Saturday, December 18, 2021
PASURAM-04 TIRUVEMBAVAY
పాశురం-04
**********
ఒణ్ణిత్తిల నగయా ఇన్నం పులందిండ్రో
వణ్ణిన్ కిళిమొళియార్ ఎల్లారుం వందారో
ఎన్నికొడు ఉళ్ళవా చుళ్ళుకో మప్పళవున్
కణ్ణి తుయిల్ అవమే కాలత్తై పోగాదే
విణ్ణికొరు మరుందై వేదవిదు పొరుళై
కణ్ణుక్కు ఇనియానై పాడి కసిం ఉళ్ళం
ఉళ్నెక్క నిన్రురుగై యామాట్టో నీయే వందు
ఎన్ని కురైయిల్ తుయిల్ యేలో రెంబావాయ్.
మందస్మిత ప్రభాపూర మధ్యత్ బ్రహ్మాండ మండలా పోట్రి
****************************************
మూదవ పాసురములోని చెలి యొక్క సత్వగుణశోభను ముత్యముల వంటి స్వచ్ఛమైన పలువరుసతో పోల్చారు మాణిక్యవాచగరు.
నాలుగవ/ప్రస్తుత పాశురములో నిదురిస్తున్న చెలి అద్భుతతేజో విరాజితమైన నవ్వుకలది.
ఆమెనుమేల్కొలుపుచున్న చెలికత్తెలు వణ్ణిన్ మొళియార్ కిళులు
వణ్ణిన్-పంచవన్నెల
మొళియార్ -చక్కగా మాట్లాదకలిగిన
కిళులు-చిలుకులు.
వారి మధ్యను జరుగుచున్న సంభాషనము పరమేశుని,
వేదపొరుళ్ అని వేదస్వరూపమని,
మరందై-భవరోగము తొలగించు ఔషధమునిచ్చు వైద్యుడు అని సంకీర్తించుచున్నారు.
బాహ్యములో పరిహాసమును,ఆంతర్యములో పరమార్థమును మనకు అందించుచున్నారనుట నిస్సందేహము.
కాలత్తై పోగాదే అంటూ కాలము మన ఎవరికోసము ఆగదు కనుక మనము కాలమును సద్వినియోగ పరచుకోవాలనే విషయమును,
చెలి నీవు ఇంకా నిదురించుచున్నావు,
ఇన్నం పులందిండ్రో-ఇంకా తెల్లవారలేదా అని
మేల్కొలుపుతూ,
కాలత్తై పోగాదే-క్షణక్షణము జారిపోతున్నది కాలము.అది గమనించక నీవు
కణ్ణె తుయిర్ అవమే-కన్నులు మూసుకొని నిద్రించుచు,
అవమే-వ్యర్థము చేయుచున్నావు అని నిందిస్తున్నారు.
దానికి సమాధానముగా ఆమె కన్నులు మూసుకొని,
ఎల్లోరం వందారో-అందరు వచ్చేశారా?
వస్తే కనుక మిమ్మల్ని మీరు పరిచయము చేసుకుంటే
ఎన్నిక్కొడు ఉళ్ళవా-మనసులో లెక్కించుకుంటాను,
అనగానే భక్తి పరాకాష్ఠకు చేరని ఒక చెలి ముందుకు వచ్చి,
అప్పళం-అందరిని లెక్కించి,నీకు చుళ్ళుకో-నేను చెప్పనా అంటూ ముందుకు వచ్చింది.
అది గమనించిన మిగిలిన చెలులు ఆమెను ఆపి,
యామాట్టో నీయే వందు-నీవే లేచి వచ్చి మమ్ములను లెక్కించు అని అంటు ఒక విన్నపమును కూడ చేసారు.
అది ఏమిటంటే లెక్క కనుక సరిపోతే అందరము కలిసి ఆర్ద్రత నిండిన అంతరంగముతో ఆదిదేవుని సంకీర్తించుదాము.
ఒకవేళ లెక్కలో ఒక్కటైనను తగ్గినచో నీవు నీ నిదురను కొనసాగించవచ్చును.మేము తిరిగి వెళ్ళిపోతాము. అని అన్నారు.
నిదురించుచున్న చెలి మేల్కాంచి వచ్చి లెక్కించవలసినది ఏమిటి?
పంచవన్నెల-పంచదార పలుకుల చిలుకలు వారు అని మనము ముందర అనుకున్నాము.అంటే పంచేంద్రియ జ్ఞానము కలవారు.పంచభూతుని సంకీర్తించువారు.పరమ పవిత్రులు.
వారు సాక్షాత్తు పరమేశ్వరియైన చెలి వీక్షణ-సంభాషణ-స్పర్శతో తమను తాము పుఈతము చేసుకోవాలనుకుంటున్నారు.
చెలి నీవు లేచి వచ్చి నీ వీక్షణ సౌభాగ్యమును ప్రసరించు.నీ సంభాషణ సౌభాగ్యమును అనుగ్రహించు.నీ పవిత్ర స్పర్శ సౌభాగ్యమును ప్రసాదించు.
తదనంతరము మా కురైయిల్/దోషములు ఒకవేళ మిగిలి యున్నప్పటికిని సమసిపోతాయి.
అందరము కలిసి శివనోమును సంతోషముగా జరుపుకుందాము అని ఆమెను తమతో కలుపుకొని మరొక చెలిని మేల్కొలుపుటకు అడుగులను కదుపుచున్నారు.
అంబే శివే తిరువడిగళే పోట్రి.
Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-18
తనోతు నః శివః శివం-17 ******************* " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment