Thursday, March 4, 2021

tiruvembavay-18


 
  తిరువెంబావాయ్-18
  ******************

 అన్నామలైయన్ అడిక్కమలం శెన్రి ఇరంజు
 విణ్ణోర్ ముడియన్ మణిత్తోకై విరట్రార్పోల్

 కణ్ణార్ ఇరవై కదిర్వందు కార్కరప్పన్
 తణ్ణార్ ఒళి మళింగి తారకైకర్ తామకల

 పెణ్ణాయ్ ఆణాయ్ అళియుం పిరన్ గొళిచేర్
 విణ్ణాణి మణ్ణాణి ఇత్తనయం వేరాగి

 కణ్ణార్ అముదమాయ్ నిన్రన్ కళల్పాడి
 పిణ్ణే ఇంపుం పూంపునల్ పాయిందు ఆడేలో రెంబావాయ్

  సర్వాత్మా-సర్వరూపా పోట్రి
  *************************


 పిణ్ణే- ఓ పిల్లా,
ఇం పూపునల్ పాయింద్- ఫద్మములతో నిండిన ఈ మడుగు లోనికి ప్రవేశించి,
 ఆడేలో రెంబావాయ్-క్రీడిద్దాము కేరింతలతో.

 ఎందుకంటే ఈ మడుగు సాక్షాత్తు మన స్వామియే.

 అన్నామలైయన్ అడికమలం- అన్నామలేశుని పవిత్రపాదములవిగో.చూడు వాటి ప్రకాశము.అవి దేవతల కిరీటములందున్న మణుల కాంతులను-సూర్య కిరనముల తేజస్సును,తారకల ప్రకాశమును,వెన్నెలలను నిర్వీర్యము చేయుచు నెనరులతో ప్రకాశించుచున్నది.

 స్వామికి పాదనమస్కారమును చేయుటకై వారు తలను వంచినపుడు  వారు ధరించిన కిరీటములలోని మణులు కాంతిహీనములుగా నున్నవి.గమనించితివా?

 విణ్ణోర్-దేవతల-
ముడివన్-ధరించిన
 మణిత్తోకై-మణుల ప్రకాసము
 వీర్ అట్రార్ పోలె-కాంతిహీనముగా నున్నది.
 చెలి చూడు,
 కణ్ణార్-సూర్యుని కదిర్ వందు-కాంతి రేఖలు విస్తరించుచున్నను,
స్వామి పాదకాంతి ముందు
 వెలవెల బోవు చున్నవి.
 అంతేకాదు,
తణ్ణార్-చంద్రుడు కూడ,
ఒరు మళింగి-కాంతిని తప్పుచున్నాడు.
తారకైకర్-నక్షత్రములు సైతము 
 తామకల-వెలవెలబోవుచున్నవి.

 స్వామి ప్రకాశము దేనితో పోల్చలేము చెలి .

 చెలి స్వామి ప్రకాశమును మాత్రమే కాదు ప్రకటనమును కూడ నిశ్చయముగా ఇది యని చెప్పలేనిది.
 స్వామి మన కొరకు ఒకసారి,
పెణ్ణాయ్-స్త్రీమూర్తిగను,
ఆణాయ్-పురుషాకృతిగాను,
అళియుం-వేరే రూపములుగను ప్రకటితమగుచుంటాడు.

 కాదనుకుంటే గుప్తముగాను ఉంటాడు.
 అంతే కాదు ఒక్కొక్కసారి,
విణ్ణాణి-ఆకాశముగను,
మణ్ణాణి-భూ తత్త్వముగను,
ఇత్తనియుం-వీటన్నిటికంటె,
 వేరాణి-విరుధ్ధరూపముగను తనను తాను ప్రకటించుకుంటాడు.
ఈ కొలనులో స్వామి దర్శనము మన,
కణ్ణార్-కన్నులకు,
అముదమాయ్-ఆంర్తోత్సవము.
కనుక చెలులారా స్వామి గుణగణ విశేషములనే మడుగులో మునిగి కేరింతలు కొడదాము రండి.

 అంబే శివే తిరువడిగళే శరణం.


 ఏ రూపమునకు నిర్దిష్టము కాని స్వామి(అరూపి) మనకోసము స్త్రీమూర్తిగా/పురుషోత్తమునిగా,పంచభూతములుగా లీలగా ప్రకటింపబడుతు ప్రకాశించుచున్నాడు.స్వామి పాదపద్మముల ప్రకాశము ముందు నమస్కరించుటకు వంగిన దేవతల శిరోభూషణములనందున్న మణులు వెలవెలబోతున్నాయి.అతి ప్రకాసవంతమైన సూర్యకిరనములు సైతము చిన్నబోతున్నవి.మన నయనములనే తుమ్మెదలు విడువలేని మధురమకరందమును కలిగినవి స్వామి పాదపద్మములు.వాతిని సేవించి-తరించుదాము.

 ప్రధమ పాశురములో ఆదియును-అంతమును లేని స్వామి బహురూపములతో బహుముఖములుగా ఈ పాశురములో భాసించుచున్నాడు.రండి దర్శించి-ధన్యులమగుదాము.

 అంబే శివే తిరువడిగళే శరణం. 
 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...