Monday, February 8, 2021

TIRUVEMBAVAY-01

తిరువెంబాయ్-01
************
ఆదియుం అందముం ఇల్లారుం పెరుం
శోదియై యాం పాడ కేట్టేయుం వాల్ తడంగళ్
మాదే వళరుదియో వన్సెవియో నిన్ చెవిదాన్
మాదేవన్ వార్కళంగళ్ వాళ్తియ వాళ్తోళి
పోయ్
వీధివాయ్ కేట్టలుమే విమ్మి విమ్మి మెయ్ మరందు
పోదార్ అమళి ఇమ్మేల్ పురండింగన్
ఏదేను మాగాళ్ కిడందాన్ ఎన్నే ఎన్నే
ఈదే ఎంతోళి పరిశేలోరెంబావాయ్.
ఓం పరంజ్యోతియే పోట్రి
********************
మాదే- ఓ అద్భుత సౌందర్యరాశి,
ఓ సఖి,
యాం-మన చెలులందరును,
మహదేవుని మహిమలను,
ఆదియుం-ప్రారంభము,
అంతయుం-ముగింపు,
ఇల్ల-లేని,
అరుం-అద్భుతమైన,
పెరుం-పెద్దదైన,
శోది-జ్యోతిగా,
బృహత్ జ్తోతిగా,
పాడ-సంకీర్తిస్తున్నారు,ఎక్కడ?
వీధి- వీధిలో నుండి, ఎంతటి ధన్యులో!
ఎందుకంటావా?
వాయ్ తడంగళ్-వాక్కు వరముగా మారినది వారికి, ఎందువలన అని అనుకుంటావేమో? అది
మాదేవున్ అళరుదియో-మహదేవుని ఆశీర్వదాము చేయుచున్న అద్భుతమది.
నీవు దానిని వన్శెవియో-వినగలేకయున్నావు/పెడచెవిని పెట్టకు,
లేక పాపము నీవు
చెవిదాన్-చెవిటిదానవా?
ఆ సంకీర్తనము ఎంత అద్భుతమైన అర్ద్రతను కలిగించుచున్నదంటే,
దానిని వింటున్న మన చెలి ఒకతె,
విమ్మివిమ్మి-వెక్కి వెక్కి ఏడుస్తూ,ఆనందానుభూతికి అంతర్ముఖియై,
మెయ్ మరందు-తనను తాను మరచి,
నేలసోలినది.భక్తిపారవశ్యముతో స్వామి అనుభవములో నున్న ఆమెకు అదిపూలసజ్జను మించిన అనుభూతిని అందిస్తున్నది.
అంతేకాదు వారు స్వామి ప్రాభవమును,
ఏదేన్-ఏమని చెప్పగలము? దేనిని?
ఆగాళ్- స్వామి ఏకాలము నుండి యున్నాడని,
కిడందాన్-ఎంత ప్రదేశము విస్తరించి యున్నాడని?
స్వామి సర్వకాల-సర్వవ్యాపకత్వమును సంకీర్తిస్తున్నారు.
ఓ చెలి నీవు మేల్కా0చి,బహిర్ముఖురాలివై మాతో కలిసి శివనోమునకు కదిలి రావమ్మా.
తిరు అన్నామలయై అరుళ ఇది.
అంబే శివే తిరువడిగలే పోట్రి.
సాక్షాత్ శివస్వరూపమైన మాణిక్యవాచగర్,
ఈ పాశురమును స్వామి అగ్నిస్తంభ ఆవిష్కార సంకీర్తనముతో ఆరంభించారు.పడుచుపిల్లలు పవిత్ర తిరుమాసములో పరమేశ్వర సంకల్పితులై,పాశుర వ్రతమును ప్రారంభించారు.సత్చింతనా మయులైనారు.సంస్కార సంకీర్తనాంతరంగులైనారు.సాటి వారిని కలుపుకుంటున్నారు.సాధనను చేయిస్తున్నారు.సదాశివ సాంగత్య సాఫల్యతాసక్తులను చేస్తున్నారు.వారు తమతో వచ్చేదాక సహనమును చూపిస్తున్నారు.
ఓ చెలి శివనోము నోచుకొనుటకు మన చెలులందరును అద్భుత బృహద్జోతిగా మహేశుని ఆశీర్వచన అనుగ్రహముగా స్వామి అగ్నిస్తంభ ఆవిష్కారమును అత్యంత అద్భుతముగా సంకీర్తిస్తూ వస్తున్నారు.నీకు ఆ మధుర మహిమలు వినబడుటలేదా ఇంకా మేల్కాంచుటలేదు.అదిగో మన చెలి ఆ మహదేవుని అనుగ్రహ వృత్తా0తమ్ను వింటు వెక్కి వెక్కి ఏడుస్తూ ఆనందానుభూతిలోవీక్కి వెక్కి ఏడుస్తూ తనను తాను మరచి పరవశించుచున్నది.
పోదారమళిన పోల్
స్వామి కాలమును-విస్తరణను ఇది అని నిశ్చయముగా నిర్ణయించుట సాధ్యము కాదు అంటుకదిలి వస్తున్నారు. నీవును మేల్కాంచి/బహిర్ముఖివై శివనోమునకు కదిలి రావమ్మా.
తిరు అన్నామలయై అరుళ ఇది.
తిరు అన్నామలయై అరుళ ఇది.
అంబేశివే తిరువడిగళే పోట్రి.
నండ్రి. వణక్కం.
5 మంది వ్యక్తులు చిత్రం కావచ్చు
16
1 భాగస్వామ్యం
నచ్చింది
వ్యాఖ్య
భాగస్వామ్యం చేయి


 

















  సాక్షాత్ శివస్వరూపమైన మాణిక్యవాచగర్,

 ఈ పాశురమును స్వామి అగ్నిస్తంభ ఆవిష్కార సంకీర్తనముతో ఆరంభించారు.పడుచుపిల్లలు పవిత్ర తిరుమాసములో పరమేశ్వర సంకల్పితులై,పాశుర వ్రతమును ప్రారంభించారు.సత్చింతనా మయులైనారు.సంస్కార సంకీర్తనాంతరంగులైనారు.సాటి వారిని కలుపుకుంటున్నారు.సాధనను చేయిస్తున్నారు.సదాశివ సాంగత్య సాఫల్యతాసక్తులను చేస్తున్నారు.వారు తమతో వచ్చేదాక సహనమును చూపిస్తున్నారు.

 

  ఓ చెలి శివనోము నోచుకొనుటకు మన చెలులందరును అద్భుత బృహద్జోతిగా మహేశుని ఆశీర్వచన అనుగ్రహముగా స్వామి అగ్నిస్తంభ ఆవిష్కారమును అత్యంత అద్భుతముగా సంకీర్తిస్తూ వస్తున్నారు.నీకు ఆ మధుర మహిమలు వినబడుటలేదా ఇంకా మేల్కాంచుటలేదు.అదిగో మన చెలి ఆ మహదేవుని అనుగ్రహ వృత్తాతమ్ను వింటు వెక్కి వెక్కి ఏడుస్తూ ఆనందానుభూతిలోవీక్కి వెక్కి ఏడుస్తూ తనను తాను మరచి పరవశించుచున్నది.
 
 స్వామి కాలమును-విస్తరణను ఇది అని నిశ్చయముగా నిర్ణయించుట సాధ్యము కాదు అంటుకదిలి వస్తున్నారు. నీవును మేల్కాంచి/బహిర్ముఖివై శివనోమునకు కదిలి రావమ్మా.

 అంబే శివ దివ్య వడిగళే శరణం.
 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...