Sunday, March 14, 2021

tiruvembavay-11

 


తిరువెంబావాయ్-11

 *****************


 ముయ్యార్ తడం పొయిగై పుక్కు ముగేరెన్న

 కయ్యార్ కుడైందు కుడైందు ఉన్ కళల్పాడి


 అయ్యా వళియడియోం వాల్దోంకణ్ ఆరళల్పోర్

 శయ్యా వెణ్ణిరాడి శెల్వ శిరుమరుంగుల్


 మయ్యార్ తడంకన్ మడందై మణవాలా

 మయ్యా నీలాడ్ కుండేర్ అరులం విడయాట్రిన్


ఉయ్యార్కల్ ఉయ్యాం వగయెల్లాం ఉయందోళిందోం

ఎయ్యామల్ కాప్పై ఎమై ఏలోరెంబావాయ్.

  

  అవ్యాజ కరుణామూర్తియే పోట్రి

   **********************

  తిరు మాణిక్యవాచగరు మనకు ఈ పాశురములో కోనేటి తీర్థమును గురించి,దానిలో చేయు పుణ్యస్నాన ఫలితములను గురించిస్వామిని సంకీర్తిస్తూనే మనకు వివరిస్తున్నారు.


 పడుచులందరు కోనేటి దగ్గరకు వచ్చారు.


 దైవత్వము జలమును అనుగ్రహించ్నపుడు తీర్థముగా పునీతము అగుతుంది.తనలో మునిగిన వారి కల్మషములను భౌతికముగా మానసికముగా నున్న వాటిని పూర్తిగా తొలిగించివేస్తుంది.ఇది కాదనలేని సత్యము.



 ఇంకొక విషయము ఈ తిరునీరు ఒక్కొక్క సారి పన్నీరై,స్వామి అభిషేక జలమై కొంచము మనపై చిలకరింపబడుతు మనలను ఆశీర్వదిస్తుంది.

 కాని పరమహంసలైన పడుచులు ఈ కొలనులో పూర్తిగా మునిగి,దాని అనుగ్రహమును రెండుచేతులు చాచి స్వీకరిస్తూ,జలరూపములో వారికి అడ్డువచ్చుచున్న మోహములను పక్కకు తోస్తూ కేరింతలు కొడుతూ ,మడందై-మణవాలా-

 ఆ జలమును తాకిన మహోత్సాహముతో మహాభాగ్యవంతులగుదామని వచ్చారు.


 "ఎంతటి మహోత్కృష్తము ఆ మడుగు?

  ఎంతటి అద్భుతము ఆ కొలను?

 ఎంతటి అనుగ్రహప్రదాయిని ఆ కోనేరు!"


 ఇంతా అంతా అని మాటలలో చెప్పలేనిది.అనుభవించవలసినదే తప్ప ఆవిష్కరించలేనిది.


 ఎందుకంటే అది కేవలము కోనేరు కాదు.

  అది,శయ్య-సదాశివుని,

 ఆట్కొండరుళం-అనేకరూప అనుగ్రహము.

 అనుగ్రహము కాదు కాదు-అది సాక్షాత్తు సదాశివమే.


 ఏ విధముగా అని అంటారా?

  ఎగిసి పడుతున్న తెల్లని జలములు మనకు ఏ విధముగా దర్శనమిస్తున్నాయంటే,

 వెణ్-నీర్-ఆడై-మన స్వామి సంతృప్తిగా భస్మాభిషిక్తుడైనట్లు మీకు దర్శనమగుటలేదా? అందులో సందేహము లేదు.అది సాక్షాత్తు స్వామియే.


 చెలులారా! రండి.మనము కూడా

ముయ్యార్ తడం పుక్కు-హ్రీంకారమును నినదించుచున్న మడుగు లోనికి,స్వామి మనసులోనికి ప్రవేశిద్దాము.

 స్వామి దర్శనముతో-అనుగ్రహ స్పర్శనముతో మన చేతులను చాచి,కయ్యాయ్ కుడైందుపూర్తిగా స్వీకరిస్తూ,కేరింతలు కొడుతు పరవశిద్దాము.

 తెల్లని స్వచ్చమైన వెణ్ణీర్ మన కేరింతలకు సుడులు-సుడులుగా వలయములుగా తిరుగుతు పరవశిస్తున్నది చూడు చెలి! అని ఒక పడుచు అనగానే మిగిలిన వారంతా ఆ సుడులు మనలను అనుగ్రహిస్తున్న స్వామిపాదపద్మములు అన్నారు.

 ఇంతలో ఒక చెలి మిగిలిన వారితో అవి నాకు స్వామిని సేవించుకొనుచున్న నయనర్లవలె ద్యోతకమగుచున్నవి.సరిగా చూడండి అన్నది.

  వేరొక చెలి అవునా కాని ఆ సుడుల వలె నున్న స్వామి పాదపద్మములు నాకు బాగా తెలుసు వాటి గురించి.

వళి అడియో-వాల్దోంకణ్-

 అవి మన పూర్వీకుల నుండి మన వరకు స్వామిని సేవించుచున్న వంశ పరంపరలుగా కనిపిస్తున్నవి అని అన్నది.


 వీరి మాటలకు ఏ మాత్రము బదులివ్వక,తనలో తాను తన్మయత్వములో మునిగిన చెలిని కాంచి,వారందరు చెలి !

  నీకు మన స్వామి వళిఆడిగళ్-వళులుగా తిరుచున్న స్వామి పాదపద్మములు ఏ విధముగా స్పురిస్తున్నవి అనగానే ఆ చెలి మీ అందరి భావన సమంజసమే.

 స్వామి దయతో నా భావనలో అవి నేను అనబడే ఈ జీవి జన్మజన్మలుగా చేయుచున్న స్వామి సంసేవనమా/లేక పొందిన స్వామి అనుగ్రహమా అన్నట్లు ఆనందపరుస్తున్నవి అనగానే స్వామి అనుగ్రహము బహుముఖములు-భావనాతీతములు కనుక మనమెల్ల ,భగవత్ గుణసంకీర్తనమనే మడుగులో మునిగి సాంత్వనను పొందుదాము అనుకున్నారు.


 తిరు అన్నామలయై అరుళ ఇది

 అంబే శివే తిరువడిగళే పోట్రి.

 నండ్రి.వణక్కం.




  




No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...