Thursday, December 10, 2020

MEEDHUSHTAMA SIVATAMA-29


 








  మీఢుష్టమ  శివతమ-29




  ***********************








  ముక్కనులను సాగరమును కానగలేను




  ముక్కాలముల గనుము మూఢుని నన్ను




  దిక్కైన సుగుణ సుగంధాభరణ




  చక్కని చంద్రుని సిగను దాల్చిన సోమ.








   రుద్రా! 








స్థూల-సూక్ష్మ-కారణ శారీరనేత్రములతో

 ఈ సంసార నిజస్వరూపమును నేను చూడలేని అసహాయుడను.








 ఎందుకని?  అని అంటావేమో








 ఎదలోని స్థాణువును ఎరుగుటయే మోక్షము,








 అన్న విషయమును నేను గ్రహించుటకు,








 అంటే ఏమిటి? సాధకా అడిగాడు రుద్రుడు.








  అంటే -సర్వము-సమస్తము గుణమయమై అదనముగా ఏది కనబడకుండా,దానికదే కనబడే ఆత్మసాక్షాత్కారము-ఆత్మసాక్షాత్కారము అంటు అర్థిస్తున్నాడు.








   అప్పుడే వారికి నలుగురు దివ్యపురుషులు








 అహమన్నం-అహమన్నం-అహమన్నం




 అహమన్నాద-అహమన్నాద-అహమన్నాద








   అనుకుంటూ అటుగా వెళుతున్నారు.వారు బాహ్యమునకు అతీతముగా బ్రహ్మమును శోధించుచు-సాధించుటకు-సమగ్రమగుటకు సాగుతున్నారు.








   సాధకా! అర్థమగుతున్నదా? వారు ఏమంటున్నారో?








   అన్నము నేనే అంటున్నారు.అన్నము తినేవాడను నేనే అంటున్నారు.








   ఆశ్చర్యముగా ఉంది రుద్రా.




 అన్నము వారైతే అన్నముతినేవారెలా అవుతారు? అన్నము తినేవారయితే  అన్నము ఎలా అవుతారు? పరస్పర విరుధ్ధములు వారి వాక్కులు అని అంటుంటే,








 ఆశీర్వదిస్తు,









  రుద్రుడు బ్రహ్మము గురించి చమత్కారముగా చెప్పసాగాడు.












  భూతంచమే-భవిష్యంచమే.






   ముందు ఉన్నది-ఇప్పుడుఉన్నది-ఉండబోవునది తానేయైన రుద్రుడు సాధకునితో చమత్కారముగా ఒక చక్కని విషయమును వివరిస్తున్నాడు.









  ఒక నిశ్చల ప్రదేశమునుండి మరొక నిశ్చల ప్రదేశమునకు చేరుటకు ఒక రైలు ఇంజను ఇంధనమును సిధ్ధము చేసుకుంటున్నది. తన అవయముల సామర్థ్యమును పరీక్షించుకొనుచున్నది.








  దాని కన్నుకు ఒక్కటే తెలుసు.అదేమిటంటే ఒక మాస్టారు చేతిలోని ఆకుపచ్చని కేతనపు కదలికలను గమనించి తాను కదలటము.








 కేతనమును చూడగానే కదులుటకు అది తనను తాను సిధ్ధపరచుకుంటుంది కాని ప్రారంభించదు.అది దాని ప్రకృతి నియమము.








   ఇంతలో కొన్ని బోగీలను చేర్చుతున్నారు ఇంజనుకు.కొన్ని మనుషులతో-మరి కొన్ని సామాగ్రితో ఉన్నాయి.ఒకటితో మరొకటి-మరొకటితో ఇంకొకటి-ఇంకొకటితో అనుసంధిస్తున్నారు.కదలకుండా గట్టిగానే ముడిపెడుతున్నారు.విడివడకుండా

 ఉన్నాయా అని పరీక్షించారు.ఉన్నాయని తలపంకించారు.









  ఆశ్చర్యముగా చూస్తున్నాడు సాధకుడు.నిశ్చలముగా చెబుతున్నాడు రుద్రుడు.








   ఆ ఇంజనే మనము.ఆ కదలికయే మన జీవనము.దానికి సంకేతమే మాస్టారు చేతిలో ఊగే ఆకుపచ్చని కేతనము.








 మన ఉనికి ఇప్పుడు ఉన్నది ముందు కూడా ఉంటుంది.కాని ఒకేరూపములో కాదు.








   రైలు చక చక నడుస్తోంది.దారిలో ఎన్నో దృశ్యాలు.








   కొండలు-వనములు-నదులు-జనములు-భవనములు అవి మనలను దాటుతున్నాయో-మనము వాటిని దాటుతున్నామో గమ్మత్తుగా ఉంది.








  దానికి మాస్టారు చేతిలోని ఎర్రజెండా ఊగటము కనపడిందేమో ఒక కూడలి దగ్గర కొంచముసేపు ఆగింది.( స్వల్పకాలిక  లయము).అదే నిద్ర.








  ఎవరో వచ్చారు.దాని వెనుక నున్న కొన్ని బోగీలను ఇంజను నుండి విడిపించారు. అదియే స్థూల శరీరము.

              కొంచము బరువు తగ్గింది దానికి.









   మళ్ళీ ఆకుపచ్చ జెండా కదిలినట్లుంది.రైలు తన గమనాన్ని ప్రారంభించింది.చుట్టూ తలుపులు-కిటికీలు మూసేసి ఉన్నాయి.ఇందాక చూసిన దృశ్యములు ఇప్పుడు కనిపించటం లేదు.








  వాళ్ళే ఏదో విడియో




 పెట్టారు.చూడమన్నారు.చూస్తోంది రైలు నిస్సహయాముగా.ఆపుదామంటే రెమోటు  లేదు.అదే ఆ రోజు వారు ముచ్చటించుకొనిన స్వప్నము.చూస్తున్నది సూక్ష్మ శరీరము.దాని పని అయినదేమో  ఆగిపోయినది.


సంకేతానుసారముగా అక్కడ కొంచము సేపు ఆగినది.








  దానిచూపు ఆకుపచ్చ-ఎర్రని రంగుల కేతనము మీదనే.అది నిశ్చలముగా ఉండా/కదులుతోందా అన్న వాటి స్థితి-గతులమీదనే.









   ఎవరో వచ్చి మరికొన్ని బోగీలను తొలగించివేసారు.(సూక్ష్మ శరీరమును) 

 

    

 మరింత తేలికపడింది రైలు-దాని ఇంజను.








   ఇంకొక రెండు చోట్ల మాత్రమే అది ఆగవలసినది.తరువాత గమనముతో పనిలేదు.అవియే సుషుప్తి-సమాధి అనేఅవస్థలు.








    అప్పుడు ఆకుపచ్చ జెండాను ఊపుతున్న మాస్టారు ఇంజనును ఆకుపచ్చ బట్ట ముక్కను చేసి తన జెండాలో ఆ ముక్కను కలిపేసి, ఆ జెండాను ముడిచేసి తాను లోపలికి వెళ్ళిపోతాడు.అప్పుడక్కడ రైలు-ఇంజను-మాస్టారు-చేతిలోని జెండా ఏవి ఉండవు.గుణము సంపూర్ణముగా

 వ్యాపించి విశేషమును,

 తనలో గుప్తము చేసుకుంటుంది.



  ఒక్క లిప్తమాత్రము నిశ్శబ్దము.అర్థముచేసుకొనుటకు ప్రయత్నిస్తున్నాడు సాధకుడు.అనుగ్రహముతో వానిని ముంచేస్తున్నాడు రుద్రుడు.


 వెంటనే,









    ఆ రెండు కూడలుల గురించి తెలియాలంటే? ప్రశ్నిస్తున్నాడు


 సాధకుడు.








   సాధన చేయాలి-ప్రయత్నము చేయాలి-యజ్ఞము చేయాలి అనే రుద్రుని మాటలను








 ముద్రించుకుంటున్నాడు మదిలో సాధకుడు




 ఉద్యుక్తుని చేస్తున్నాడు సాధకుని రుద్రుడు.









 కదిలేవి కథలు-కదిలించేది కరుణ








 అణువు అణువు శివమే-అడుగు అడుగు శివమే








  శివానుగ్రహముతో రేపు కలుసుకుందాము.








   ఏక బిల్వం  శివార్పణం








 








      








 




      






 




      




 


      


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...