Wednesday, December 1, 2021

KALIKKAR AMMAYAAR NAAYANAAR

కరైక్కల్ అమ్మయార్ నాయనారు *************************** మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచ చనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణందుచంద్రికా చకిత చకోరకంబు అరుగునే సాంద్ర నీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తమేరీతి నితరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయిన్ ఏల. బమ్మెర పోతన సహజకవి సాహిత్యమునకు నిలువెత్తు తార్కానము కలికంబ అమ్మయార్ నాయనారు. కరైక్కల్ గ్రామమునకు సంబంధించిన పరమ శివ భక్తురాలు. వైశ్య కులసంజాతుడైన ధనదత్తుని కుమార్తె .మహాలక్ష్మి అవతారముగా వారు తమ కుమార్తెను భావించి" ఔనీతవతి" అని నామకరనమును చేసినారు .చిన్నతనమునుండి శివభక్తితో ,శివపాదార్చులను వినయముతో సేవిస్తూ ,తల్లితండ్రులను సంరోషపరుస్తు ,సార్థక నామముతో జన్మపరమార్థమునకు త నను మలచుకుంటూ అందరికి ఆదర్శముగా అల్లారుముద్దుగా పెరుగుచున్న సమయమున " నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్థరాభ్యాం" నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమోనమః శంకర పార్వతీభ్యాం" మంగళమూర్తులైన పారవతీపరమేశ్వరులు పుణ్యవతికి వివాహసమయమాసన్నమైనదని,యోగ్యుడైన నిధిపతితో వివాహమును జరిపించిరి జీవన గృహస్థాశ్రమములోనికి నడిపించిరి. భార్యగా/ఇల్లాలుగా తన ధర్మములను నిర్వర్తిస్తూనే/కర్తవ్యపాలనము చేస్తూనే నిశ్చలమతితో నిటలాక్షుని సేవించుకుంటున్నది పరమసాధ్వి. ఏమైనచేయగల సమర్థుడు ఏకామ్రేశ్వరుడు.ప్రళయానంతరమును నిశ్చలముగా నున్న పార్వతీ మనోహరుడు. తను ఆడబోయే నాటకమునకు రెండు చూత ఫలములను ఊతము చేశాడు. శివుని ఆనలేనిది చీమ అయినా కుట్టదు అని కదా.పెద్దలు చెబుతారు. ఏమి వింతలు చూపబోతున్నాడో ,ఎన్నిమలుపులు తిప్పబోతున్నాడో ఆ ఎరుకులవాడు/ఎఱుక కలిగినవాడు. ముడిపడియున్న పుణ్యఫలము ఆ మామిడిపండ్లను విడివదకుండా నిధిపతి ద్వారా పునీతవతికి అందేలా చేసాడు నిధనపతి. భోజనసమయమున స్వీకరించుటకు అనుచరునిద్వారా సందేశమును పంపాడు భార్యకు పదిలపరచమని. పదిలముగా నున్న శివభక్తి పరమేశుని అతిథిగా రప్పించి,కరైక్కల్ అమ్మయారు చరితమును లోకవిదితము చేయాలనుకుని ఉవ్విళ్ళూరుతున్నది. యుక్తిని-భక్తిని నాణెమునకు ఇరువైపుల సమానముగా తిప్పుతున్నాడు అసమ నయనుడు. భవతిభిక్షాందేహి అంటూ రానేవచ్చాడు దేవతార్చనకై. భవుడ రక్షాం పాహి అంటూ సాదరముగా ఆహ్వానించినది నిత్య నైవేద్యమునకై. కిక్కురుమనకుండా వచ్చుకూర్చున్నాడు ముక్కంటి.చక్కదనముతో ఆహారపదార్ధములతో విస్తరినిండా వడ్డిస్తున్నది పునీతవతి సాక్షాత్తు అన్నపూర్యై. నక్కి నక్కి చూస్తున్నాయి దాచిన మామిడిపండ్లు ఎప్పుడెప్పుడు బిగినముడిన విప్పుదామా అంటూ. స్వామి తృప్తిగా ఆరగించి,విశ్రమించి మా ఇంటిని,మమ్ములను అనుగ్రహించండి అంటూ విన్నవించుకుంటున్నది పునీతవతి. అవపోసనలేదు-ఆనందములేదు అతిథి వదనములో.కదల-మెదలక కూర్చున్నాడు.నోరు విప్పడు-బదులు చెప్పడు. బతిమాలించుకొని/బతిమాలించుకొని మెల్లగా, అమ్మా! విస్తరిలోఅన్నిపదార్థములు అవే సంపూర్ణముగా వడ్డించబడినవా లేక ఏమైన మిగిలి ఉంటే ఆలస్యముచేయకుండా అతిథికి అర్పించి తరించండి.అని మరొక్కసారి తన భర్తకోరక దాచిన మామిడిపండ్ల విషయమును చెప్పకనే చెప్పాడు. పతివ్రతా ధర్మము ఒకవైపు-యతివ్రతా ధర్మము మరొక్కవైపు, రెందును మహోదాత్తములే.అనుసరణీయములే.ఆమోదయోగ్యములే. హెచ్చరిస్తున్నాడు పునీతవతిని చిచ్చు కన్నువాడు. అమ్మా నేను మరొక గృహస్తు భిక్షను స్వీకరిస్తానులే తల్లి.నీవు మాత్రము కలవర పడకు అంటూ విస్తరిముందు నుండి కదులుతున్నట్లుగా నటించాడు. జాగుచేసినందుకు మన్నించని మహాదేవుని ప్రార్థిస్తూ మామిడుపండును ఒకటి తెచ్చి వడ్డించింది.యతి కడు సంతోషముతో ఆరగించి కదిలిపోయాడు /కనికరముతో రావోవు మార్పునకు పావులను కదుపుతూ. మధ్యాహ్న సమయమైనది .రానేవచ్చాడు గుణపతి భోజనాని.భక్తిశ్రధ్ధలతో భర్తకు భోజనమును వడ్డించింది.వీవనను వీస్తూ సేవిస్తున్నది.పదార్థములను కొసరి-కొసరి వడ్దిస్తున్నది,అది చూసి లోలనున్న మామిడిపండు ముసిముసిగా నవ్వుకుంటున్నది తనవంతు పనిని చేయటానికి సిధ్ధపడుతు. మామిడిపండును తెమ్మన్నాడు నిధిపతి.అంగీకరించిన సాధ్విని అనుసరిస్తూ కదిలింది పండు.మెండైన ప్రీతితో భర్తకు వడ్డించింది.ఆస్వాదించాడు.అదనుచూసిన మదనహరుడు తన ఆటలో భాగముగా రెండవఫలమును తెమ్మని అడిగించాడు. ఓం నమః శివాయ. సకలము నీమాయ. తోచలేదు పునీతవతికి ఏమిచేయాలో/ఏమని సమాధానమునివాలో? యతి స్వీకరించిన మామిడిపండును ఎక్కడినుండి తేగలదు?ఎలా తన పతికి ఇవ్వగలదు? స్వామిని సాయము అర్థించిది.చూపిస్తా నా మహిమ అంటు చేతిలోనికి వచ్చి వాలింది చూత ఫలము.భర్తకు తెచ్చి సమర్పించింది భారము దిగిన మనసుతో. కాని పునీతవతి దించుకోవలసిన భారము సంసార మను మూట.దానికి వేస్తున్నాడు దయతో బాటను శివుడు. ఓ శివా నీ కరుణ ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఏమి రుచిరా ఓ దేవ ఇదెక్కడిదని భార్యను నిలదీసడు.స్వామి ప్రసాదమనగానే తగవును బిగించాడు వారిమధ్య బంధమనే తాడు ముడివిప్పటానికి. భార్యమాటను నమ్మలేదు.ఋజువు అడిగాడు.నిజమును చూసి తెలుసుకున్నాదు. జరుపుతున్నాడు పునీతవతిని సంసారపు కట్లనుండి.వెలుగుతున్నది పునీతవతి వేయి కాంతులతో. యవ్వనమును హరించ్వేయమని హరుని వేడుకున్నదు. ఏమనగలము శివుని ఏర్పాటును. పునీతవతి ఐహికమును విడిచిపెట్టేసినది. తమసోమా జ్యోతిర్గమయా. భార్యవిడిచినదానిని గట్తిగా పట్టుకుని సంసారబంధములలో మరింత కట్తబడినాడు గుణవతి. అందుకేనేమో చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవ అవి బుధ్ధిః కర్మానుసారిణి -పట్తుకున్న పాసము ఫలితములను చూపిస్తుందికద పాయక అనవరతము. స్వామి ఊర్థవ తాండ్వ వేళ దర్శిస్తూ,సంకీర్తిస్తూ,తిలకవతి,పాపకర్మక్షయమును గావించుకొని గుణపతి పరమేశ్వరానుగ్రమును పొంది తరించినారు. కలిక్కర్ అమ్మయార్ నాయనారును అనుగ్రహించిన ఆదిదంపతులు మనలనందరిని అనిశము సంరక్షించెదరు గాక. ఏక బిల్వం శివార్పణం. ,

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...