Tuesday, December 8, 2020

MEEDHUSHTAMA SIVATAMA-27




 



     మీఢుష్టమ  శివతమ-27


     ****************




 చెలగి చేతలు నడత శివార్చన విధులు


 వెలిగె సర్వము హరుడె  వేరేది లేదిక.




  సాధకునికి సాంత్వన నీయాలనుకుంటున్నాడు రుద్రుడు.ఎంతైన స్వాంత కుహరుడు కదా.

మది యనె గుహలోపదిలముగా నున్నవాడు.

  

   స్తుహి శ్రుతం గర్తసదం యువానాం.


   గర్తసదం-పల్లము యైన హృదయమునందున్నవానిని,


   స్తుహి-ఓ మనసా! స్తుతింపుము.మెచ్చుకొనుము.




   




  ఏదో అడుగుటకు సంశయిస్తున్నట్లుగా పెదవులు తెరుస్తూ-మూస్తూ ఏదో అడగటానికి తటపటాయిస్తున్నటుగా,





   గమనించిన సాధకుడు నన్ను అడగటానికి ఎందుకు సంశయిస్తున్నావు అన్నాడు కథను ముందుకు పోనిస్తూ.




   అదే ఈ రోజు మైదానములో కారునడిపే పోటీలున్నాయట కద.ఎంత అల్పసంతోషి ఈ రుద్రుడు అనుకుంటూ,




  సరేలే అలాగే వెళదాం అన్నాడు సాధకుడు.




 




  చుట్టు ఆసీనులైనారు జనాలు ఆసక్తితో.


  చుట్టుకొచ్చాడు వాహనచోదకుల చిట్టాను రుద్రుడు.ఆశక్తితో.






     డెందములో అందెల సందడులు మోగిస్తూ ప్రారంభమైనది పోటి.




   పోటిలో పనిగా తన ఆటను మొదలెట్టేసాడు రుద్రుడు.





  ఏమి సైగ చేసాడో-ఎవరిని బాగుచేయదలిచాడో నల్లకారు వేగముగా పరుగెత్తకుండా శివోహం అంటున్నది

.చేసేదిలేక చూస్తున్నారు అందరు

.




   ఆట కదరా శివా- ఆట కద కేశవ




   




  కథను పట్టాలెక్కించడానికి   చిట్టా  తెరిచి డ్రైవరుపేరును చూసాడు.పక్కవాళ్ళను కూడ అడిగి పక్కా చేసుకున్నాడు.



 నమ ఉచ్చైర్ఘోషా  యాక్రందయతే పత్తీనాం పతయే నమః.


  ధ్వని స్వరూపుడు పెద్దగా ధ్వనిని చేయువాడు,


   అయిన రుద్రుడు




 




 లేచి, నిలబడి ఎగురుతూ,గట్టిగా  




   సాంబా పరుగెత్తు- సాంబా వేగముగా పరుగెత్తు కేకలేస్తూ,చేతులూపుతున్నాడు.


  




   కాని,కారు మెల్లగానే వెళుతున్నది.రుద్రుని మాటను వినలేదు.వేగమును పెంచలేదు.




    చుట్టుపక్కలవారికి అది ఎబ్బెట్టుగా తోచినట్లున్నది.




  వారు సాధకునితో కొంచము మీ పక్కనున్నాయనను నిశ్శబ్దముగా కూర్చో  పెట్టండి   అన్నారు.



   నమ ఆసీనేభ్యశ్శయానేభ్యశ్చవో నమః.


   




  సాధకుడు రుద్రునితో,రుద్రా ఏమిటి ఈ పిచ్చిచేష్టలు అంటూ   కూర్చో    పెడుతూ.నిశ్శబ్దముగా ఉండాలని సైగచేసాడు


.




  భక్తపరాధీనుడు.కాదనగలడా.



  ధ్వని-ప్రతిధ్వని రెండును తానైన రుద్రుడు 





 వెంటనే సాధకునితో గుసగుసలు మొదలుపెట్టాడు.


  నమశ్శ్రవాయచ-ప్రతిశ్శ్రవాయచ.




 ఎందుకు సాంబుడు పరుగెత్తటములేదు?

 ఎలా గెలుస్తాడు? అంటూ




  పాపం కొత్త కాబోలు తెలియక అరిచాడు అనుకుంటూ,




 కారు వేగంగా పరుగెత్తాలంటే దాని డ్రైవరు నిశ్చలంగా సీటులో కూర్చుని చక్రమును తిప్పుతుండాలి.లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి అన్నాడు తెలివిగా చెప్పాననుకుంటు సాధకుడు.




   మళ్ళీ మొదలెట్టాడు గుసగుస ,


  ఉపాగ్ ం  శుశ్చమే-అంతర్యామశ్చమ


 





 అంటే-కారు-డ్రైవరు ఒకేసారి వేగముగా పరుగులెత్తలేరా? ఎందుకు? పాపం.ఎలా గెలుస్తారు? అడిగాడు అనుమానంగా.




   ఇటు చూడు రుద్రా!

 కారు నిశ్చలముగా నున్నప్పుడు డ్రైవరు కారుదిగి పరుగులు తీయగలడు.




   డ్రైవరు తన సీటులో నిశ్చలముగా కూర్చుండి,చేతిలోని చక్రమును కదుపుతున్నప్పుడు కారు వేగముగా పరుగులెత్తగలదు.సందేహము తీరిందా అంటు రుద్రుని చూస్తుంటే మందహాసము చేస్తున్నాడు మరింత మురిపెముగా.




   రుద్రుడు ఏమి మాట్లాడుతున్నాడో-సాధకుడు ఏమి వింటున్నాడో-దేనిని కనులారా కంటున్నాడో కమనీయము.




  నిన్న చెప్పిన రెండు కన్నులు-కన్ను-కన్నులోపలి మరొక కన్ను,




  ఒకటి చలనము-మరొకటి నిశ్చలము


  ఒకటి స్థితి-మరొకటి గతి


  ఒకటి సత్తు-మరొకటి చిత్తు.....




  చక్షుసః చక్షు-అంటే,




 కన్నార కననీయరా శివా కన్నార కననీయరా


 చెన్ను మీరెడి కళల చిన్మయపు రూపము


 కమనీయమైన నీ  ఘనతేజమూ-




 పఠనము చేస్తున్నాడు కళ్ళను సాధకుడు


 ప్రకటనము చేస్తున్నాడు కరుణను రుద్రుడు.




 కదిలేవి కథలు-కదిలించేది కరుణ




అణువు అణువు శివమే-అడుగు అడుగు శివమే.




 శివానుగ్రహముతో రేపు కలుసుకుందాము.




 ఏక బిల్వం శివార్పణం.





  


  

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...