Wednesday, October 13, 2021

AMMA KAMAKSHI TAAYI-08

శ్రీ మాత్రే నమః **************** .మున్నయోర్ జన్మదిరం ఎన్నెన్నో పావంగళ్ ఇమ్మూడన్ సెయిందనమ్మా మై ఎండ్రు పొయిసొల్లి కయితనిల్ పొరుళ్తట్తి మోసంగళ్ పన్నినేనో ఎన్నమో తెరియాదు ఇక్షణం తన్నిలె ఇక్కట్టు వందదమ్మా ఏలైనాళ్ సెయిద పిళై తాయ్ పొరుళ్ అరుళ్ ఎన్ కవళై తీరుమమ్మా చిన్నంగళాకాదు జయమిల్లయో తాయె శిరునామమగుదుదమ్మా శిందనై ఎన్మీదిల్ వైదునరు భాగ్యమరుళ్ శివశక్తి కామాక్షి నీ అన్నవాహనమేరి ఆనందమాగో ఉన్ ఆడియేన్ మున్వందు విరప్పాయ్ అలగాన కాంచియిల్ పుగళాన వాళ్దిడుం అమ్మకామాక్షి ఉమయే. ****************** ఎన్ని జన్మలలోన ఎన్నెన్నో పాపములు మూఢునిగ చేసినానో కల్లలెన్నో పలికి చేతివాటము చూపి మోసములు చేసినానో ఏమిటోతెలియదు ఈ క్షణము తరుముచు ఇక్కట్టు వచ్చెనమ్మా గొప్ప మనసుతో నీవు తప్పించకున్నను నా కలత తీరదమ్మా అపరాజితవు నీవు అపరాధినే నిన్ను ప్రార్థించుచుంటినే అమ్మా చిన్నబుచ్చక నన్ను మన్నించుటయు నీదు కాదనలేని కరుణయేనమ్మా హంస వాహినివిగా ఆనందదాయివై దరిశనమునీయవమ్మా అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే- అమ్మ కామాక్షి ఉమయే. ****** " హంస వాహ సమాయుక్తా విద్యాదాన కరీ మమ" అని సరస్వతీ స్తోత్రము . సత్యముకానిదానిని సత్యమనుకొనుట-సత్యమైన దానిని అసత్యమనుకొనుటయే అవిద్య.అన్నింటిలో దాగిన ఏకత్వమును గ్రహించలేకుండట.జ్ఞానమును పట్తుకొనుటకు దారులు వెతుకుట-పరుగులు తీయుట.ఫలితమును కనకుండుట. మనలో ఉన్నదానిని చూడలేక ,మరుగున ఉన్నదనుకొనుట మాయ. జగద్గురువులు 'సౌందర్యలహరి"లో అమ్మా నీవు అవిద్యానం అంతర్ తిమిర మిహిర లహరివని తల్లీ నీ చైతన్యమనే మాలో నున్న వెలుగు మా మనసులో నిండితున్న చీకట్లను పారద్రోలే ప్రకాశమమ్మా అని తల్లిని ప్రస్తుతించారు. ఈ భాగములో సాధకుని అంతరంగ చీకటి అమ్మదయతో కొంచము కొంచము తొలగుచు,తన తప్పిదములను ఒక్కొక్కటిని గురుతు చేస్తూ,పశ్చాత్తపముతో పరివర్తనము చెంది అమ్మ దయకై ప్రాధేయ పడునట్లు చేస్తున్నది. ముడుచుకు పోయిన జ్ఞానము మూఢత్వమై ఇక్కట్టుగా/ఇబ్బందిగా తరుముచు వచ్చుచున్నది. నేను పూర్వజన్మలలో ఏ ఏ పాపములను తెలిస్యు వినోదమునకై చేసినానో/విలాసమునకై చేసినానో/విర్రవీగుతూ చేసినానో తెలియదు. ఒకటేమిటి? లెక్కలేనన్ని.చెప్పలేనన్ని. పొంచి ఉంచి నిన్ను తుంచివేయు పూర్వపాప కర్మ-పేర్మి తోడ. నటరాజ పత్తు లో సాధకుడును ఇదే విధముగా, " వళికండు ఉన్నడే తుదియాద పోదిలం" అమ్మా/అయ్యా నాకు దారి కనిపించుటలేదు.కనిపిస్తుందని అనిపించుటలేదు. మోసమే చెయ్యనుం-దేశమే కవరినుం" మోసముతో దేశాన్ని గెలవాలనుకున్నానేమో, అమ్మా నేను ఈ జన్మలోని తెలివితక్కువతనమునకు బాధపడనా లేక, " ఎన్ మున్ పిరవిన్ కడవనో-" నా పూర్వజన్మల గురించి తలచుకొని బాధపదనా అను తికమకలో నున్నానమా. అసలు నా పూర్వ జన్మలకు కారణము, శ్రీ ములుగు పాపయారాధ్యులవారు తన దేవీ భాగవతములో సెలవిచ్చినట్లు, " తల్లులకెల్ల తల్లియగు తల్లిని కానగలేక ఎందరో తల్లుల గర్భకోశమున తానుదయించుచు జన్మజన్మలున్ తల్లుల సంతరింతురిల ఓ పరశక్తి నీవె మా తల్లివటన్న మాత్రమున ఇక తల్లులు లేర్కదా ధరిత్రిపై." అన్న సత్యమును గ్రహించలేక, "పునరపి జననం-పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం." అనుకుంటు కలవరవడుతున్న నన్ను,జ్ఞాన సంకేతమయిన హంసను ఎక్కివచ్చి,,జ్ఞాన స్వరూపమైన కామాక్షి అమ్మా!కరుణించి నా కలతను పారద్రోలుము. ,హంసవాహినివై సాక్షాత్కరించి,నాలోని అజ్ఞానమును పారద్రోలి నన్ను అనుగ్రహించవమ్మా,అని ప్రాధేయపడుతున్న సాధకుని త్వరలో అనుగ్రహించబోతున్న కామాక్షి తాయి దివ్య తిరువడిగలే శరణమనుకుంటూ,అమ్మ చేయి పట్టుకుని నడుస్తూ,మనము రేపు విరుత్తము లోని తొమ్మిదవ భాగమును గురించి తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...