Tuesday, December 28, 2021
PASURAMU-13
తిరుచిట్రంబలం-పాశురం-13
**********************
పైంగుమళై కార్మలరార్ శెంగమల పైంపోదార్
అంగం కురుగినత్తార్ పిన్నుం అరవత్తార్
తంగళ్ మనం కళవు వార్వందు సార్ధనినాల్
ఎంగళ్ పిరాట్టియుం ఎం కోన్రుం సోర్నిశెయింగ
పొంగు మడువీర్ పుగప్పొందు పాయిందు
శంగం శిలంబ శిలంబు కలందార్ప
కొంగకళపొంగ కుడైయుం పునల్పొంగాన్
పంగయుం పూం పునల్ పాయిండేలో రెంబావాయ్
ఘనాఘనసుందర పోట్రి
*********************
తిరు మాణిక్యవాచగరు ప్రస్తుత పాశురములో మన మానవనేత్రములు అతిసామాన్యముగా భావించే ప్రకృతి లోని కొలను ,కొలనులోని నీలికలువలు,కెందామరలు,పులుగు జంటలు,పాములు,మొదలగు వానిని కనుక మనము కొంచము లోతుగా పరిశీలిస్తేఅవి అన్నియును మనకు భగవత్స్వరూపమును -సద్గుణములను వర్ణించుచున్న ధన్యజీవులే.
భలే భలే అందాలు సృష్టించావు అంటు మనము భగవంతుని కీర్తించవలసినదే.
ప్రస్తుత పాశురములో జలరూపముగా స్వామి దర్శనమిస్తున్న మడుగు/పొయిగై ,
తరులు-గిరులు-విరులు-ఝరులు
నిరతము నీ పాద ధ్యానమే-
నిరతము నీ పాద గానమే అన్నట్లుగా,
స్వామి పాదములను అర్చించుటకు మడుగులోని
కార్మలరార్-నీలికలువలు,అందులోను
పైంగుమళై-సుకుమారమైన నీలికలువలు
వానితో పాటుగా
శెంగమల పైంపోదార్
కెందామరలు/ఎర్రని తామరలు వికసించి సుగంధభరితములై మీ పాదములపై వాలుటకు తహతహలాడుచున్నవి.
అదికాదు.అదికాదు.అవి అసలు పువులు కానేకావు.సాక్షాత్తుగా ఆదిదంపతులైన మీరే,
అమ్మ నీలికలువగా,అయ్య కెందామరగా అనుగ్రహ
పరిమళములను మాపై కురిపిస్తూ,కరుణాంతరంగమునే కొలనుగా మలిచి,మా ముందు సాక్షాత్కరించినారు,
మీ దర్శన భాగ్యముతో మేమే కాదు,మా ముందు ఉన్న,
చిన్న చిన్న జీవులు,తుమ్మెదలు గుంపుగా చేరి మీ వైభవమును వేనోళ్ల కీర్తించుచున్నవి.అవి ఎంతటి భాగ్యమును చేసుకొనినవో.
చెలి అటు చూడు,
కురుంగునత్తార్- అ గువ్వల జంటఒకదానికొకటిదగ్గరయై శ్రవణానందముగా మిమ్ములను సంకీర్తించుచున్నవి.
అని ఒక చెలి అనగానే ,మరొక చెలి.
ఇటువైపు చూడండి చెలులారా!
పువ్వులేకాదు-పులుగులేకాదు ,కొలను జలము సైతము నాగాభరణుని నర్తనమును తలపింపచేయుచు చరచర పాకుతూ,
పిన్నుం అరవత్తాల్ -స్వామిని అర్చించుచున్నదా అన్నట్లుగా వళులు వళులు తిరుగుతూ ప్రదక్షిణమును చేయుచున్నది.
ఇక్కడ పువ్వుల సేవ ను మానసికముగాను-పులుగుల సేవను వాచకముగాను -పాము ప్రదక్షినమును కాయకముగా భావించి ,
చెలులారా మనము ఇంక ఆలస్యము చేయక/తడవు చేయక కుడైయుం-మునకలు వేస్తూ ,దోసిళ్లలోని నీటిని ఒకరిపై ఒకరము చల్లుకుంటూ నాదోపాసనను చేద్దాము అ0టుండగానే మరొకచెలి ,
వింటున్నారా మనతో పాటుగా మన
కరములు జోడిస్తూ కాయక కర్మను చేస్తుంటే , కరములకు అలంకరింపబడిన
శంగం-క ంకణములు ధ్వనులను చేస్తున.
వాచక కర్మను అందులో మేళవిం చి
చభక్తి ప్రపత్తులను మనసుకు అందచేస్తున్నాయి.
అవుననవు ను.
ఒక్కసారి నీటిప్రవాహమువైపు చూపును మరల్చండి .
నీటి అలలు ఆనందముతో ఎగిసిఎగిసి కేరింతలు కొడుతున్నాయి అని మరొక చెలి అనగానే,ఆమె మాటను ఖండిస్తూ,
అవి నీటి అలలకేరింతలు కాదు ఒకసారి గమనించండి.ఆ చప్పుడు
కొంగై కళ్ పొంగ-మన హృదయములలో ఉవ్వెత్తున పొంగుతున్న ఆనందము అనగానే,
సందేహముగా చూస్తున్న చెలులతో
ఆ ఆనందమునకు కారణము ం
ఎంగళ్-మనయొక్క,
పిరాట్టి-జగన్మాత యైన పార్వతి
ఎం-మన యొక్క
కోన్రు-ప్రభువు యైన పరమేశుడు
మనలను
సార్థనినాల్- శరణార్థులుగా స్వీ కరించి అనుగ్రహించబోతున్నారు.
కనుక పంగయుం పూ-ం
పద్మములతో నిండిన
జ్ఞానులు-యోగులతో నిండిన
ఈ మడుగులో
ఆడేలో-మునకలు వేసి
తరించుదాము రండి అని ఒకరితో వేరొకరు కలిసి భగవదనుగ్రహమును సమిష్టిగా పంచుకొనుటకు సిధ్ధమగుచున్నారు.
చెలుల స
సంభాషణమును కనుక గమనిస్తే మనకు ఒక సందేశము సూచిస్తున్నారనిపిస్తుంది ..
అదేమిటంటే
శ్రీ ఆది శంకరులు చెప్పినట్లు ,
"యోగరతోవా భోగరతోవా
సంగరతోవా సంగ విహీనః
యస్య బ్రహ్మణి రమతే చిత్తం
నందతి నందతి నందత్యేవ"
కొలనుగా చూసినా,పూవుగా చూసినా,పులుగుగా చూసినా,కొలువుగాచూసినా,దానిలోని బ్రహ్మమును చూడగలిగిన వాడే/నాడే
బ్రహ్మానందమును ఆస్వాదించగలరు. శివోహం.
అంబే శివే తిరువడిగళే పోట్రి.
Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-18
తనోతు నః శివః శివం-17 ******************* " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment