Saturday, November 20, 2021

MURUGA NAYANAR

మురుగ/మురుగర్ నాయనార్ ************************ " యోపాం పుష్పం వేద - పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమాం వా అపాం పుష్పం- పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద - యోపాం ఆయతనం వేద- ఆయతనవాం భవతి. మంత్రపుష్పము. పుష్పము-పువ్వు-సుమము-కుసుమము-శిరీషము-ప్రసూనము ఇలా అనేకానేక పదములంతో వేనిని పిలుచుకొనుచున్నామో,అవి,తీగెల/లతల నుండి,గుబురుల నుండి,మొక్కలనుండి,చెట్లనుండి,వృక్షములనుండి,మొగ్గతొడిగి పుష్పములుగా వికసిస్తున్నవి.వీటిలో కొన్ని ఒకే రంగులోను,మరికొన్ని కలగలుపు రంగులలోను,కొన్ని లేతరంగులలో,మరికొన్ని నుండు ముదురు రంగులలో అనేకానేక విధములుగా సృజింపబడుచున్నవి పరమాత్మ స్వరూపమైన ప్రకృతిచే. ఇప్పటివరకు మనము ముచ్చటించుకున్నది బాహ్య వాచ్యార్థము.అయితే అంతరార్థమును తెలుసుకోవాలనే కుతూహలము మనకు కలిగితే, " పుష్" అను పదమును స్థితికారకత్వమునకు అలంకారికులు అన్వయిస్తారు. సర్వకర్త-సర్వభర్త-సర్వహర్త అయిన పరమాత్మ మహాసక్తి చే జరుగుచున్న-జరుపబడుచున్న సృష్టి-స్థితి-సమ్హరనము-మాత్రమే కాక తిరోధాన-అనుగ్రహమనే పంచకృత్యములను పునరావృతముచేయుచున్న అవ్యక్తమే పుష్పము. మంత్రపుష్పములో మన మనసు చంద్రునితో పోల్చబడినది.దానికి కారనము చంద్రుని ఉన్న వృధ్ధి-క్షయములు మన మనసునను మనము కలిగియుండుట.సుఖ-దుఃఖములకు పొంగుతూ-విచారిస్తూ ఉంటాము. అటువంతి మన మనము స్థితప్రజ్ఞ్తవమును పొదాలంటే జలము నుండి ప్రభవించిన పుష్పముగా మారాలి.అదియే హృత్పుండరీకము. ఇక్కడ మన మనము బలమును పొందాలంతే దానికి ఆయతనము.ఆధారము కావాలి.ఆ ఆధారము సంసారమనే జలములో అనుభవములనే పాఠములు.వాటినుండి మనము నేర్చుకొనుచున్న విషయములే మంచివాసనలు.కనుక జలమనే సంసార అనుభవ సారమునుండి పుట్టిన సలక్షణ సంస్కారములే సద్గతికి సోపానములు. పూజలు సేయ పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను స్వామి తీయరా తలుపులను తొలగించరా తలపులను, అంటూ ప్రతి నిత్యము పంచభూతములతో-తన పంచేంద్రియములను జతచేసి,పంచాక్షరిని జపించుచు,పాపయ్యశాస్త్రి గారు అన్నట్లు పుష్పములు నొచ్చుకోకుండా,దుర్వినియోగము కాకుందా,సున్నితముగా తెంపి,భక్తి భావన అను దారముతో హారముగా మలచి,తిరుపుగలూరులోని అగ్నీశునికి అర్పించి అమితానందమును పొందేవాడు మురుగ నాయనార్.సార్థక నామధేయుడు. తమిళములో మురుగ సబ్దమునకు అళగు/అళ్ళత్తు అలఘు అను అర్థమును హెబుతారు. ఆ అలగుదనము సౌందర్యము ఎటూవంటిదంటే, ఇల్లామై-ఎప్పతికి జరా భయములేక,యవ్వనవంతమై, దేనిలో యవ్వనవంతము అంటే, కడవన్ తమ్మై-దైవభావనలో, దైవభావనలో/చింతనలో ముసలితనమును తెలియక,ఎప్పటికిని యవ్వనముతో నుండి, భక్తి సువాసనలను వ్యాపింపచేయునది. కనకనే మన నాయనారు మురుగర్ నాయనారుగా వానిని ప్రసాడించు శక్తిని మురుగన్/మురుగేశన్ గా కీర్తిస్తారు. భక్తిని ఆభరణముగా,దీక్ష అను మురుగును/కంకణమును ధరించిన వానిగా కూడ భావించుకొనవచ్చును. పై అంతస్థుకు చేర్చుటకు నిచ్చెన ఆధారమైనట్లు,శివ సాయుజ్యమును చేర్చుటకు స్నేహ రూపమున జ్ఞాన సంబంధారు భక్తి తాడును పెనవేయుచు భగవద్దర్శనముకై వేచియున్నారు ఇద్దరు.కాలగతిలో ఋతువులతో పాటు మానవదశలు-ఆశ్రమములు మారుట సహజమే కదా.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...