ALO REMBAVAY-24



 




  ఇరువది నాలుగవ పాశురం
   *************************
 అన్రు ఇవ్వులగం అళందాయ్ !అడిపోట్రి
 శెన్రంగు త్తెన్నిలింగై శెట్రాయ్! తిరల్ పోట్రి

 పొన్ర చ్చగడం ఉదైత్తాయ్! పుగళ్ పోట్రి
 కన్రు కుణిలా ఎరిందాయ్! కళల్ పోట్రి

 కున్రు కుడైయా ఎడుత్తాయ్! గుణం పోట్రి
 వెన్రు పగై కెడుక్కుం నిన్ కైయల్ వేల్ పోట్రి

 ఎన్రెన్రు  ఉన్ శేవగమే ఏ తిప్పరై కొళివాన్
 ఇన్రుయాం వందోం ఇరంగేలోరెంబావాయ్.



  

  అమందానంద సందోహాయ నమః
  **************************

   అవధులు లేని అనురాగము వాస్తవికతను మరుగున పడేస్తుంది.అన్నీ తామే-స్వామికి అని అనిపించేటట్లు చేస్తుంది.ఆశీర్వదించమంటుంది.హారతులను ఇప్పిస్తుంది.దిష్టి తీసేటట్లు చేస్తుంది.అర్థించుట మరిపిస్తుంది.ఆర్ద్రతతో ముంచేస్తుంది.అదే స్థితిలో నుండేటట్లు గోపికలను చేసాడు ఆ గోవిందుడు.వానికి,

 జయమంగళం-నిత్య శుభమంగళం.



   కిందటి పాశురములో చెప్పుకున్నట్లు గోపికలను ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తు పరమాత్మకు దగ్గరగాచేర్చుచున్నది గోదమ్మ.స్వామియును తానొక్కొక్క మెట్టు దిగుతు వచ్చి వారిని చేరదీసుకుంటున్నాడు.ఎంతటి సుందరము సుమధురము ఆ సన్నివేశము.

   స్వామి తమకై దిగివస్తున్నప్పుడు వారికి ప్రధమముగా స్వామి పాదారవిందములు దర్శనమిచ్చాయి.అవి కెందామరలవలె ప్రకాశిస్తున్నాయి.మన గోపికలకు మాత్రము అవి ఎర్రగ కందిఉన్నట్లుగ కనపడునట్లు చేస్తున్నది వారికి స్వామిపై గల వాత్సల్యము.ఖిన్నవదనములతో వారు అవును మరి త్రివిక్రముడై,ఎత్తు-పల్లాలతో,రాళ్ళు-రప్పలతో కఠినముగా నున్న భూమిపై పాదమును మోపి,కొలుచుటచేకందినది.కాని ఇంతవరకు ఆ విషయమును ఎవరును-కనీసము ఇంద్రుడైనను గమనించలేదు అనుకొని,ఆ దివ్య చరణారవిందములకు,

 " అన్రి ఇవ్వులగం అళిందాయ్ అడి పోట్రి " అని కీర్తిస్తు స్వామి పాదధూళి ప్రసాదమును పొందగలిగారు.

   ఇంకొక మెట్టు ఎక్కారేమో తమకై స్వామి చేతి చాచి అందిస్తుండగా వారికి స్వామి తోళ్వళి-విశాలభుజములు దర్శనమిచ్చాయి.అవును అజ్ఞానమయమైన లంకలోనికి ప్రవేశించి,రావణుని సమ్హరించి,తిరిగి అక్కడ వెలుగులు పంచిన స్వామి,

 "శెన్రంగు తెన్నిలింగై శెత్తాయ్! తిరల్ పోట్రి" అని ,

 దశకంఠునిపరిమార్చిన దాశరథి,నీకు

 జయమంగళం-నిత్యశుభమంగలం.


 భూజబలమును కీర్తిస్తూ పరాక్రమ ప్రాభవమును ఆస్వాదించగలిగారు.

  ఇంతలో వెనుకనున్న గోపికలు ముందుకు వచ్చి మమ్ములను స్వామి పాదములను దర్శించనీయండి అని ముందుకు వచ్చారు.ముసిముసి నవ్వులతో వారికి స్వామి తాను శకటాసుర-వృతాసుర సమ్హారమునకై వంచిన తన పాదపు విరుపును అనుగ్రహించాడు దర్శనముకై.

 పులకించిన మనస్సులతో వారు,

 'పొన్నర్చగడం ఉడైత్తాయ్! పుగళ్ పోట్రి" 

   పరాక్రమమును ముందరి గోపికలు వర్ణిస్తే,పరాక్రమము ద్వారా లభించిన కీర్తిని వీరు మూర్తిమంతము చేసి ఆశీర్వదించారు.

 శకట-వృత సంహారునికి శతమాన మంగళం.



 ఇంకొక మెట్టు పైకి ఎక్కుతున్నారేమో,

 మరికొందరు వీరిని కొంచము జరుగమని ముందుకు వచ్చి అదియేకాదు,స్వామి పాదపు వంపును మేము వెనుక నుండి దర్శిస్తున్నాము.మీరును చూడండి, అంటు 

 " కన్రు కుణిలం ఎరిందాయ్! కళల్ పోట్రి"

 అంటు,వత్సాసురుని విసిరినప్పుడు ఉన్న నీ పాదభంగిమకు మంగళమని" వాత్సల్యముతో ప్రస్తుతిస్తున్నారు.


 అందిస్తున్నాడు స్వామి తన చేతిని గోపికలు.అంతలో స్వామి చేతి చిటికెనవేలు,చిటెకలో గుర్తుచేసింది వారికి అప్పటి ఇంద్రుని రాళ్ళవాన-గోవర్ధనగిరికి వారుచేయుచున్న పూజ,దానికి సంరక్షకునిగా గోవిందుని పర్యవేక్షణ తెరలుతెరలుగా కదులుతున్నాయి వారి మనోఫలకముపై.బరువైన హృదయములతో స్వామి మాకొరకు గొడుగై,గోవర్ధనమును గొడుగు చేసి నీ చిటికిన వేలుపై నిలబెట్టి మములను రక్షించిన నీ చిన్నివేలెంత కందెనో.ఇన్నిరోజులు మేమా విషయమును గమనించలేదంటు,
  గోవర్ధనగిరినెత్తిన వేలికి గోపిల మంగలం.

 " కున్రు కుడయాయ్ ఎడుందాయ్ గుణం పోట్రి" అంటు స్వామి దివ్యగుణవైభవములో స్నానమాడుతు,మైమరచియున్నవేళ ,

   వారికి,స్వామి శంఖ-చక్ర-గదా ధరుడైన నారాయణుడు భుజమున ఆయుధమును దాల్చి భజింపబడినాడేమో,దానిని తాను వారికి ప్రకటింపచేసి-ప్రస్తుతులనందింపచేసినాడు..

  

 స్వామి నీ పరాక్రమము-దాని ప్రకాశము ఎప్పుడు చూసిన-ఎక్కడ చూసిన ప్రతిఫలిస్తూనే ఉంది.మేమెన్ని చెప్పగలము.నిన్నేమని కీర్తించగలము అని వారంటుంటే,

వామనుడై-శ్రీరాముడై-యాదవుడై అన్నీ తానై అవధరిస్తున్నాడుస్వామిఆనందాతిరేకముతో.

    అనుభవిస్తున్నాము మనము అదృష్టముగా.
   అంతలో స్వామి వాత్సల్యముతో,




అయ్యో పిల్లలు అసలు వచ్చిన విషయమునే మరచి అంతగా ఆరాధిస్తు-ఆశీర్వదిస్తున్నారు.గుర్తుచేద్దాము వారికి వారు వచ్చిన పనిని అని అనుకున్నట్టున్నాడు -గోపికలు బహిర్ముఖులై స్వామి ,


 ఇరంగుక్కు-కరుణతో,
 పరై కొల్వాన్-పరమాత్మ నిన్ను సేవించు భాగ్యమును కల్పించుటకు,పఱ అను పూజా విసేషమును అందించండి.


 రెంబావాయ్-వ్రతమునకు ఏల్-రండి.
    అని ఆహ్వానిస్తున్నరు.

     ఆరుసార్లు చేయు మంగళా శాసన విశిష్టత ఏమిటి? .అమృతధారలుగా అరుదైన విషయములు అనుసరించినవి.ఆరు ఋతువులందును,ఆరు రుచుల యందును,ఆరు శత్రువుల యందును,ఆరు విషయములందును ( పంచేంద్రియములు+మనసు) ఆరు పోయుట యందును (వారు పోయుట)స్వామి ఆరు రంగనాథ క్షేత్రములందును( ఆద్య రంగము-పరిమళ రంగము-వట రంగము-సారంగము-అప్పలి రంగము-అంతరంగము) ఆనందమయముగా నుండుటకు గోపికలు మంగళమును పాడిరి.అవన్నీ పరమాత్మ రూపాలే.పరమానంద ప్రదములే. .

  రెంబావాయ్-వ్రతమునకు ఏల్-రండి.
    అని ఆహ్వానిస్తున్నారు.












  ఆహ్వానించుచున్న గోపికలతో నున్న గోదమ్మ చేతిని పట్టుకుని,మనము స్వామిని సిరినోమునకు ఆహ్వానిద్దాము.

 ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం.






"


 


"


 

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)