Thursday, October 14, 2021

AMMA KAAMAAKSHI UMAYE-09

శ్రీ మాత్రే నమః *************** ఎందనైపోలవే జననం ఎడుత్తోర్గల్ ఇంబమాయ్ వాళ్దిరిక్క యాన్ సెయిద పావమో ఇత్తనై వరుమయిల్ ఉన్నడియె తవిపదమ్మా ఉన్నయాయ్ తుళ ఎండు ఉరుదియాయ్ నంబినేన్ ఉన్ పాద సాక్షియాగ ఉన్న ఎడి వేరుతునై ఇని యూరయుం కాని ఉలగం తనిల్ నెందనెక్క పిన్న ఎండ్రెండ్రు నీ సొల్లామల్ ఎన్ వరుమయె పోకడిదు ఎన్నై రక్షి బూలోగం మెచ్చవే బాలమార్కండ పోల్ పిరియమాయ్ కాతిదమ్మా అన్నయె ఇన్ను మున్ అడియేనె రక్షిక్క అడ్డి సేయాదే అమ్మా అళగాన కాంచియిల్ పుగళాగ వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే, అమ్మ కామాక్షి ఉమయే. ********************* ఎందరో నావలె జన్మమెత్తిన గాని ఆనందమొసగినావే నా పూర్వ పాపమే తరుముతు వచ్చినది నీ చరణమె శరణమమ్మా నీవె నా అభయమని నెరనమ్మినానమ్మ నీ పాదమె సాక్షి కాగా నిన్ను మించినవారు వేరెవరు కనరారు ఎన్ని లోకములు గాలించినా సమయమిది కాదని నువు జాలమే చేసినచో దీనునికి రక్ష ఎవరు? భువనములు కీర్తించ బాలమార్కండేయుని బ్రతికించినట్లుగానే ఇప్పుడైనను వచ్చి నన్ను రక్షింపగ బెట్టు నీకేలనమ్మా అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే, **************** పరిణితి చెందిన పశ్చాత్తపము, అన్యథా శరనం నాస్తి - త్వమేవ శరణం మమ" అని ,కంచర్ల గోపన్న, "ఇక్ష్వాకుల తిలక ఇకనైనా పలుకవ రామచంద్రా నన్ను రక్షింప నీకంటె రక్షకులెవరయ్యా " రామచంద్ర అన్నట్లుగానే, మన సాధకుడు కుడ, అబ్బ తిట్టితినని ఆయాసపడవద్దు-ఈ దెబ్బలకోర్వక అబ్బ తిట్టితినయ్య రామచంద్రా" అన్నట్లుగా, ఉన్నడియె తవిపదమ్మా- నీ దివ్య చరణములే నాకు శరణ్ అములు అంటున్నాడు సర్వస్య శరణాగతిని కోరుతు. రక్షించ నీ కంటె రక్షకులెవరయ్యా రామచంద్రా -అన్నట్లుగానే మన సాధకుడు తల్లీ, ఎన్ పోకడిదు-నేనెక్కడికి వెలతాను, ఒకవేళ వెళ్ళి శరణు వేడినా, ఎన్నై రక్షి? ఎవరు నన్ను రక్షించగలరు? నీవు తక్క అంటున్నాడు. నటరాజ పత్తు లోని సాధకుడు సైతము పరమేశా నీవు నన్ను రక్షించాలని అనుకుంటున్నప్పటికిని, పరమేశా! నీవు దయార్ద్ర హృదయుడవు.నన్ను రక్షించదలచినను, " నా తలరాత నెంజముందో" అధికముగా నున్న నా పాపఫలితములుగా నీ అనుగ్రహమునకు అవరోధములుగా మారినవేమో తండ్రీ.నన్ను నీదయకు దూరము చేయుచున్నవేమో? నేను నా అశక్తతకు దుఃఖించటము తప్ప ఏమి చేయలీని దీనుడను. పరమేశా! నేను 'అల్లామల్ నాన్ ముఖల్ తన్నియేల్ నోవనో? నేను అసలు తెలివితేటలు లేనివానిగా నున్నందుకు దుఃఖించనా? లేక ఉన్నిలె ఇనవందు మూళయేండ్రురువనో- నా మూర్ఖత్వమును తలచుకొని దుఃఖించనా? లేక తన్నైనందళువనో నా దుస్థితికి బాధపడనా లేక ఉన్నై నందళువనో నా మీద నీదయ రానందులకు బాధపడనా, అసలివన్నియును కాదు " మున్ పిరవి పెన్నలిల్ సెయిదనెన్రు అళువనో" పురాకృత పాపములను తలచుకొని బాధపడనాలేక " ఎళి పెరియ అండంగళుం కాయ మైత్తువిల్ బ్రహ్మాండములతో బంతులాడు నీకు " ఎన్ కురైకళ్ తీర్థాల్ పెరియా" నా ఆపదలను తీసివేయుట పెద్ద పనియా?" కానేకాదు అని నిశ్చింతతో నుండనా అని నిటలాక్షుని కటాక్షమును అర్థిస్తాడు. మన సాధకుడు కూడ అమ్మ నీకటాక్షమును నా కర్మఫలితములు చేరనీయటము లేదేమో( అమితముగా నుండుటచే) అయినను మించిపోయినది లేదు, మార్కండేయుని యమపాశమును విడిపించినది. అల్పాయుష్కుని చిరంజీవిని చేసినది మీ కరుణ. తల్లీ నీ నిర్హేతుక కృపాకటాక్ష స్పర్శచే నా దోషములు తొలగిపోయి నన్ను రక్షించిన నీ కరుణ, బాల మార్కండేయుని చిరంజీవిని చేసి చరితార్థమైన విధముగా ఆ చంద్ర తారార్కము ఆరాధ్యనీయమై యుండును అని అను సాధకుని సత్వరము అనుగ్రహించు,కామాక్షి తాయి దివ్య తిరువడిగళే శరణము. అమ్మ చేయి పట్తుకుని నడుస్తూ,రేపు విరుత్తములోని పదవ భాగము గురించి తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము. నరియ నరియ వణక్కంగళ్ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. https://www.youtube.com/watch?v=yYfOX3ahZGI

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...