DHYAAYAT IPSITA SIDHDHAYAET-04

 


ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్-04

******************************


 ఆలోచనలలో మునిగియున్న నన్ను మరొక సందేహము ముందర నిలిచి,సతమతము చేస్తున్నది నా దినచర్యను ఒక సిధ్ధాంతముగా మారుస్తు.


 వాటి సంగతి సరే.మరి నా సంగతి ఏమిటి? నిన్న రాళ్ళ ఉప్పు పట్టుకుని వస్తున్నప్పుడు నా ఇంద్రియములైన కళ్ళు-స్పర్శ దానిని ఉప్పుగా గుర్తించి నాకు చెప్పినవి.తెచ్చి గిన్నెలో వేసి అవతలికి వెళ్ళానో లేదో తిరిగివచ్చేటప్పటికి నా కళ్ళు ఉప్పును చూడలేమంటున్నవి.నా స్పర్శ కూడా ఆ నీళ్ళలో ఉప్పు ఉన్నదో/లేదో తాను చెప్పలేనంటున్నది.అంతలో నా జిహ్వ నేను చెప్పగలను అంటు రుచి చూసి ఉప్పు నీళ్ళలో కలిసినదని చెప్పినది.దృష్టి-స్పర్శ తమ శక్తిని ప్రదర్శించినపుడు జిహ్వ తన ప్రభావమును దాచివేసినది.

అవి నిస్సహాయములైనపుడు తన శక్తిని ప్రకటించి చేతనునకు తోడైనది.


 నిన్న మామిడిపండు కూడా తన రంగుతో నా దృష్ని,సువాసనతో నా నాసికను చైతన్యవంతము చేసి,నేను దానిని తినుటకు తాము సహాయపడలేమన్నవి.

అప్పుడు నాలుక తన చాకచక్యముతో అద్భుతరుచులను అనుభవములోనికి తెచ్చినది.

 నాకు సహాయపడుటలోనే కాదు.ఇతరుల ప్రతిభను గుర్తించుటలో కూడ సమర్థవంతములు కావు.

 కనుకనే వేదికపై ఆసీనులైన వారిలో మధురగాయనిని మౌనముగా ఉన్నప్పుడు గుర్తించలేక పోయినది నా శ్రవణేంద్రియము.ఎందుకంటే అది శబ్దముపై ఆధారపడియున్నది కాని స్వయం సమర్థవంతము కాదు.

 కనుకనే నేను కదలకయున్న నర్తకిని 

ఆమె శరీరావయములను చూసి నాట్యప్రత్యేకతను గుర్తించలేకయున్నాను.


 అసలు ఇంతకీ ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రత్యేక నైపుణ్యమును దాచిపెట్టినది ఎవరు? దానిని ప్రకటింపచేయుచు ఒక్కొక్క ఇంద్రియమునకు గుర్తింపగల సామర్థ్యమునిచ్చినదెవరు?

   ప్రతిభ ఆవిష్కారమునకు ప్రశన్సావిష్కారమునకు గల సంబంధమును ఏర్పాటు చేసినదెవరు?


 పరస్పరాధారములైన వీటి మేలన కర్త చాకచక్యమును గుర్తించుట సాధ్యమేనా అన్న సందిగ్ధములో నున్న నన్ను-మనలను ఆ సర్వేశ్వరుడు సన్మార్గములో నడిపించును గాక.


   సర్వం పరమేశ్వర పాదారవిందార్పణమస్తు.


Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI