Wednesday, February 10, 2021

TIRUVEMBAVAY-05


 తిరువెంబాయ్-005

  ***************

 మాలరియ నాం ముగనుం కాణా మలైనాం నాం
 పోలారివోం ఎన్రుళ్ళ పొక్కంగళే పేశుం

 పాలూరు తేన్వాయ్ పడిరీ కడై తిరవాయ్
 న్యాలామే విణ్ణె పిరవే అరివరియాన్

 కోలముం నమ్మైయాట్ కొండరుళి కోడాట్టు
 శీలం పాడి శివనే శివనే ఎన్రు

 ఓలం ఇడినుం ఉడరాయ్ ఉడరాయ్ కాణ్
 ఏలా కుళలి పరిశేలో రెంబావాయ్.


 

 ఓం అరుణాచలయే పోట్రి
 **********************

  మలయినాం-ఈ అరుణాచల పరవతమును గురించికాని,
   అరుణాచలేశుని గురించికాని
 
  తెలిసికొనుట,
 క్పెలముం నమ్మై-రూపవైభవమును కాని,
 కొండరుళ-కోలవలేనత దయను కాని

 పిరవి-తిరిగి తిరిగి ప్రయత్నించినను,
 
అరివరియాన్-దేవతా సమూహములకు సాధ్యపడలేదు.

 అంతేకాదు,
న్యాలమే-అంతరిక్షమునకు అర్థముకాలేదు.

 బ్రహ్మాదులకును అంతుచిక్కలేదు.

 అటువంటి పరబ్రహ్మమైన పర్వతము గురించి మనకు (నీకు తెలుసునని)

 పాలూర్-తేన్వాయ్ పడరీ-మధురమధుర మైన మాటలతో మమ్ములనునమ్మించినావు.నీవు
మాలరియా-మోసగత్తెవి.నీ మాటలను మేము విశ్వసించము.
 చూడు ఎందరో మహానుభావులు,

తమకు స్వామి అనుగ్రహించిన జ్ఞానముతో పరవశులై శివనే-శివనే అని జపించుచు పరవశించుచున్నారు.

 అద్భుతకేశ సంపద కలదానా మేల్కాంచి శివ నోమునకు మాతో కలిసి రమ్ము.
ఎన్రుళ్లం-మన మనసులు అర్ద్రతతో నిండి ఆహ్లాదము చెందునట్లు శివనామమును కీర్తిద్దాము.

  అంబే శివే తిరువడిగళే శరణం.


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...