Wednesday, April 21, 2021

DHYAAYAET IPSITA SIDHDHAYAET-01

 ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్

 ********************

  హోరెత్తిన సముద్రపు అలలవలె అరసెకను ఆగకుండ నాలో ఆలోచనలు జోరుమీద ఉన్నాయి.మనసును జారకున్నాయి.

   ఎంత విచిత్రము ఈ మానవ ఉపాధి.నిత్య నిరంతర సంఘర్షణలతో  దొరకని స్థిమితమనే దరిచేరుకోవాలని ఉబలాటపడుతుంది.

 చిన్ని బుడగ తల్లిగర్భములో ఎన్నో సంఘర్షనలను ఎదుర్కుంటు ఒక ఉపాధిని సంతరించుకొని,ఒక్క ఏడుపును మాత్రమే తనతో వెంటబెట్టుకుని ,చంటి పాపగా ఏదో సాధించేయాలని,ఎందరో తన ఉనికిని మెచ్చుకోవాలని ఉవ్విళ్ళూరుతు అమ్మ ఒడిని చేరుతుంది ఆశల రాశియై.

 ఏమి చూసుకొని దానికంత ఉత్సాహము?
వెన్నెముక నిలబడలేనంటుంది.పొరలతో కప్పియున్న కన్నులు.కదలలేని తనము.అన్నిటికి ఒకటేఆసరా.అదే ఏదుపు.
ఎంత విచిత్రమీ సందర్భము.
  ఎంత నిజమీ ఉపాధి సందిగ్ధము.

   ఎవరు మంత్రము వేస్తారో కాలక్రమముగా ఇంద్రియములు స్వశక్తిని సంపాదించుకుంటున్నాయి.సర్వాంగ సుందరత్వమును సంతరించుకుంటుంది అదే ఉపాధి.దానితో పాటుగా సర్వ సమర్థత్వమును పొందాననుకుని సత్వగుణమును సద్దుమణగమంటుంది.అదీ ఒక తరలిపోయే తమాషా అని గమనించనీయదు తెరలుతెరలుగా కప్పుకొనియున్న తమోగుణము.
 ఏముంది చివరకు? జవసత్వములుడిగిన జీవఛ్చవ బొమికల గూడు.పరాధీనమవుతు,ప్రశాంతతను వెతుకుతు.....

 ఇదంతా గమనిస్తుంటే మన శరీరము ఒక మరబొమ్మ అంతే కాని దానికి స్వయం సామర్థత లేనిదిగా అనిపిస్తున్నది.

   అదే కనుక నిజమయితే దానిలోల దాగి మరలను తిప్పుతున్న మర్మమేమిటి?
 అను అంతర్మథనము తో అతలాకుతలమగుచున్న నాకు,

  ఆలయములోనుండి
 "ధాయేత్ ఈప్సిత సిధ్ధయేత్" అను ఆపాతాళ-నభస్త శ్లోకము వినబడగానే,ఏదో ఆశాకిరణము నన్ను నడిపిస్తున్న భావనలో మునిగిన నన్ను,మనలను
  అంతర్యామి ఆశీర్వదించుగాక.

 పరమేశ్వర పాదారవిందార్పణ మస్తు.




No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...