Saturday, November 6, 2021

SAKTI NAYANARU.

శక్తి నాయనారు వ్యవసాయ కుటుంబమునకు చెందినవాడు.పరిణిజయూరు లో జన్మించాడు.అమితమైన సివభక్తి కలవాడు. ఎవరైనను రుద్రాక్షలు ధర్,విభూతి పుండ్రములు ధరించకున్నప్పటికిని,సదాచార సమోన్నులు కాకపోయినప్పటికిని,రుద్రాభిషేకములు చేయకపోయినప్పటికిని వారిని విమర్శించకుండ ఉండగలుగు సంస్కారము కలిగియున్నప్పటికిని,నాయనారు శ్రవణేంద్రియము మాత్రము శంభుదూషణుని క్షమించలేని కఠినత్వము కలది.భావములను భాషగా మార్చుటలో సహకరించుచున్న నాలుకను కత్తిరించివేయకుండా ఉండలేనిది. శివనాథు వర్ణించు జిహ్వజిహ్వ-దాని నియమము.అన్యము అనర్థదాయకమనుచు ,దానిని తీసివేయేసే మోటుదనములో దీటులేనిది. ఇది బాహ్యమునకు మనకు కనిపించుచున్న దృశ్యము. కాని నిశితముగా పరిశీలిస్తే పరమపూజ్యుడైన నాయనారు,అన్నమయ్య కీర్తించినట్లు, భావములోన-బాహ్యము నందున గోవింద-గోవింద అనికొలువవే ఓ మనసా అనుటకు నిలువెత్తు నిదర్శనము. కనుకనే అత్తినాయనారు-సత్తి నాయనారు-శక్తి నాయనారు అని సన్నుతించుటలోని ఆంతర్యమును కొంచము పరిశీలిద్దాము. అత్తి అనగా వటవృక్షముగా పోల్చి-ప్రళయానంతరము జగన్నాధుని సేవించినది. సత్తము అను తమిళ పదము శబ్దము అను అర్థమును తెలియచేస్తుంది.తీయ సత్తము అను పదమును దుర్భాషగా కనుక అన్వయించుకుంటే, దుర్భాష వెలువడుటకు సహాయపడిన నాలుకను అనగా మూలదోషమును నిర్మూలించు స్వభావము కలవాడు సత్తి నాయనారు . మూడవ నామము శక్తి నాయనారు. శక్తి అను పదమును ఆయుషము అను అర్థములో కనుక అన్వయించుకుంటే,భక్తి అనే కత్తితో(శక్తితో) భవబంధములను తుంచివేయువాడు అని అనుకోవచ్చును. పదకవితా పితామహ అన్నమాచార్య కీర్తించినట్లు, భావములోన-బాహ్యమునందున గోవింద-గోవింద అని పలుకవే ఓ మనసా,అంటూ పంచేంద్రియములోని,వాక్కును పునీతము చేసుకునే మహాయజ్ఞ అంకురార్పణముగా అనిపిస్తున్నది. వాచాలత్వమునకు వీడ్కోలు ఇస్తూ, " కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతాధార్యతే క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం ' అన్న సత్యమును జగద్విఖ్యాతము చేసిన సక్తి నాయనారును అనుగ్రహించిన సదాశివుడు మనలను సర్వవేళల సంరక్షించును గాక. ఏక బిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...