగలిసి ఉన్నాయి.అవి వాటిని తమ ముక్కుతో వేరుచేస్తూ,తమకు కావలిసిన దానికై అటుఇటు కదులుతు గింజలను మాత్రమే తమ ముక్కుతో గట్టిగా పట్టుకుని స్వీకరిస్తున్నాయి.

 అమ్మ1 చూడు.

    ఇది వాచ్యార్థము.ఈ కోళ్ళు ఆచార్యులు/ఆళ్వారులు.వారికి కావలిసినది శ్రీకృష్ణానుగ్రహమనే ఆహారము.అది ఐహికములై దారిమరల్చు విషయవాసనలతో మిళితమై ఉన్నది.వారు తమ జ్ఞానమనే ముక్కులతో వాటిని మణులను-నవరత్నములను దూరముగా తోసేస్తు,తమకు కావలిసిన పరమాత్మ అనుగ్రహమనే గింజలను నిశ్చల భక్తి అనే ముక్కుతో గట్టిగా పట్టుకుని,ఆస్వాదిస్తు-ఆనందిస్తున్నారు.అందుకే వారు మేల్కాంచగానే ఒకరినొకరు సత్సంగమునకు పిలుచుకున్నారు.

  అమ్మా చూడు.మేల్కాంచు.


  అమ్మా! మేము,
 ఉన్ మైత్తునన్-నీ స్వామిని/మా స్వామినికీర్తిస్తున్నాము.


 మేము స్వామి,

 మదకళిట్రల్-మదించిన ఏనుగులను
 ఉందు-ఉత్సాహముతో-సంహరించిన
 తోల్ వళియన్-భజబలమును కీర్తిస్తున్నాము.


 నప్పినాయ్ అమ్మవారిని ముద్దుగా తమిళభాషలో పిలుచుకునే పేరు.అంటే లక్ష్మీదేవి.లక్ష్మీదేవి అంశలు మూడుగా విడివడి ఆదివరాహుని భూమాతగాను,(భూదేవి) శ్రీ రాముని సీతాదేగాను (శ్రీదేవి) శ్రీ క్రిష్ణుని నీలాదేవిగాను అనుసరించారు.నప్పిన్నాయ్ ని ఉత్తర భారతీయులు రాధా దేవిగా కొలుస్తారు. అమ్మ స్వామి ఆత్మైక స్వరూపులు.దేహములు రెండు కాని ఆత్మ ఒక్కటే.స్వామి నిదురించుట అంటే అంతర్ముఖమైనారు.

  ఓ నప్పిన్నాయ్-మా వరప్రసాదమా,నీవు

  నీ,
 క0దం-గంధము-సుగంధభరితములైన
 కమళం-సర్వము వ్యాపించుచున్న,
 కుళలీ-కేశ సౌందర్యముతో(ఉపనిషద్-పరిమళములతో)

 వలై శీరార్ ఒళిప్ప-కర కంకణ సవ్వడులతో,

 వందు తిరవాయ్-వచ్చి తలుపు తెరువు తల్లీ.

  పంచేంద్రియ పరమార్థమునందించుట ఈ పాశుర ప్రత్యేకత.పంచంద్రియ తర్పణము అని కూడ భావిస్తారు.


  గోపికల/మన నయనములు తల్లి దర్శనముతో తరించినవి.నాసిక కేశ సుగంధ పరిమళమునాస్వాదించి ధన్యమైనది.మేల్కొలిపి వాక్కు సత్కరింపబడినది.కరకంక
ణముల
 సవ్వడులు విని కర్ణము పునీతమైనది.ఇక మిగినది స్పర్శ.అందుకే నీవుతాకి తీసిన గడియను మేమును తాకి ఆశీర్వదింపబడతామంటూ,  

 స్వామి కైంకర్యమునకు అమ్మ( సిఫారసును)

 పురుషకారమును అర్థిస్తూ,  నోము చేయుటకు వెళ్ళుచున్న ఆండాళ్ అమ్మ చేతిని పట్టుకుని,మనము మన అడుగులను కదుపుదాము.

 ఆండాళ్ దివ్య తిరువడిగళే  శరణం.
 




 


 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...