NESA NAYANAR

నేశ నాయనారు *************** " శంభో మహాదేవ శంభో శివ శంభో మహాదేవ శంభో ఫాలావలనమ్రత్ కిరీటం ఫాలనేత్రార్చిధా దగ్ధ పంచేషు కోటం శూలాహలా రాతి కూటం శుధ్ధమర్థేంద్రుచూదం భజేమార్గ బంధుం భజే మార్గబంధుం.(శ్రీ అప్పయ్య దీక్షితులు) శిరస్సున కిరీటమును ధరించినవాడు,మూడవనేత్రముతో మన్మథుని జయించినవాడు,త్రిశూలముతో శత్రువులను సంహరించినవాడు,శుభకరుడు,మాయాతీతుడు,సిగలో చంద్రకళను ధరించినవాడు,మార్గ బంధువు అగు శివునికినమస్కరించుచున్నాను. *** హరియను రెండక్షరములు హరియించును పాతకములు అంబుజనాభా హరి నీ నీ నామ మహాత్మ్యము హరిహరి పొగడంగ, వశమె హరి శ్రీకృష్ణా! (నృసింహకవి) నేశన్-నేతగాడు/ప్రభువు అని రెండు అర్థములను మనము కనుక అన్వయించుకుంటే, శివనేశ నాయనారు కర్ణాటక రాష్ట్రకంపిలి గ్రామములో జన్మించినప్పటికిని,బాల్యములోనే వారి కుటుంబము తముళనాడులోని కురైనాడునకు వలస వెళ్ళినది. మగ్గముపై దారములను సర్దుతూ వస్త్రములను నేయుట వృత్తి. మనముపై పంచాక్షరి నామములను దారములను సర్దుతు భక్తియను వస్త్రములను నేయుట ప్రవృత్తి. కామేశుని భక్తులకు పంచిపెట్టుటకై కౌపీనములను నేయుట , శివ భక్తులను సాక్షాత్తు శివ స్వరూపముగా దర్శిస్తూ,వారికి పంచెలు-కౌపీనములను పంచుతూ,పరమ సంతోషపడు వాడు.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI