Saturday, December 25, 2021
PASURAM-10
తిరువెంబావాయ్-10
*****************
పాదాళం ఏళినుంకేళ్ శొర్కళియు పాదమలర్
పోదార్ పునైముడియం ఎల్లా పొరుల్ ముడివే
పేదై ఒరుప్పాల్ తిరుమేని ఒన్రల్లన్
వేదముదల్ విణ్ణోరం మణ్ణుం తుదితాళం
ఓద ఉళవ ఒరుతోళన్ తొండరుళున్
కోదిల్ కులత్తరంతన్ కోయిర్ పిణ్పిళ్ళైగళ్
ఏదవన్ ఊర్ ఏదవన్ పేర్ ఉట్రార్ అయళార్
ఏదవనై పాడుం పరిశేలో రెంబావాయ్.
విశ్వరూపాయ పోట్రి
***************
ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్పురత్
జ్యోతిస్పాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతైః
అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపాన్
ధ్యాయేత్ ఈప్సితసిధ్ధయే ధృవపదం విప్రోభిషించే శివం.
అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా పోట్రి
******************************************
ప్రస్తుత పాశురములో తిరు మాణిక్యవాచగరు స్వామిని,బహువిధములుగా దర్శించి ప్రస్తుతిస్తున్నారు.
స్వామి వేదస్వరూపుడు.
వేదమేక గుణం జస్త్వా తదహ్నైవ విశుధ్ధ్యతే
వేదం అంటే నాదం.దీనినే
వేదం అణువణువున నాదం అంటు భక్తులు కీర్తిస్తారు స్వామిని.అంటే స్వామి శబ్దము ద్వారా ప్రకటింపబడుతున్నాడు/ప్రస్తుతింపబడుతున్నాడు/ప్రసన్నమగుతున్నాడు.
స్వామి వేదస్వరూపమని,
విణ్ణోరం-దేవతలు
మణ్ణుం-మానవులందరు
తుదితాలం-కీర్తిస్తున్నారు.
అంతే కాదు వారు స్వామిని,
ఓద ఉలవా-వర్ణింప శక్యము కాని స్వరూప-స్వభావములు కలవాడు అని తెలిసినప్పటికిని,
స్వామి అనుగ్రహము వారికి పరమాత్మను
వారికి ఒక్కనిగా అనిపించనీయతములేదు.వారు,
స్వామి ఒరుప్పాన్-ఒకవైపున/ఏదమవైపున
పేదై ని-స్త్రీని/అమ్మను దర్శించగలుగుతున్నారు.
స్వామి దర్శనము వారికి అభయమును అందించిచున్నది.ఎందుకంతే స్వామి,
పినా పిళ్లైగళ్-వారి పిల్లలకు,వారి పిల్లలకు/ముందు తరములకు,
కులత్తరంతన్-వంసములకు/సమూహములకు
సంరక్షకుడిగా సాక్షాత్కరిస్తున్నాడు సతీసమేతుడై.
కాని విచిత్రము ఏమిటంటే ఒకసారి బ్రహ్మ-విష్ణు పరమాత్మ మొదలు-చివర కనుగొనవలెనని కిందనున్న ఏదులోకములకు-పైనున్న ఏడులోకములకు వారి వాహనములనెక్కి బయలుదేరి,వెతికి-వెతికి కనుగొనలేకపోయిరట.
నిజముగా బ్రహ్మ-విష్ణు ప్రయ్త్నించి విఫలులైనారనుటలోని అంతరార్థము ఏమిటి?
అహంకారము అను హంసనెక్కి తనకు శక్యముకాని భవిష్యత్తును పట్తుకోవాలనుకొను అవివేకమే కదా ఆ ప్రయత్నము.
బ్రహ్మకు పూలతో ముడిచిన స్వామి సిగ కనరాలేదట-
ఏమా సిగ? దానిలో స్వామి ముడుచుకొనిన పూవులు దేనికి సంకేతము?
విచ్చుకొనుట-సుగంధమును అందించుట వాటి సహజలక్షణము.అహంకారము జ్ఞానమును కప్పివేస్తుంది కనుక
ఆర్ అయినార్-స్వామికి ఇరుగుపొరుగు ఎవరు? అన్న ప్రశ్నకు అహంకారమును విడిచి,మనసును వికసింపచేసుకొను జ్ఞానులు.వారికే స్వామి అనుగ్రహమును పొందుట సాధ్యము.
విష్ణువు ఐక్కద అజ్ఞానముతో కిందకు కిందకు తవ్వుకుంటూ ఎప్పుడో జరిగిపోయిన దానికై ప్రస్తుతమును వదిలివేసి ప్రయత్నించి,
ఆర్ ఉట్రార్-ఎవరు బంధువులు?
అజ్ఞానముచే కప్పబడి,పశుపతి పాసమును అర్థముచేసుకొను స్థితిలో ఉన్నవారుకాదు.అజ్ఞాన బంధమును తొలగించుకొని స్వామి శరనమనే బంధముతో ధన్యులగువారు కదా స్వామి బంధువులు.
ఓ మనసా అహంకారమును-అజ్ఞానమను అధిష్టించి అయోమయములో పదకు.నీ ఎదురుగా నున్న తేజోరాశి యైన పరమాత్మను దర్శించి/భజించి/తరించు,
ఎందుకంటే పరమాత్మ పరమాద్భుతమును గ్రహించుటకు విశ్వరూపము మొదటి సోపానము.నీవు సగుణమును దాటి నిర్గుణ పరబ్రహ్మమును కనుగొనుటకు అంతర్ముఖమగుటయే సరియైన మార్గము.
స్వామి
తొండర్-భక్తుల,
తొండరుళన్-హృత్పద్మములందు
ఒరు తోళన్-ఆ ఒక్క చోటనే
అరన్ ముడివే స్వామి -కొలువై యున్నాడు/ఉంటాడు.
కనుక స్వామిది ఏ వూరు?
ఏ పేరు అన్న శంకను వీడి
శివనోమును నోచుకునుటకు బయలుదేరుతున్నారు.
అంబే శివే తిరువడిగళే శరణం.
Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-18
తనోతు నః శివః శివం-17 ******************* " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment